రామకృష్ణాపురం (హైదరాబాదు)

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.

రామకృష్ణాపురం (ఆర్.కె.పురం), నేరెడ్ మెట్ లోని ఒక కుగ్రామం, ఇపుడు పూర్తి నివాస ప్రాంతంగా అభివృధి చెందింది.తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇది సికింద్రాబాదుకు సమీపంలో ఉంది. ఇది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మల్ కాజ్ గిరి మండలంలోని నేరెడ్‌మెట్‌ గ్రామ పరిధిలోకి వస్తుంది. [1] ఇక్కడ అనేక కాలనీలు, టౌన్‌షిప్‌లు, అపార్ట్‌మెంట్‌లు వచ్చాయి.[2]

రామకృష్ణాపురం
ఆర్.కె. పురం (ఆర్కె పురం), నేరేడు మెట్టు
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చెల్-మల్కాజ్‌గిరి
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500056
Vehicle registrationటిఎస్ 08
లోక్‌సభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

ఉప ప్రాంతాలు మార్చు

ఇక్కడ సప్తగిరి కాలనీ, భరణి కాలనీ, చంద్రబాబునాయుడు కాలనీ, రాఘవేంద్ర నగర్, మాతృపురి కాలనీ, జికె కాలనీ, బృందావన్ కాలనీ, ప్రేమ్ నగర్, అనంతయ్య కాలనీ, సంతోష్ కాలనీ, బాలాజీ కాలనీ, శ్రీ వెంకటేశ్వర కాలనీ, ఆఫీసర్స్ కాలనీ, ఆర్‌కె పురం విలేజ్, శ్రీ కాలనీ, బ్యాంక్ కాలనీ, అనంత సరస్వతి కాలనీ మొదలైన ఉపప్రాంతాలు ఉన్నాయి.

సేవలు మార్చు

పాఠశాలలు మార్చు

  • ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్.కె.పురం.
  • సెయింట్ మదర్ థెరిసా హైస్కూల్, ఆర్.కె.పురం

సరస్సులు, నీటి పార్కులు మార్చు

రవాణా మార్చు

 
రామకృష్ణాపురం గేట్ రైల్వే స్టేషన్ వద్ద కాచిగూడ యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఆర్‌కె పురం మీదుగా సికింద్రాబాద్, తిరుమలగిరి, ఇసిఐఎల్ ఎక్స్ రోడ్డు, ఆర్కె పురం బ్రిడ్జ్, ఆర్కె పురం రైతు బజార్ వంటి ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[4] ఇక్కడ రామకృష్ణాపురం గేట్ రైల్వే స్టేషను ఉంది.[5] సమీపంలో మెట్టుగూడ మెట్రో స్టేషను ఉంది.

మూలాలు మార్చు

  1. "Ramakrishnapuram, Malkajgiri, Secunderabad, Ranga Reddy Locality". www.onefivenine.com. Retrieved 2021-02-01.
  2. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 15 June 2019. Retrieved 2021-02-01.
  3. TelanganaToday. "RK Puram lake to wear new look". Telangana Today. Retrieved 2021-02-01.
  4. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-02-01.
  5. Jan 26, Preeti Biswas / TNN / Updated:; 2020; Ist, 13:10. "GHMC plans new railway overbridge at RK Puram to ease traffic, DPR being finalised". The Times of India. Retrieved 2021-02-01. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)