రమేష్ రాజారామ్ పొవార్ (జననం 1978 మే 20) మాజీ భారత క్రికెట్ ఆటగాడు.

రమేష్ పొవార్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1978-05-20) 1978 మే 20 (వయసు 45)
ముంబై, మహారాష్ట్ర, India
ఎత్తు5 ft 4 in (1.63 m)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ స్పిన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 257)2004 మే 18 - బంగ్లాదేశ్ తో
చివరి టెస్టు2007 మే 25 - బంగ్లాదేశ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 155)2004 మార్చి 16 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే2007 అక్టోబరు 2 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1999–2013ముంబై
2013–2014రాజస్థాన్
2014–2015గుజరాత్
2008–2010, 2012కింగ్స్ XI పంజాబ్
2011కొచ్చి టస్కర్స్ కేరళ
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 2 31 148 113
చేసిన పరుగులు 13 162 4,245 1,081
బ్యాటింగు సగటు 6.50 11.64 26.53 17.15
100లు/50లు 0/0 0/1 7/17 0/4
అత్యుత్తమ స్కోరు 7 54 131 80
వేసిన బంతులు 252 1,536 29,158 5,557
వికెట్లు 6 34 470 142
బౌలింగు సగటు 19.66 35.02 31.31 30.92
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 27 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 4 0
అత్యుత్తమ బౌలింగు 3/33 3/24 7/44 5/53
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 3/– 51/0 25/–
మూలం: CricketArchive, 2011 డిసెంబరు 16

పొవార్ 2000లో బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ మొదటి బ్యాచ్‌లో ఎంపికయ్యాడు. [1] 2021 జూన్ నెలలో భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్‌గా ఎంపికయ్యాడు.

పొవార్ పదవీకాలంలో శ్రీలంక పర్యటన, అక్టోబరులో వెస్టిండీస్‌లో ద్వైపాక్షిక సిరీస్, తర్వాత నవంబరులో వెస్టిండీస్‌లో ICC మహిళల ప్రపంచ T20 ఉంటుంది.

కెరీర్‌ మార్చు

పొవార్ అనేక సీజన్లలో దేశీయ క్రికెట్‌లో స్థిరమైన ప్రదర్శన కనబరిచాడు. 2002-03 సీజన్‌లో రంజీ ట్రోఫీలో ముంబై క్రికెట్ జట్టు సాధించిన విజయంలో కీలక పాత్ర పోషించాడు. పొవార్ 16 సంవత్సరాలు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు [2]

పొవార్ లివర్‌పూల్ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ కాంపిటీషన్‌లో సెఫ్టన్ పార్క్ తరపున ఆడాడు. 2005 జూలైలో గాయపడిన వినాయక్ మానేకి ప్రత్యామ్నాయంగా సంతకం చేశాడు. అతను పది గేమ్‌లలో 32.5 సగటుతో 325 పరుగులు చేసి, 21 సగటుతో 25 వికెట్లు తీసుకున్నాడు. [3]

పాకిస్థాన్‌లో పర్యటించే భారత జట్టులో తొలిసారిగా ఎంపికయ్యాడు. అతను 2006 ప్రారంభం వరకు మళ్లీ వన్‌డే జట్టులోకి రాలేదు. దేశీయ మ్యాచ్‌లలో 63 వికెట్లు తీసుకున్నాక, 2005-06 లో మళ్ళీ భారత జట్టులో అవకాశం వచ్చింది.

అయితే, 2007 జనవరిలో గాయం కారణంగా అతన్ని జట్టు నుండి తొలగించారు. 2007 క్రికెట్ ప్రపంచ కప్‌కు ముందు అనిల్ కుంబ్లే రెండవ స్పిన్నర్‌గా వచ్చాడు. కానీ అతని పేలవమైన ఫీల్డింగ్ నైపుణ్యం అతనిని భారత జట్టు నుండి మినహాయించడానికి మార్గం సుగమం చేసింది. 

