రహస్యం (2019 సినిమా)

రహస్యం 2019లో విడుదలైన తెలుగు సినిమా. భీమవరం టాకీస్ బ్యానర్ పై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు సాగర్ శైలేష్ దర్శకత్వం వహించాడు.[1][2] శైలేష్, శ్రీ రితిక, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జబర్దస్త్ అప్పారావు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 01, 2019న విడుదలైంది.[3]

రహస్యం
దర్శకత్వంసాగర్ శైలేష్
నిర్మాతతుమ్మలపల్లి రామసత్యనారాయణ
తారాగణంసాగర్ శైలేష్, శ్రీ రితిక, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జబర్దస్త్ అప్పారావు
ఛాయాగ్రహణంసుధాకర్ అక్కినపల్లి
సంగీతంకబీర్ రఫీ
నిర్మాణ
సంస్థ
భీమవరం టాకీస్
విడుదల తేదీ
2 ఫిబ్రవరి 2019
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

రవి (శైలేష్) సినిమా డైరెక్షన్ అవకాశాల కోసం వెతుకుతుంటాడు. ఈ క్రమంలో రవి తీసిన షార్ట్ ఫిల్మ్ చూసి ఆకర్షితుడైన అయిన నిర్మాత (తుమ్మలపల్లి రామసత్యనారాయణ) ఓ మంచి హర్రర్ కామెడీ స్క్రిప్ట్ రాసుకొని వస్తే అతనికి దర్శకత్వం చేసే అవకాశం ఇస్తానంటాడు. ఈ క్రమంలో హర్రర్ కథ రాయాలంటే దెయ్యానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి అతని మిత్రులతో కలిసి ఓ మాంత్రికుడు (జబర్దస్త్ అప్పారావు) దగ్గరికి వెళ్తాడు. అక్కడ జరిగిన కొన్ని పరిమాణాల మధ్య దివ్య (దెయ్యం) రవి వెంట పడుతుంది. ఇంతకీ దివ్య ఎవరు ? ఆమె ఎలా చనిపోయింది ? రవి చుట్టే ఎందుకు తిరుగుతుంది ? అసలు రవి తీసే సినిమాలోనే ఆమె ఎందుకు నటించాలనుకుంది ? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు మార్చు

  • శైలేష్
  • శ్రీ రితిక
  • తుమ్మలపల్లి రామసత్యనారాయణ
  • జబర్దస్త్ అప్పారావు
  • నరేన్ రెడ్డి
  • నాగాభట్ల చైతన్య
  • సందీప్ కృష్ణ
  • శ్రీనివాస్
  • స్రవంతి
  • సందీప్ కడిమే
  • మాస్టర్ అఖిల్

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: భీమవరం టాకీస్
  • నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సాగర్ శైలేష్
  • సంగీతం: కబీర్ రఫీ
  • సినిమాటోగ్రఫీ: సుధాకర్ అక్కినపల్లి

మూలాలు మార్చు

  1. Sakshi (11 November 2018). "రహస్యం హిట్‌ అవ్వాలి". Archived from the original on 9 September 2021. Retrieved 9 September 2021.
  2. CineJosh (31 December 2018). "Srikanth Supports Rahasyam Movie వర్మ, పూరి, మారుతి.. ఇప్పుడు శ్రీకాంత్". Archived from the original on 9 మే 2019. Retrieved 9 September 2021.
  3. The Times of India (1 February 2019). "Rahasyam Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 9 September 2021. Retrieved 9 September 2021.