రుకైయా సుల్తాన్ బేగం

మొఘలు చక్రవర్టినిగా 1557 నుండి 1605 వరకు మొదటి భార్యగా " రుకైయా సుల్తాన్ బేగం " మొఘలు చరిత్రలో ప్రాధాన్యత వహించింది.[2] అక్బర్ చక్రవర్తికి పట్టమహిషిగా ఉంది.[3][4][5] రుకైయా సుల్తాన్ బేగం (ప్రత్యామ్నాయ స్పెల్లింగ్: రుక్యాయ, రుకీయ్యా) మూడవ మొఘల్ చక్రవర్తి అక్బర్ యాభై సంవత్సరాల పదవీకాలం వరకు మొఘలు సామ్రాజ్యానికి ఆమె సుదీర్ఘమైన సేవలను అందించింది.[6]

Ruqaiya Sultan Begum
Shahzadi of the Mughal Empire
Empress consort of the Mughal Empire Padshah Begum
Tenureసుమారు 1557 – 1605
PredecessorBega Begum
SuccessorSaliha Banu Begum
జననంసుమారు 1542
Kabul, Mughal Empire (modern day Afghanistan)
మరణం1626 జనవరి 19(1626-01-19) (వయసు 83–84)[1]
Agra, Mughal Empire (modern day India)
Burial
SpouseAkbar
HouseTimurid (by birth)
తండ్రిHindal Mirza
తల్లిSultanam Begum
మతంIslam


రుక్యయ తన భర్తకు మొదట బంధువు, పుట్టినప్పటికి ఒక మొఘలు యువరాణి. ఆమె తండ్రి హిండాల్ మిర్జా, అక్బరు తండ్రి హుమాయును తమ్ముడు. ఆమె తొమ్మిది సంవత్సరాల వయస్సులో అక్బరుతో నిశ్చితార్ధం 14 సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్నప్పటికీ. ఆమె వివాహం అంతంతమాత్రంగానే ఉండిపోయింది. తరువాతి కాలంలో రుకైయా అక్బర్ అభిమాన మనవడు ఖుర్రం (భవిష్యత్ చక్రవర్తి షాజహాన్) ను దాదాపు దత్తత తీసుకుని సంరక్షింది. అక్బర్ పట్టమహిషిగా రుకైయా అతనిపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. తన భర్త, సవతి కుమారుడు జహంగీర్ మధ్య 16 సంవత్సరాల ప్రారంభంలో తండ్రి-కొడుకు సంబంధం పుల్లనిదిగా విషమించినప్పుడు వారిరువురి మధ్య సంబంధాన్ని పునరుద్ధరించడంలో ఒక కీలక పాత్ర పోషించింది, చివరికి మొఘల్ సింహాసనాన్ని జహంగీరును చేర్చింది.[7] ఆమె దత్తు కుమారుడు, షాజహాన్ ఒక వారసత్వ పోరాటం తర్వాత సింహాసనాన్ని అధిష్టించడానికి కేవలం ఒక సంవత్సరం ముందు మరణించింది.

కుటుంబం, వారసత్వం మార్చు

 
Hindal Mirza, presents young Akbar's portrait to Humayun, during Akbar's circumcision celebrations in Kabul, c. 1546 AD[8]

రుక్రైయా సుల్తాన్ బేగం మొఘల్ యువరాణిగా తైమూరు రాజవంశంలో జన్మించింది. మొఘల్ యువరాజు హిందాలు మిర్జా ఏకైక కుమార్తె. ఆయన మొదటి మొఘల్ చక్రవర్తి బాబర్ భార్య దిల్దార్ బేగం చిన్న కుమారుడు.[9] రుకయాతల్లి సుల్తానం బేగం ముహమ్మద్ ముస్జా ఖ్వాజా కుమార్తె. ఆమె మహది ఖ్వాజా చెల్లెలు. మహది ఖ్వాజా బాబర్ చక్రవర్తి బావ.[10] రుకైయాకు ఇస్లామిక్ ముహమ్మదు కుమార్తె రుకైయా బైంట్ ముహమ్మద్ పేరు పెట్టారు.[1]

రుకైయా పెదనాన మొఘల్ చక్రవర్తి హుమయూన్ (తరువాత ఆమె మామగారు అయ్యాడు), ఆమె అత్త ఇంపీరియల్ యువరాణి హుమయూన్-నామా (బుక్ ఆఫ్ హుమాయున్) రచయిత గుల్బాడాన్ బేగం.[11] బాబర్ చక్రవర్తి మనుమరాలిగా ఉన్న రుక్యయ మిరన్ షాహీ పుట్టినప్పటి[1]నుండి ఆమె భర్త అక్బరును ఇష్టపడుతూ ఉంది. ఆమె మద్య ఆసియన్ ఉన్నత రాజవంశానికి చెందిన మహిళ.[12][13] అందువలన రుకయా అక్బరుకు సమాన హోదా కలిగిన మొఘల్ వంశస్థురాలిగా అక్బరు పట్టమహిషిగా ఉంది.

