రఘునాథ్ కేశవ్ ఖాదిల్కర్

రఘునాథ్ కేశవ్ ఖాదిల్కర్ (15 డిసెంబర్ 1905 - 8 మార్చి 1979) మహారాష్ట్రలోని పూణేకి చెందిన , స్వాతంత్ర్య సమరయోధుడు రాజకీయ నాయకుడు ఆయన కేంద్ర మంత్రిగా పని చేశాడు.

రఘునాథ్ కేశవ్ ఖాదిల్కర్
జననం(1905-12-15)1905 డిసెంబరు 15
నర్సింగ గ్రామం బొంబాయి ప్రెసిడెన్సీ మహారాష్ట్ర భారతదేశం
మరణం1979 మార్చి 8(1979-03-08) (వయసు 73)
జాతీయతభారతీయుడు
విద్యబిఎ ఎల్.ఎల్.బి
విశ్వవిద్యాలయాలులా కాలేజ్
వృత్తికేంద్ర మంత్రి స్వాతంత్ర సమరయోధుడు
సంస్థభారత జాతీయ కాంగ్రెస్,

కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో, రఘునాథ్ కేశవ్ ఖాదిల్కర్ కార్మికుల జీతాన్ని పెంచారు. [1] 1971లో నియమించబడిన బోనస్ రివ్యూ కమిటీ రఘునాథ్ కేశవ్ ఖాదిల్కర్ నేతృత్వంలో ఏర్పాటయింది.

రఘునాథ్ కేశవ్ ఖాదిల్కర్ 1967 నుండి 1969 వరకు లోక్‌సభకు 4వ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశాడు, 1969 నుండి 1971 వరకు పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశాడు. 1971లో కార్మిక పునరావాసశాఖ మంత్రిగా పనిచేశాడు.

, రఘునాథ్ కేశవ్ ఖాదిల్కర్ 1930 1945 మధ్య భారతదేశ స్వాతంత్ర ఉద్యమం లో పాల్గొని అనేకసార్లు జైలు శిక్ష అనుభవించారు. రఘునాథ్ కేశవ్ ఖాదిల్కర్ 1934లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. 1936లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా ఆయన ఎన్నికయ్యారు. రఘునాథ్ కేశవ్ ఖాదిల్కర్ 1948లో కాంగ్రెస్‌ పార్టీని విడిచిపెట్టి, కొంతమంది సహచరులతో కలిసి వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీని స్థాపించాడు. రఘునాథ్ కేశవ్ ఖాదిల్కర్ 1953లో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 1955లో, అతను ఏడు వామపక్ష సంస్థల కూటమి అయిన ఆల్ ఇండియా మజ్దూర్ కిసాన్ పార్టీని ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. సెంట్రల్ కమిటీకి సెక్రటరీ కన్వీనర్‌గా ఎన్నికయ్యాడు.

రఘునాథ్ కేశవ్ ఖాదిల్కర్ 1957లో మజ్దూర్ కిసాన్ పార్టీ అభ్యర్థిగా అహ్మద్‌నగర్ నుండి . లోక్‌సభ కు ఎన్నికయ్యాడు. 1962లో రఘునాథ్ కేశవ్ ఖాదిల్కర్, తను స్థాపించిన మజ్దూర్ కిసాన్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు . కాంగ్రెస్ అభ్యర్థిగా రఘునాథ్ కేశవ్ ఖాదిల్కర్ 1962 1967లో ఖేడ్ నుండి లోక్ సభకు రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1971లో, రఘునాథ్ కేశవ్ ఖాదిల్కర్ బారామతి నుండి సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి ఎంపీగా గెలిచి, కేంద్ర కార్మిక శాఖ మంత్రి అయ్యాడు.

1936 ఆగస్టు 13న రఘునాథ్ కేశవ్ ఖాదిల్కర్ డాక్టర్ శ్రీమతి. చాపలా ఆర్. ఖాదిల్కర్ ను వివాహం చేసుకున్నాడు. ఆమె, [2] పూణేకి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్. రఘునాథ్ కేశవ్ ఖాదిల్కర్ 1979లో మరణించాడు, ఆయనకు నలుగురు కూతుళ్లు ఉన్నారు.

మూలాలు మార్చు

  1. Not Available (1971). Lok Sabha Debates Vol.9,no.11-20 Series.5 Session.3(nov-dec).
  2. "28. RAGHUNATH KESHAV KHADILKAR (R K KHADILKAR) - Congress socialist party (csp) at a glance and short profiles works of its leaders". s.kabeh-ngerti.com. Archived from the original on 7 నవంబర్ 2017. Retrieved 5 November 2017. {{cite web}}: Check date values in: |archive-date= (help)