ఎస్. మైదుకూరు

ఆంధ్రప్రదేశ్, వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు మండల పట్టణం
(మైదుకూరు నుండి దారిమార్పు చెందింది)

ఎస్. మైదుకూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా, ఎస్. మైదుకూరు మండలం లోని గ్రామం, పురపాలకసంఘం పట్టణం. ఇదే పేరుతో ఉన్న మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన ప్రొద్దుటూరు నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 5952 ఇళ్లతో, 24843 జనాభాతో 1058 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 12491, ఆడవారి సంఖ్య 12352. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2278 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 527. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 592933[1].పిన్ కోడ్: 516172.

పట్టణ చరిత్ర మార్చు

ఈ పట్టణానికి మాధవకూరు, క్రమేణా మైదుకూరు అనే పేరు స్ఠిరపడింది అని చెబుతారు.

ఆదిమ మానవుని అవశేషాలు మార్చు

కడప యోగి వేమన విశ్వవిద్యాలయం చరిత్ర శాఖ మైదుకూరు రాణి బావి వద్ద ఉన్న మల్లుగాని బండపై ఆదిమానవుని రేఖాచిత్రాలను గుర్తించారు. ఆ చిత్రాలను అధ్యయనం చేసి అవి కొన్ని బృహత్ శిలాయుగం, నవీన శిలాయుగానికి చెందినవిగా చరిత్ర అధ్యాపకులు తేల్చారు. ఇవి కార్జ, ఐరన్ ఆక్సైడ్‌లతో నిర్మితమై ఉంటాయి. పేరుతో పిలుస్తారని తెలిపారు. ఈ రాతి ఆవాసంలో సుమారు 100 వరకు మానవుల, జంతువుల రేఖాచిత్రాలు వివిధ భంగిమల్లో తెల్లని రంగుతో చిత్రించారన్నారు. త్రిశూలాన్ని ధరించిన మానవులు, తోడేలుపై చేతిలో రెండు వైపులా త్రిశూలాన్ని ధరించిన మనిషి ప్రయాణం, బంతిని చేతబట్టిన మానవులు, తలకు కవచం, గుర్రంపై ఖడ్గంతో పల్లకిలో ప్రయాణించే వీరుడు, గాడిదలతో తలపడే సన్నివేశాలు, చెట్టుపై తేనెపట్టు ఇలా పలు రకాల రేఖాచిత్రాలు గుర్తించామన్నారు. ఇవి కెయోలిన్ అనే బంకమన్నుతో గీశారని వేల సంవత్సరాల కాలం నాటివిగా వివరించారు. ఆదిమానవులు ఉమ్మిని, జంతువుల కొవ్వును, ఎముకల పొడిని జిగురు పదార్థంగా ఉపయోగించారని చెప్పారు.[2]

శాసనసభ నియోజకవర్గం మార్చు

పూర్తి వ్యాసం: మైదుకూరు శాసనసభ నియోజకవర్గం.

ప్రభుత్వ విద్యాసంస్థలు మార్చు

  • మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల
  • జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
  • రవీంద్ర జూనియర్ కళాశాల
  • బాల శివ కళాశాల

ప్రైవేటు విద్యాసంస్థలు మార్చు

  • మేధా జూనియర్ కళాశాల,
  • శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల
  • శాంతినికేతన్ ఉన్నత పాఠశాల,
  • శారదా ఉన్నత పాఠశాల,
  • వశిష్ట ఉన్నత పాఠశాల,
  • శివసూర్య ఉన్నత పాఠశాల,
  • ఆర్.వి.ఎస్.ఆర్.యమ్ ఉన్నత పాఠశాల,
  • టీ.వీ.ఎస్.ఎం. ఉన్నత పాఠశాల,
  • సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాల.
  • శ్రీ సాయి ఉన్నత పాఠశాల.

ప్రభుత్వ వైద్య సౌకర్యం మార్చు

  • ప్రభుత్వ 30 పడకల వైద్యశాల

ప్రైవేటు వైద్య సౌకర్యం మార్చు

  • HCC మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్,
  • రంగసింహ వైద్యశాల,
  • మానస (బద్వెలి సుబ్బరాయుడు ) వైద్యశాల,
  • నాగన్న చిన్నపిల్లల వైద్యశాల.

రక్తనిధి కేంద్రం మార్చు

  • శ్రీ వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ.[3]

రవాణా సౌకర్యాలు మార్చు

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్దు రవాణా సంస్థ బస్సు స్టేషను

బ్యాంకులు మార్చు

అన్నశాలలు మార్చు

  • గుడ్ బాయ్ అన్నశాల,
  • మానస అన్నశాల,
  • బృందావన్ అన్నశాల,
  • రాఘవేంద్ర అన్నశాల.

తపాలా కార్యాలయం మార్చు

తపాలా కార్యాలయం ఉంది.

 
తంతి తపాలా కేంద్రం

వసతి గృహాలు మార్చు

  • ప్రతాప్ వసతి గృహం,
  • శ్రీలేఖ వసతి గృహం,
  • విజయ వసతి గృహం,
  • వేంకటేశ్వర వసతి గృహం

చలనచిత్ర ప్రదర్శనశాలలు మార్చు

  • భారత్
  • వేంకటేశ్వర
  • విజయ్
  • కిరణ్
  • దేవి

పాడి పంటలు మార్చు

ఈ ప్రాంతంలో ఎక్కువగా వరి, కృష్ణాపురం ఉల్లి, పసుపు, ప్రొద్దు తిరుగుడు, మిరప, టమేటా పంటలు సాగు చేస్తారు. ఇక్కడ పండంచే కృష్ణాపురం ఉల్లికి సింగపూర్, శ్రీలంక తదితర దేశాలలో మంచి గిరాకీ ఉంది. ఈ ప్ర్రాంతంలో పాడి పరిశ్రమ కూడా బాగా వృద్ది చెందింది. ప్రతి శనివారం జరిగే 'సంత' లో పెద్ద ఎత్తున క్రయ విక్రయాలు జరుగుతుంటాయి.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

 
కడప మార్గం లోని షాహీ మసీదు
  • శ్రీ పిచ్చమాంబ మఠం, వనిపెంట రోడ్డు,
  • కొత్త పాలెం శ్రీ ఆంజినెయ స్వామి,
  • శ్రీ షిర్దీసాయిబాబా దేవాలయము,
  • షాహి మసీదు, కడప మార్గము
  • మాధవరాయ స్వామి దేవాలయం
  • సి.యస్.ఐ. షాలోము చర్చి,
  • శ్రీ రాములవారి గుడి,
  • పంచముఖ ఆంజనేయ దేవాలయం,
  • వాసవి కన్యక పరమెస్వరి ఆలయం.

పట్టణం విశేషాలు మార్చు

ఈ పట్టణం రాయలసీమ కూడలిగా ప్రసిద్ధి కెక్కింది. తిరుపతి, కడప, నెల్లూరు తదితర నగరాలను కలుపుతూ ఈ పట్టణం ప్రధాన రవాణా కూడలిగా ప్రసిద్ధి కెక్కింది.

మూలాలు మార్చు

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. ""మైదుకూరు రాణి బావి వద్ద రేఖాచిత్రాలు - బృహత్ శిలాయుగానికి చెందినవిగా తేల్చిన చరిత్రకారులు"". www.eenad.net. ఈనాడు. 30 November 2014. Archived from the original on 2014-11-29. Retrieved 30 November 2014.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-05-27. Retrieved 2010-05-10.

వెలుపలి లంకెలు మార్చు