అక్బరుతో వివాహం మార్చు

1551 నవంబరు 20 న హిందూల్ మీర్జా, హుమాయున్ కోసం వారి అర్ధ సోదరుడు కమ్రాన్ మిర్జా దళాల మీద పోరాడుతూ మరణించాడు. ఆయన తన పట్ల అవిధేయత ప్రదర్శించినప్పటికీ హుమయూన్ తన చిన్న సోదరుని మరణం గురించి దుఃఖంతో బాధపడ్డాడు. తన సోదరుడు చక్రవర్తి సేవలో అమరవీరుడుగా పడిపోయినందుకు సోదరుడు దీవించినలు అందుకుంటాడని అమీరులు హుమాయూనును ఓదార్చారు.[14]

హుమాయూను ఆయన సోదరుని జ్ఞాపకార్థం తొమ్మిది ఏళ్ల కుమార్తె రుకైయాకు తన కుమారుడు అక్బరునితో నిశ్చితార్ధం చేసి గౌరవించాడు. అక్బరు మొదటిగా గజ్ని ప్రావింసులో వైస్రాయిగా నియమించబడ్డాడు. వారి నిశ్చితార్ధం ఆఫ్గనిస్తానులోని కాబూల్లో జరిగింది.[15][16] వారి నిశ్చితార్ధంలో హుమయూన్ జంటకు సంపద, సైన్యం, హిందాలు, గజ్ని జాగీరులకు అక్బరు వైస్రాయిగా నియమితుడయ్యాడు. రుకైయా తండ్రి సైన్యం కూడా అక్బరుకు స్వాధీనం చేయబడింది.[16][14]

1556 లో హుమాయున్ మరణం తరువాత రాజకీయ అనిశ్చితి సమయంలో, రుకైయా చక్రవర్తి కుటుంబానికి చెందిన ఇతర మహిళా సభ్యులు కాబూల్లో ఉన్నారు.[17] 1557 లో సికందర్ షా ఓడించి మొఘలులకు అప్పగించిన కొంతకాలం తర్వాత. రుకైయా తన అత్తగారు హమీదా బాను బేగంతో భారతదేశంలోకి వచ్చి పంజాబులో ఉన్న అక్బరుతో చేరింది. ఆమె అత్త గుల్బాడాన్ బేగం, చక్రవర్తి కుటుంబంలోని అనేక మంది మహిళా సభ్యులు ఆమెను వెన్నంటి భారతదేశం వచ్చారు. అక్బరుతో రుకైయా వివాహం 14 సంవత్సరాల వయసులో పంజాబులోని జలంధరు సమీపంలో గంభీరంగా జరిగింది. అదే సమయంలో ఆమె 18 సంవత్సరాల మొదటి బంధువు సలీమా సుల్తాన్ బేగం అక్బరు ప్రతినిధి వృద్ధుడైన బైరం ఖానును వివాహం చేసుకున్నది.[18]పంజాబులో నాలుగు నెలల పాటు విశ్రాంతి తీసుకున్న తరువాత చక్రవర్తి కుటుంబం ఢిల్లీకి బయలుదేరింది. చివరికి మొఘలులు భారతదేశంలో స్థిరపడటానికి సిద్ధం అయ్యారు.[18]

చక్రవర్తిని మార్చు

 
Fatehpur Sikri: Hujra-I-Anup Talao or the Turkish Sultana House, a pleasure pavilion attached to a pond, was used by Empress Ruqaiya

