వాడుక మార్చు

దీనిని ఉపయోగించటానికి తగిన చర్చా పేజీలో, తగు శీర్షికతో కొత్త విభాగం ప్రారంభించి దానిలో {{సహాయం కావాలి}} ముూస చేర్చి ఆ తరువాత మీ సందేహాన్ని లేక సమస్యను వివరించండి. ఒకవేళ కొంతమంది సభ్యులకు (ఉదాహరణకు మీకు సందేహమున్న పేజీలో చర్చావిషయమైన మార్పుని చేర్చినవారు, లేక మీ దృష్టిలో విషయంపై నైపుణ్యం కలవారు, లేక ఆ పేజీకి విశేషంగా కృషి చేసిన వారు) ప్రత్యేకంగా తెలియచేయదలచుకుంటే వివరణలో ఆ సభ్యుల వాడుకరిపేజీలకు వికీలింకులు చేర్చటం ద్వారా వారికి వికీ సూచనల వ్యవస్థ(ఎకో) ద్వారా సందేశాలు పంప వీలుంది.
ఈ లోపల సహాయ సూచికను , సహాయం చేయబడిన పేజీలను , సహాయం లభించని పేజీలను, తరచూ అడిగే ప్రశ్నలను చూడండి.

  • సహాయపడే వారికి గమనిక: మీరు నిర్వాహకులు కాకపోతే సహాయం చేసిన తరువాత {{సహాయం కావాలి}} మూసను మార్చవద్దు. సహాయం కోరిన వ్యక్తి గాని, స్పందన తరువాత నిర్వాహకులు మూసను {{సహాయం చేయబడింది}} తో మార్చవలెను. వారం రోజులలోగా స్పందనలు లేకపోతే {{సహాయం కావాలి-విఫలం}} తో మార్చి అలా మార్చినట్లు వ్యాఖ్య చేర్చండి.

ఈ మూస చేర్చిన పేజీలు వర్గం:సహాయం కోసం ఎదురు చూస్తున్న సభ్యులు లేక పేజీలు అనే వర్గంలోకి చేరిపోతాయి.

తెవికీలో రచ్చబండ, సముదాయ పందిరిలో దీని గణాంకాలను, పేజీలకు లింకులను చూపే సౌకర్యం కలిగించటమైనది.