2008 మేలో, అతను కింగ్స్ XI పంజాబ్ తరపున ఐపిఎల్‌లో ప్రవేశించాడు. అతను వేసిన మొదటి ఓవర్‌లోనే ఒక వికెట్ తీశాడు. ఐపిఎల్ మొదటి మూడు సీజన్లలో కింగ్స్ XI పంజాబ్కు ప్రాతినిధ్యం వహించాడు. 2011లో ఐపీఎల్‌లో కొచ్చి టస్కర్స్ కేరళ ఫ్రాంచైజీ జట్టుక్లో ఆడాడు. 2012లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడాడు.


2013లో, ముంబై క్రికెట్ జట్టుకు 14 ఫస్ట్-క్లాస్ సీజన్‌లకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత, రాజస్థాన్ క్రికెట్ జట్టుకు మారాడు. ఆరు మ్యాచ్‌లలో 62.20 సగటుతో 10 వికెట్లు తీశాడు. కానీ 2014లో, రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌ను BCCI సస్పెండ్ చేయడంతో రాజస్థాన్ క్రికెట్ జట్టు నుండి తప్పుకున్నాడు. ఆ తరువాతి సీజన్‌లో గుజరాత్ క్రికెట్ జట్టులో చేరాడు. [4]

2015 నవంబరులో పొవార్, 2015-16 రంజీ ట్రోఫీ ముగిసిన తర్వాత అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. [5]

తాత్కాలిక ప్రాతిపదికన అతన్ని భారత మహిళల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా నియమించారు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక నివేదిక ప్రకారం, జూలై 25 నుండి ఆగస్టు 3 వరకు బెంగళూరులో జరగనున్న శిబిరాన్ని పర్యవేక్షించవలసిందిగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అతన్ని కోరింది. 2021 ఫిబ్రవరిలో అతన్ని విజయ్ హజారే ట్రోఫీకి ముంబై జట్టు ప్రధాన కోచ్‌గా నియమించారు. [6] [7] భారత మహిళల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రమేష్ పొవార్‌ను నియమించినట్లు క్రికెట్ పాలకమండలి అధికారిక ప్రకటన విడుదల చేసింది. [8]

వ్యక్తిగత జీవితం మార్చు

అతను ముంబై మాతుంగాలోని రూపారెల్ కాలేజ్ ఆఫ్ సైన్స్, కామర్స్ అండ్ ఆర్ట్స్‌లో పూర్వ విద్యార్థి. అతని సోదరుడు కిరణ్ పొవార్ కూడా క్రికెట్ ఆడాడు. అతను విదర్భ క్రికెట్ జట్టుకు అండర్-19 కోచ్‌గా ఉన్నాడు. [9]

వివాదాలు మార్చు

2018 మహిళల ప్రపంచ కప్‌లో, బ్యాటర్ మిథాలీ రాజ్‌తో రమేష్ గొడవ పడ్డాడు. దాని పర్యవసానంగా ఆమెను సెమీఫైనల్ ఆడేందుకు అనుమతించలేదు. ప్రపంచకప్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శనకు ఈ ఘటనే కారణమని పలువురు అభిమానులు అంటారు.[10]

మూలాలు మార్చు

  1. Ramchand, Partab (2000-04-15). "First list of NCA trainees". Cricinfo. Retrieved 2007-02-08.[permanent dead link]
  2. Veera, Sriram (10 December 2016). "The art of bowling spin at Wankhede". Retrieved 10 December 2016.
  3. "Sefton Park CC – Site". 2013-12-09. Archived from the original on 2013-12-09. Retrieved 2018-12-06.
  4. Ramesh Powar signs for Gujarat
  5. "Ramesh Powar to retire after 2015–16 Ranji Trophy". ESPNcricinfo. Retrieved 10 November 2015.
  6. "Mumbai gets new coach in Ramesh Powar ahead of Vijay Hazare Trophy". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-02-09. Retrieved 2021-03-11.
  7. Gaurav Gupta (9 February 2021). "CIC has its way: Ramesh Powar is new Mumbai coach | Cricket News". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-03-11.
  8. "Ramesh Powar Appointed As Indian Women's Team Head Coach". sixsports (in ఇంగ్లీష్). Retrieved 14 May 2021.[permanent dead link]
  9. Vijay Telang appointed Vidarbha coach
  10. "Hindustan Times".