మౌ

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం

మౌ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, మౌ జిల్లా లోని పట్టణం. దీన్ని మౌనత్ భంజన్ అని కూడా అంటారు. ఇది ఒక పారిశ్రామిక పట్టణం. మౌ జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు భాగంలో ఉంది. ఈ పట్టణం చీర పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. ఇది శతాబ్దాల నాటి సాంప్రదాయ వ్యాపారం, పట్టణ ప్రజల పురాతన కళ.[1]

మౌ
పట్టణం
మౌ is located in Uttar Pradesh
మౌ
మౌ
Coordinates: 25°56′30″N 83°33′40″E / 25.94167°N 83.56111°E / 25.94167; 83.56111
దేశంభారతదేశం
రాష్ట్రంUttar Pradesh
జిల్లామౌ
Area
 • Total20 km2 (8 sq mi)
 • Density13,937/km2 (36,100/sq mi)
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
275101
టెలిఫోన్ కోడ్+0547
Vehicle registrationUP-54
లింగనిష్పత్తి978 (as of 2011) /

1540- 1545 మధ్యకాలంలో, హుమాయున్‌ను ఓడించిన షేర్ షా సూరి, తన పాలనలో ఉన్న గొప్ప సూఫీ సాధువు సయ్యద్ అహ్మద్ వాద్వాను కలవడానికి కొల్హువాన్ (మధుబన్) సందర్శించాడు.[2] షేర్ షా కుమార్తెలలో ఒకరైన మహ్వానీ, వాద్వా దర్గాకు సమీపంలో శాశ్వతంగా స్థిరపడింది. మొగలు చక్రవర్తి అక్బర్ అలహాబాద్ వెళ్ళేటప్పుడు మౌ గుండా వెళ్ళాడని జియావుదీన్ బర్నీ రాసాడు. ఆ సమయంలో, మొగలు సైన్యంతో పాటు వచ్చిన ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, టర్కీలకు చెందిన కార్మికులు, చేతివృత్తులవారూ ఇక్కడ శాశ్వతంగా స్థిరపడ్డారు. ఈ చేతివృత్తులవారు కొంతకాలానికి ఇక్కడి సమాజంలో కలిసిపోయారు. వారు తమ కళను సజీవంగానే ఉంచుకున్నారు. తూర్పు ఉత్తర ప్రదేశ్‌లో చేనేత పరిశ్రమ క్రమంగా మరణించినప్పటికీ, మౌ లోని చీర పరిశ్రమ ఇప్పటికీ ఈ ప్రాంతంలో హస్తకళకు చిట్టచివరి స్థావరంగా మిగిలిపోయింది. అక్బర్ కుమార్తెలలో ఒకరైన జహానారా బేగం కూడా ఆ ప్రాంతంలోనే స్థిరపడిందని భావిస్తారు. ఆమె ఇక్కడ ఒక మసీదు నిర్మించింది. ఆ అసలు మసీదు ప్రస్తుతం ఉనికిలో లేదు గానీ, షాహి ఖత్రా అనే ఈ స్థలంలో ఉన్న షాహి మసీదు దాని గత వైభవాన్ని గుర్తు చేస్తుంది.[3]

మౌ ప్రజలు భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు. 1939 లో మహాత్మా గాంధీ, జిల్లా లోని దోహారీఘాట్ ప్రాంతాన్ని సందర్శించాడు.[4]

1932 లో ఆజంగఢ్ జిల్లా ఏర్పాటయింది. 1988 వరకు మౌ ప్రాంతం ఆ జిల్లాలో భాగంగా ఉండేది. 1988 నవంబరు 19 న ఆజంగఢ్ జిల్లా నుండి విడదీసి, మౌ జిల్లాను ఏర్పరచారు.[5]

వాతావరణం మార్చు

శీతోష్ణస్థితి డేటా - Mau
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 23
(73)
26
(79)
33
(91)
39
(102)
42
(108)
40
(104)
34
(93)
33
(91)
33
(91)
33
(91)
29
(84)
25
(77)
33
(90)
సగటు అల్ప °C (°F) 9
(48)
11
(52)
16
(61)
22
(72)
26
(79)
28
(82)
26
(79)
26
(79)
24
(75)
20
(68)
14
(57)
10
(50)
19
(67)
సగటు అవపాతం mm (inches) 12
(0.5)
18
(0.7)
9
(0.4)
0
(0)
0
(0)
96
(3.8)
144
(5.7)
162
(6.4)
201
(7.9)
24
(0.9)
3
(0.1)
6
(0.2)
675
(26.6)
Source: [Mau Weather]

జనాభా మార్చు

మౌలో మతం[6]
మతం శాతం
ఇస్లాం
  
56.76%
హిందూమతం
  
42.98%
జైనమతం
  
0.02%
బౌద్ధం
  
0.01%
ఇతరాలు†
  
0.21%
ఇతరాల్లో
సిక్కుమతం (0.001%), క్రైస్తవం (<0.001%) ఉన్నాయి.

2011 జనగణన ప్రకారం, మౌ పట్టణ జనాభా 2,78,745. అందులో 1,42,967 మంది పురుషులు, 1,35,778 మంది మహిళలు ఉన్నారు. ఆరేళ్ళ లోపు పిల్లల సంఖ్య 42,216. ఇది మౌ జనాభాలో 15.15%. రాష్ట్ర జనాభాలో లింగనిష్పత్తి 912 కాగా మౌలో ఇది 950. పిల్లల్లో లింగనిష్పత్తి 952. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మొత్తమ్మీద పిల్లల్లో లింగనిష్పత్తి 902. మౌలో అక్షరాస్యత 77.13%, ఇది రాష్ట్ర సగటు 67.68% కంటే ఎక్కువ. పురుషుల్లో అక్షరాస్యత 82.37% కాగా, స్త్రీలలో అక్షరాస్యత రేటు 71.60%.

మూలాలు మార్చు

  1. https://www.business-standard.com/article/markets/up-s-silk-saree-sector-gets-a-raw-deal-105062901045_1.html
  2. "Sufi saint's abode now Uttar Pradesh don's den". Articles.timesofindia.indiatimes.com. 2012-02-10. Archived from the original on 2013-09-13. Retrieved 2015-10-05.
  3. https://timesofindia.indiatimes.com/city/lucknow/Sufi-saints-abode-now-dons-den/articleshow/11830609.cms
  4. https://mau.nic.in/about-district/history/
  5. https://www.thehindu.com/news/national/other-states/in-mau-a-complex-tapestry-of-caste-and-religion/article2879547.ece
  6. "Maunath Bhanjan Town Population Census 2011 - 2023". Census 2011. Retrieved 1 June 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=మౌ&oldid=3840173" నుండి వెలికితీశారు