1556 లో తన భర్త సింహాసనాన్ని అధిరోహించిన తరువాత పద్నాలుగు సంవత్సరాల వయస్సులో రుకైయా మొఘలు సామ్రాజ్యం చక్రవర్తిని అయింది. ఆమె వివాహజీవితం సంతానరహితంగా మిగిలిపోయినప్పటికీ ఆమె అక్బరు అభిమాన మనవడు ప్రిన్సు ఖుర్రం (భవిష్యత్తు చక్రవర్తి షాజహాన్ ) విద్యను రుకైయా పర్యవేక్షించింది. ఆమె తన భర్త వలె కాక బాగా విద్యావంతురాలు.[19] రుకైయా రాకుమారుని దత్తు తీసుకోవడం అంతఃపురంలో ఆమె శక్తి, అధికారాలను తెలియజేస్తుంది. మొఘలు అంతఃపుర మహిళలలో ఆమె విశేషాధికారం కలిగి ఉంది. ఇది మొఘలు అంతఃపుర మహిళలకు వారు వారి పిల్లల సంరక్షణ వహించడానికి అధికారం లేదని తెలియజేస్తుంది.[20] అఖుర్రం జన్మించడానికి కొంతసమయం ముందు జ్యోతిష్కులు ఆయన భవిష్యత్తు చక్రవర్తి ఔతాడని రుకైయాబేగంకు చెబుతారు. అందువలన జన్మించడానికి ముందే సంతానానికి సాంరాజ్యప్రాధాన్యత లభించింది. 1592 లో జన్మించిన ఖుర్రం ఆరురోజుల ప్రాయంలోనే ఆయన తల్లి జగత్ గోసైనీ నుండి తీసుకుని రుకైయాకు అప్పగించాలని అఆదేశించి అక్బరు తన భార్య రుకైయా కోరికను తీర్చాడు. రుకైయా సంరక్షణలో ఖుర్రం సంరక్షణ జరగాలని ఆదేశించడంతో భవిష్యత్తు చకేవర్తిని సంరక్షించాలన్న రుకైయా కోరిక నెరవేరింది.[21][22] అక్బరు ఖుర్రంతో ఏర్పరుచుకున్న సంబంధంతో సమానమైన అనుబంధం రుకైయా, ఖుర్రంలు పంచుకున్నారు. జహంగీరు మాటలలో "ఎల్లప్పుడూ ఆయన [ఖుర్రామ్] నాకు [జహంగీరు] ను సిఫార్సు చేశాడు. ఇతర పిల్లలకు అతనికీ మధ్య ఎలాంటి పోలిక లేదని చెబుతూ ఆయన (అక్బర్) తన నిజమైన బిడ్డగా గుర్తించబడ్డాడు.[23] జుహాంగిర్ కూడా తన కుమారుడైన ఖుర్రంను రుకైయా ప్రేమించినట్లు తన జ్ఞాపకాలలో పేర్కొన్నాడు. "ఆమెకు స్వంత కుమారుడిగా ఉంటే ప్రేమించినదాని కంటే అధికంగా ఖుర్రంను ప్రేమించింది " అని పేర్కొన్నాడు.[4] " అయనకు 14 సంవత్సరాలు ముగిసేవరకు ఖుర్రం రుకైయాతో ఉండిపోయాడు. 1605 లో అక్బరు మరణించిన తరువాత యువ యువరాజు తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళటానికి అనుమతించబడ్డాడు. తరువాత ఆయన తనకు జన్మ ఇచ్చిన తల్లికి తల్లికి దగ్గరగా జీవితం గడిపాడు. [21] తరువాత, రుకయా ఖుర్రం మొదటి కుమార్తె పర్హెజ్ బాను బేగం సంరక్షణ బాధ్యత వహించింది.[24] ఆమె జహంగీరు మొదటి భార్య సఫావిడ్ యువరాణి కందహరి బేగంకు జన్మించింది.[25]

పిల్లలను లేనప్పటికీ రుకైయా తన భర్తచే ఎక్కువగా గౌరవించబడింది. ఆమె 1557 లో వివాహం చేసుకుని 1605 లో మరణించే వరకు పట్టమహిషిగా ఉంది. రుకైయా అంతఃపురంలో పెద్దరికంతో [26] ఆమె భర్త పాలనలో, అతని వారసుడి (జహంగీర్ ) పాలనలో గౌరవించబడింది.[27] ఆమె ఉన్నతమైన వంశం కారణంగా మీర్జా హిందాలు కుమార్తె ఒక మొఘలు యువరాణి అక్బరు మొదటి, ప్రధాన భార్యగా గౌరవించబడింది.[26]

