రసాయన శక్తి అంటే ఏవైనా రసాయన పదార్థాలు చర్యకు లోనై వేరే పదార్థాలుగా మారినపుడు అందులో భాగంగా వెలువడే శక్తి. రసాయన శక్తిని నిల్వ ఉంచే పదార్థాలకు కొన్ని ఉదాహరణకు, బ్యాటరీలు (ఘటాలు),[1] ఆహారం, గ్యాసోలిన్ మొదలైనవి.[2][3] రసాయన బంధాలను విడగొట్టడం, మళ్ళీ కలపడం లాంటి చర్యలకు శక్తి అవసరం అవుతుంది. ఈ శక్తి వ్యవస్థలో శోషించబడవచ్చు, లేదా బయటకు వెలువడవచ్చు. చర్యలో పాల్గొనే అభిక్రియా కారకాలలో బలహీన మైన ఎలక్ట్రాన్ జంటలు ఉండి, అవి బలమైన బంధాలు కలిగిన ఉత్పత్తులుగా మారితే అందులోనుంచి శక్తి విడుదల అవుతుంది.[4] కాబట్టి బలహీన బంధాలు కలిగిన అస్థిరమైన అణువుల్లో ఎక్కువ రసాయన శక్తి నిల్వచేయబడి ఉంటుంది.[5]

మూలాలు మార్చు

  1. Schmidt-Rohr, K. (2018). "How Batteries Store and Release Energy: Explaining Basic Electrochemistry", J. Chem. Educ. 95: 1801-1810. http://dx.doi.org/10.1021/acs.jchemed.8b00479
  2. Weiss, H. M. (2008). "Appreciating Oxygen". J. Chem. Educ. 85 (9): 1218–19. Bibcode:2008JChEd..85.1218W. doi:10.1021/ed085p1218. Archived from the original on October 18, 2020. Retrieved March 13, 2017.
  3. Schmidt-Rohr, K. (2015). "Why Combustions Are Always Exothermic, Yielding About 418 kJ per Mole of O2", J. Chem. Educ. 92: 2094-2099. http://dx.doi.org/10.1021/acs.jchemed.5b00333
  4. Moore, J. W; Stanitski, C. L., Jurs, P. C. (2005).Chemistry – The Molecular Science, 2nd edition. Brooks Cole. p. 242.
  5. McMurry, J.; Fay, R. C. (2001).Chemistry, 3rd edition. Prentice Hall. p. 302.