టిబెట్ (Tibet) దేశంలో మానసరోవరానికి, కైలాస పర్వతానికి చేరువలో పశ్చిమాన ఉన్న సరస్సు రాక్షస్తల్. ఇది ప్రధానంగా ఉప్పునీటి సరస్సు. ఈ సరస్సు నైరుతి (North west) మూల నుండి సట్లజ్ (Satluj) నది ఆవిర్భవిస్తుంది. ఈ ఉప్పునీటి సరస్సులో చేపలు గాని, నీటి మొక్కలు గాని ఉండవు. రాక్షస్తల్ లో తొప్సర్మ (Topserma), దోల (Dola), లచాతొ (Lachato), దోషర్బ (Dosharba) అను నాలుగు ద్వీపాలు ఉన్నాయి. రాక్షస్తల్ సరస్సు గంగా చూ (Ganga Chhu) అనే చిన్న కాలువ ద్వారా మానసరోవరం తో అనుసంధానమైయుంటుంది. 250 చదరపు కిలోమీటర్ల వ్యాసార్ధం కలిగియుండే ఈ సరస్సు సముద్ర మట్టానికి 4,575 మీటర్ల ఎత్తులో ఉన్నది. ఈ సరస్సులో మొక్క జాతి లేనప్పటికీ, గుళక రాళ్ళు తెల్లగాను, కొండ రాళ్ళు ముదురు ఎరుపు రంగులోను, నీరు ముదురు నీలంలోను ఉండటం గమనార్హం. ఈ సరస్సు వద్ద వాతావరణం మానసరోవరం మాదిరిగానే ఉంటుంది. చలికాలంలో రాక్షస్తల్ వద్ద పెరిగే గడ్డి కోసం స్థానిక ప్రజలు తమ పశువులతో వస్తారు.

రాక్షస్తల్
ప్రదేశంTibet
అక్షాంశ,రేఖాంశాలు30°41′00″N 81°14′00″E / 30.68333°N 81.23333°E / 30.68333; 81.23333

హిందువులు రాక్షస్తల్ ను రావణ సరస్సు (Ravan Tal) అని కూడా పిలుస్తారు. సుప్రసిద్ధ రామాయణం కావ్యం ప్రకారం లంకాపతి అయిన రావణుడు ఇక్కడే ఘోర తపస్సు చేసి శివుడినుండి శక్తుల్ని పొందాడు. కనుక హిందూ మత చాందస్తులు ఈ సరస్సును దర్శించరు, ఇక్కడ ఎటువంటి పూజలు జరుపరు. బౌద్ధుల నమ్మకం ప్రకారం మానసరోవరము వెలుగుకి ప్రతీక అయితే, రాక్షస్తల్ చీకటికి ప్రతీక. మానస సరోవరానికి వచ్చే యాత్రీకులు ఈ సరస్సును అందాలను తిలకించడానికి మాత్రమే దర్శిస్తుంటారు.

ఇంకా చదవండి మార్చు

  1. మానస సరోవరం
  2. కైలాస పర్వతము