ఇది 1968లో విడుదలైన తెలుగుచిత్రం. రష్యాలో కొంతకాలం ఉన్న తరువాత గిడుతూరి సూర్యం, ఇండియా వచ్చి చిత్ర దర్శకుడిగా ఈ చిత్రంతో పరిచయమయ్యారు. జానపద చిత్రంలో వామపక్ష భావాలో చొప్పించి తీసిన చిత్రం ఇది. దానిలో భాగంగా శ్రీశ్రీ 'మరో ప్రపంచం' పాటను ఘంటసాల ఈ చిత్రంలో పాడారు.

రణభేరి
(1968 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం గిడుతూరి సూర్యం
నిర్మాణం పింజల సుబ్బారావు
తారాగణం కాంతారావు,
రాజశ్రీ,
వాణిశ్రీ,
జి. రామకృష్ణ,
గీతాంజలి,
రాజనాల
సంగీతం ఎస్.పి.కోదండపాణి
నేపథ్య గానం ఘంటసాల
గీతరచన శ్రీశ్రీ
కళ కుదరవల్లి నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ పి. ఎస్. ఆర్. పిక్చర్స్
భాష తెలుగు

సాంకేతికవర్గం మార్చు

  • కథ- బొమ్మకంటి సుబ్బారావు
  • మాటలు- టి.పి.మహారథి
  • నృత్యం- కె.ఎస్.రెడ్డి
  • సంగీతం- ఎస్.పి. కోదండపాణి
  • స్టంట్స్- మాధవన్
  • కళ- కుదరవల్లి నాగేశ్వరరావు
  • కెమెరా- హెచ్‌.ఎస్.వేణు
  • కూర్పు- కె.యస్.ఆర్.దాస్
  • నిర్మాత- పింజల సుబ్బారావు
  • దర్శకత్వం- గిడుతూరి సూర్యం

తారాగణం మార్చు

  • కాంతారావు - రాజశేఖరుడు/వనవీరుడు
  • రామకృష్ణ - చంద్రశేఖరుడు
  • గీతాంజలి - దేవసేన
  • ప్రభాకరరెడ్డి - గుణశేఖరుడు
  • నిర్మల - సర్వమంగళాదేవి
  • మోహన - మాధురీదేవి
  • ధూళిపాళ - రాజగురువు
  • రాజనాల - రణజిత్తు
  • వాణిశ్రీ - దుర్గ
  • రాజశ్రీ - నందిని
  • రాజబాబు - చినబాబు
  • బాలకృష్ణ,
  • మీనాకుమారి,
  • డా.రమేష్,
  • జ్యోతిలక్ష్మి,
  • పెమ్మసాని రామకృష్ణ,
  • జూ.భానుమతి
  • మోదుకూరి సత్యం
  • ఏడిద నాగేశ్వరరావు
  • వల్లం నరసింహారావు
  • సుంకర లక్ష్మి
  • ధనశ్రీ

