యునైటెడ్ అకాలీదళ్

భారతీయ రాజకీయ పార్టీ

యునైటెడ్ అకాలీ దళ్ (ముత్తాహిదా అకాలీదళ్)[1] అనేది సిక్కు మతం -కేంద్రీకృత రాజకీయ పార్టీ. 2014, నవంబరు 22న అమృత్‌సర్‌లో[2] యునైటెడ్ సిక్కు ఉద్యమం. ఇన్సాఫ్ లెహర్ నాయకులు ఈ పార్టీని స్థాపించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఈ పార్టీకి భాయ్ మొఖం సింగ్ నాయకత్వం వహిస్తున్నారు.[3]

యునైటెడ్ అకాలీదళ్
సెక్రటరీ జనరల్గుర్దీప్ సింగ్ భటిండా
స్థాపన తేదీ2014 నవంబరు 22
రద్దైన తేదీ2020 జూన్ 25
Preceded byయునైటెడ్ సిక్కు ఉద్యమం, ఇన్సాఫ్ లెహర్
ప్రధాన కార్యాలయంశ్రీ అమృతసర్
రాజకీయ విధానంసిక్కుమతం
రంగు(లు)నారింజ

2020, జూన్ 25న భాయ్ మొఖం సింగ్, అతని పార్టీ సభ్యులు పార్టీని రద్దు చేసి సుఖ్‌దేవ్ సింగ్ ధిండా నేతృత్వంలోని కొత్త శిరోమణి అకాలీదళ్ (డెమోక్రటిక్) లో విలీనమయ్యారు.

మూలాలు మార్చు

  1. "UAD".
  2. Jha, Dhirendra K. "Radical Sikh groups see red as RSS gets aggressive in Punjab". Scroll.in.
  3. "former-taksal-leader-bhai-mohkam-singh-floats-political-party-named-united-akali-dal".