యూత్ కాంగ్రెస్ వారపత్రిక

యూత్ కాంగ్రెస్ నెల్లూరు కేంద్రంగా ప్రచురించబడిన తెలుగు వార పత్రిక.

విశేషాలు మార్చు

యూత్ కాంగ్రెస్ పత్రికను నెల్లూరుకు చెందిన కాంగ్రెస్ యువజన నాయకులుగా పేరు పొందిన ఎల్.వి.కృష్ణారెడ్డి 1963 ప్రాంతంలో నెల్లూరులో నెలకొల్పాడు. ఈ పత్రికకు మద్రాసులో న్యాయవాద విద్యనభ్యసించి, నెల్లూరులో న్యాయవాద వృత్తిలో ఉన్న పెన్నేపల్లి గోపాలకృష్ణ సంపాదకులు[1]. అతను నెల్లూరుకు చెందిన పేరొందిన న్యాయవాది మద్దాలి మల్లికార్జునయ్యకు అసిస్టెంటు లాయరుగా ఉండేవాడు. పత్రిక వెనుక లోహియా భావజాలానికి దగ్గరగా ఉన్న వి.ఆర్.కాలేజి అధ్యాపకులు ఏం.పట్టాభిరామారెడ్డి, కావలి వాసి ఎన్.వి.రమణయ్య మొదలయినవారు ఉన్నారు. పత్రిక దాదాపు పాతిక సంవత్సరాలు కొనసాగింది. పత్రిక కాంగ్రెస్ పార్టీ విధానాలను సమర్ధించినా, స్థానికంగా కాంగ్రెస్ నాయకులూ ఆనం చెంచు సుబ్బారెడ్డిని, వారి సోదరులు వెంకటరెడ్డిని, వ్యతిరేకించి ఆనం కుటుంబాల వ్యతిరేక వర్గాన్ని బలపరిచేది. పత్రిక యజమాని ఎల్.వి.కృష్ణారెడ్డి ప్రజలను రెచ్చగొట్టే ఉద్రేకపూరితమైన ఉపన్యాసాలు చేయడంలో దిట్ట. ఈ పత్రికలో అనేకమంది వర్ధమాన రచయితలు రచనలు చేసేవారు. సంపాదకుడుగా పత్రిక నెలకొల్పిన నాటినుంచి పెన్నేపల్లి గోపాలకృష్ణ 1971 సెప్టెంబరు వరకు పనిచేసాడు. ఆతరవాత ఆయన జమీన్ రయితులో సహ సమపాదకులుగా చేరారు. పత్రిక ఆఫీస్ మొదట అదీ భవనంలో, తర్వాత పొగతోటలో కృష్ణారెడ్డి సొంతగా భవనంలో ఉండేదది.అప్పటినుంచి తిరుమూరు సుధాకరరెడ్డి యూత్ కాంగ్రెస్ సంపాదకులుగా బాధ్యత తీసుకొని చనిపోయేవరకు చేసారు. ఈ పత్రికకు ఒకవిధమైన స్ఫర్థ నెల్లూరు వారపత్రిక జమీన్ రైతు తో ఉండేది. ఎల్.వి.కృష్ణారెడ్డి కాంట్రాక్టరుగా హైదరాబాదులో స్థిరపడేవరకు పత్రిక కొనసాగింది. దురదృష్టవశాత్తు ఈ పత్రిక సంపుటాలు ఇప్పుడు ఎవరివద్దా లేవు.

మూలాలు మార్చు

  1. "పుట:Gurujadalu.pdf/6 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2023-04-10.