చిత్రకథ మార్చు

కంఠాన రాజ్య ప్రభువు గుణశేఖరుడు (ప్రభాకర్‌రెడ్డి) పెద్ద భార్య సర్వమంగళాదేవి (నిర్మల) ఆమెకు ఇద్దరు కుమారులు రాజశేఖరుడు, చంద్రశేఖరుడు. చిన్నభార్య మాధురీదేవి (మోహన). ఆమెకొక కుమారుడు. వేటకు వెళుతూ మహారాజు, సర్వమంగళను, కుమారులిద్దరినీ తీసుకువెళతాడు. అక్కడ రాజశేఖరుడు పాముకాటుకు గురై తప్పిపోతాడు. అతని కోసం వెతుకుతూ వెళ్లిన మహారాణి పిచ్చిదానిగా మారుతుంది. భార్య జాడ తెలియని మహారాజు రాజ్యం చేరి, చంద్రశేఖరుని భారం చిన్నరాణి కప్పగిస్తాడు. పాముకాటుకు గురైన రాజశేఖరుని ధర్మయ్య కాపాడి తన కూతురు దుర్గతో సమంగా, వనవీరుడి (కాంతారావు)గా పెంచుతాడు. యువరాజు చంద్రశేఖరుడు (రామకృష్ణ) అవంతి రాకుమారి దేవసేన (గీతాంజలి)ని ప్రేమిస్తాడు. గుణశేఖరుని వల్ల తమ తండ్రి మరణించాడని భావించే ఆమె తల్లి, అన్న ఈ ప్రేమకు అంగీకరించకపోయినా, చంద్రశేఖరుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. గుణశేఖరుని రాజ్యంలో మహామంత్రి, రాజగురువు (ధూళిపాళ) సేనాపతి రణజిత్తు (రాజనాల) అతని అనుచరులు ప్రజలను హింసించి, కొల్లగొట్టి ధనం సంపాదిస్తుంటారు. వనవీరుడు వీరిని ఎదిరిస్తుంటాడు. యువరాజుకు ఈ విషయాలు తెలియవు. అన్నగారి పేరిట మహాస్తూపం నిర్మించాలన్న భావనతో ప్రజల నుండి శ్రమశక్తిని, ధనా న్ని ఉపయోగించమని రణజిత్తుకు అనుజ్ఞ ఇస్తాడు. వనవీరుడు విప్లవ సైన్యాన్ని సిద్ధం చేసుకొని దుర్గ (వాణిశ్రీ) సాయంతో వారి యత్నాలు విఫలం చేస్తుంటాడు. రణజిత్తు పంపగా వచ్చిన, గూఢచారిణి నందిని (రాజశ్రీ) వనవీరుని మంచితనం తెలుసుకుని అతన్ని ప్రేమిస్తుంది. దుర్గ తనకు వనవీరునికి మధ్య ఆమె అడ్డు వచ్చిందని కోపంతో రణజిత్తు వద్దకు వెళ్లి వనవీరుడి జాడచెప్పి బంధింపచేస్తుంది. రాజాజ్ఞచే వనవీరుని ఉరితీయబోతుండగా విప్లవ సైన్యంతో నందిని, పిచ్చికుదిరిన మహారాణి బయలుదేరి వెళ్లి ఉరిని తప్పించటం, చంద్రశేఖరునికి నిజం తెలియటం, ఓ మాంత్రికుడు నాగభూషణం తీర్చిదిద్దిన దుష్టశక్తిని సోదరులు అంతం చేయటం, దీనికి కుట్ర చేసింది చినబాబు (రాజబాబు) అని తెలియటం అతను మరణించడంతో చిత్రం ముగుస్తుంది.[1]

పాటలు మార్చు

  • ఇంతేలే వీరుల గాథ ఇంతేలే త్యాగుల గాథ విప్లవ విజయం - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
  • మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది - ఘంటసాల బృందం - రచన: శ్రీశ్రీ
  • వచ్చింది ఏమో చెయ్యాలని నేను వచ్చింది కాని నేనే -
  • , ఘంటసాల - రచన: డా. సి.నారాయణ రెడ్డి
  • వలపు కౌగిళ్లలో , పి.బీ . శ్రీనివాస్ , సుశీల , రచన: ఆరుద్ర
  • ఇది కూడదురా , ఎస్.జానకి, రచన: ఆరుద్ర
  • నీకన్నా చక్కని చుక్కెవరే , ఎల్ ఆర్.ఈశ్వరి , పిఠాపురం,నాగేశ్వరరావు,రచన: కొసరాజు
  • చాలదోయీ చాలదోయీ, ఎస్.జానకి , రచన: ఆరుద్ర
  • మోహబ్బత్ లో ఉంది మజా , పి.సుశీల, రచన:కొసరాజు.

మూలాలు మార్చు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
  1. ఎస్.వి.రామారావు, సి.వి.ఆర్ మాణిక్యేశ్వరి (3 March 2018). "రణభేరి (ఫ్లాష్‌బ్యాక్@50)". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 19 February 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=రణభేరి&oldid=4197036" నుండి వెలికితీశారు