యర్రగుంట్ల నగరపంచాయితీ

యర్రగుంట్ల నగరపంచాయితీ, ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లాకు చెందిన పట్టణ స్థానిక సంస్థలకు చెందిన ఒక నగర పంచాయితీ.ఇది నగర పంచాయితీగా 2012 లో ఏర్పడింది. ఈ నగరపంచాయితీలో 4 మండలాలు, 20 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 470 కి.మీ దూరంలోనూ జిల్లా ప్రధాన కేంద్రం 35 కి.మీ. దూరంలో ఉంది.యర్రగుంట నగర పంచాయతీ, కడప లోక్‌సభ నియోజకవర్గంలోని, జమ్మలమడుగు శాసనసభ నియోజకవర్గం కిందకు చెందిన భాగం.[1]

యర్రగుంట్ల నగర పంచాయతీ
యర్రగుంట్ల
స్థాపన2012
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంనగర పంచాయతీ
జాలగూడుఅధికార వెబ్ సైట్

జనాభా గణాంకాలు మార్చు

2001 లో 26752 గా ఉన్న పట్టణ జనాభా 2011 లో 32574 కు పెరిగింది. గత దశాబ్దంలో 82% పెరిగింది. లింగ నిష్పత్తి 1000 మగవారికి 976 మహిళలు. అక్షరాస్యత రేటు 70% ఉండగా పురుష జనాభాలో 75%, స్త్రీ జనాభాలో 55% అక్షరాస్యులు ఉన్నారు. ఈ నగర పంచాయతీలో 10520 గృహాలు ఉన్నాయి.[2]

చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ మార్చు

ప్రస్తుత చైర్‌పర్సన్‌గా హెచ్.ముసలయ్య, [3] వైస్ చైర్మన్‌గా సుభాష్ రెడ్డి కొనసాగుచున్నారు.[3]

సమీప కర్మాగారాలు మార్చు

  • ఇండియా సిమెంట్స్ - యర్రగుంట్ల
  • ఇండియా సిమెంట్స్ - చిలమకూరు
  • జువారీ సిమెంట్స్ (ప్రస్తుతం ఇటలి సిమెంట్ గ్రూప్)
  • భారతీ సిమెంట్స్ కూడా ఉంది.

ఇతర వివరాలు మార్చు

ఈ నగర పంచాయతీలో 7 రెవెన్యూ వార్డులు, 20 ఎన్నికల వార్డులు ఉన్నాయి. 33 మురికివాడలు ఉండగా మురికివాడలో 24541 జనాభా ఉన్నారు.10 ప్రభుత్వ పాఠశాలలు, ఒక కూరగాయల మార్కెట్ ఉన్నాయి.

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-20. Retrieved 2020-08-09.
  2. "Yerraguntla Population, Caste Data YSR Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-06-25. Retrieved 2020-08-09.
  3. 3.0 3.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు మార్చు