ములుగు మండలం (ములుగు జిల్లా)

తెలంగాణ ములుగు జిల్లా లోని మండలం


ములుగు మండలం, తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లాకు చెందిన మండలం.[1]

ములుగు
—  మండలం  —
తెలంగాణ పటంలో ములుగు జిల్లా, ములుగు స్థానాలు
తెలంగాణ పటంలో ములుగు జిల్లా, ములుగు స్థానాలు
తెలంగాణ పటంలో ములుగు జిల్లా, ములుగు స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ములుగు జిల్లా
మండల కేంద్రం ములుగు
గ్రామాలు 17
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 362 km² (139.8 sq mi)
జనాభా
 - మొత్తం 61,741
 - పురుషులు 31,197
 - స్త్రీలు 30,544
పిన్‌కోడ్ {{{pincode}}}

ఇది సమీప పట్టణమైన వరంగల్ నుండి 49 కి. మీ. దూరంలో ఉంది. 2016 పునర్వ్యవస్థీకరణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేరిన ఈ మండలం, 2019 లో చేసిన మరో పునర్వ్యవస్థీకరణలో ములుగు జిల్లాలో భాగమైంది.[2][3] ప్రస్తుతం ఈ మండలం ములుగు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 19   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.ఈ మండల ప్రధాన పరిపాలనా కేంద్రం ములుగు

జిల్లా మార్పులు మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్​ జిల్లా పటంలో మండల స్థానం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, ఈ మండలం రెండు సార్లు జిల్లాలు మారింది.

వరంగల్ జిల్లా నుండి జయశంకర్ జిల్లాకు మార్చు

లోగడ ములుగు గ్రామం/ మండలం, వరంగల్, ములుగు రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు,మండలాల ఏర్పాటులో భాగంగా (ములుగు) మండలాన్ని (1+17) పద్దెనిమిది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4].

జయశంకర్ జిల్లా నుండి ములుగు జిల్లాకు మార్చు

2019 ఫిబ్రవరి 16 న ప్రభుత్వం ములుగు జిల్లాను ఏర్పాటు చేసింది.మరో 9 మండలాలతో పాటు ములుగు మండలాన్ని కూడా కొత్త జిల్లాలోకి చేర్చారు.[5][6]

గణాంకాలు మార్చు

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 362 చ.కి.మీ. కాగా, జనాభా 61,741. జనాభాలో పురుషులు 31,197 కాగా, స్త్రీల సంఖ్య 30,544. మండలంలో 16,136 గృహాలున్నాయి.[7]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు.

శాసనసభ నియోజకవర్గం మార్చు

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "ములుగు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. https://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/MULUGU.PDF
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-26. Retrieved 2019-02-21.
  5. "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 Feb 2019. Retrieved 17 Feb 2019.
  6. https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/MULUGU.PDF
  7. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు మార్చు