యోగ సిద్ధి బ్రహ్మమానసపుత్రులలో ఒక్కఁడు. ఇతని భార్య పేరు స్మృతి. ఇతనికి బృహస్పతి, ఉతథ్యుఁడు లేక సంవర్తుఁడు అను నిరువురు కొడుకులును, యోగసిద్ధి అను నొక కూఁతురును కలిగిరి. ఈయోగసిద్ధి అష్టవసువులలో ఒక్కఁడగు ప్రభాసుని వివాహము చేసికొని అతనియందు విశ్వకర్మను కనెను.

తొల్లి అగ్నిదేవుఁడు దేవతలతోడి యలుకచే హవ్యంబుల వహింపనొల్లక వనమునకు చన దేవతలు అధికతపోవిజృంభితుఁడగు అంగిరసుని అగ్నిపదమునందు ఉంచిరి. అంత కొంతకాలమునకు వెనుక అగ్ని మరలి రాఁగా అంగిరసుఁడు అతనిని ప్రథమాగ్నియయి ఉండుమని తాను అతనికి ప్రథమ పుత్రుఁడయి అగ్నిసారూప్యమున తేజరిల్లెను. ఈరూపమున ఇతనికి శివ అను భార్యయందు బృహజ్జ్యోతి, బృహత్కీర్తి, బృహన్ముఖుఁడు, బృహన్మతి, బృహద్భానుఁడు, బృహస్పతి, బృహద్బ్రహ్మ అను ఏడుగురు కొడుకులును, అనుమతి, రాక, సినీవాలి, కుహువు, అర్చిష్మతి, హవిష్మతి, మహామతి అను నేడుగురు కూఁతులును పుట్టిరి. వీరును వీరి సంతతివారందఱును అగ్నిస్వరూపులయి ఉందురు.

మూలాలు మార్చు