చక్రవర్తిని న్యాయస్థానంలో రాజకీయాల్లో చురుకుగా పాల్గొని అక్బరు వద్ద గణనీయమైన విశేషాధికారాలను అనుభవించింది. 1600 లలో తండ్రి-కొడుకుసంబంధంలో చీలిక ఏర్పడినప్పుడు ఆమె, సలీమాబేగంతో కలిసి ఆమె భర్త అక్బరు, సవతి కుమారుడు సలీం (జహంగీర్) మధ్య ఒప్పందం కుదరడానికి చర్చలు సాగించడంలో ఆమె కీలకమైన పాత్ర వహించింది. ఒప్పంద ఫలితంగా చివరకు మొఘల్ సింహాసనానికి సలీం చేపట్టడానికి మార్గం సుగమం చేయడానికి ఈ చర్చలు సహాయపడ్డాయి.[7] 1601 లో సలీం అలహాబాదులో ఒక స్వతంత్ర న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయడం ద్వారా అతని తండ్రి ఇంకా సజీవంగా ఉన్నప్పుడు "సలీం షా"గా చక్రవర్తి బిరుదును తీసుకుని అక్బరుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు.[28] అక్బరు విశ్వాసకులు సలహాదారుడు, అబూల్ ఫజ్ల్ హత్యకు జహంగీరు కూడా ప్రణాళిక వేసాడు.[29] ఈ పరిస్థితి ఎంతో క్లిష్టమైనది, అక్బరుకు చాలా ఆందోళన కలిగించింది. సలీం కొరకు ఎవ్వరూ అభ్యర్ధన వేయలేదు. చివరకు ఆయనకు రుకైయా సుల్తాన్ బేగం, సాలిమా సుల్తాన్ బేగం సహాయంగా ఉండి జహంగీరు కొరకు క్షమాపణ కోసం వేడుకున్నారు. అక్బరు వారి కోరికను మన్నించాడు. సలీం చక్రవర్తి ముందు హాజరు కావడానికి అనుమతించబడ్డాడు. అతని సవతి తల్లులు, ఆయన నాయనమ్మ హమిదా బాను బేగం ప్రయత్నాల ద్వారా 1603 లో రాకుమారుడు చివరికి క్షమించ బడ్డాడు.[28]

అక్బరు ఎల్లప్పుడూ తప్పు చేసినవారిని క్షమించలేదు. కొన్నిసార్లు అతని నిర్ణయాలు తిరిగి వెనుకకు తీసుకోలేదు. ఒకసారి రుకైయా ఆమె అత్తగారు హమీదా బాను బేగం కలిసి లాహోర్లో షియాను హత్య చేసిన ఒక సున్నీ ముస్లిం కొరకు క్షమాపణ కోరినప్పుడు అది నిరాకరించబడింది. అది పూర్తిగా మతపరమైన మూఢవిశ్వాసం కారణంగా జరిగింది.[30]జహంగీరు పాలనలో ఖన్-ఇ-అజాం, మిర్జా అజీజ్ కోకా కోసం క్షమాభిక్షను పొందడానికి రుకైయా, సలీమా సుల్తాన్ బేగం కీలక పాత్ర పోషించారు. [31] జమున నదికి సమీపంలో ఉన్న ఆగ్రాలోని ఫతేపూర్ సిక్రిలోని తనస్వంత ప్రదేశం రుకైయాకు ఆగ్రాలో కోట వెలుప జమునా నదీ తీరంలో రాజభవనం ఉంది. మొఘల్ యువరాణికి ఇచ్చిన ప్రత్యేక హక్కు తన మొట్ట మొదటి రాజభవనం కాకుండా, చల్రవర్తినిగా కొన్ని సార్లు అధిక గౌరవంతో ఇవ్వబడింది రుకైయాకు రెండూ ఉన్నాయి. [32][33]

భతృహీన చక్రవర్తిని మార్చు

1607 లో కాబూలులో బాబరు గార్డెంసుకు రుకైయా యాత్రా స్థలాలను నిర్వహించి మొట్టమొదటిసారిగా ఆమె తండ్రి హిందేలు మీర్జా సమాధిని సందర్శించింది. అలాగే ఆమె ఇతర పూర్వీకుల స్మారకాలను దర్శించింది.[34] ఆమెతో పాటు జహంగీరు, రాకుమారుడు ఖుర్రం ఉన్నారు.[24] అదే సంవత్సరంలో బర్ద్వాను జాగిర్దారు షేరు ఆఫ్ఘను ఖాను మరణించాడు. అతని భార్య అయిన మెహర్-ఉన్-నిసా (తరువాత చక్రవర్తిని నూర్ జహాన్) తన విధవరాలైన సవతి తల్లి రుకైయాకు సేవకురాలిగా ఉండడానికి ఆగ్రాకు పిలిపించాడు.[35] తన మరణానికి ముందు షేర్ ఆఫ్ఘను నిర్వహించిన ప్రమాదకరమైన రాజకీయ సంబంధాల కారణంగా అతని కుటుంబం గొప్ప ప్రమాదంలో ఉన్న కారణంగా రక్షణ కోసం మెహర్-ఉన్-నిసా ఆగ్రాలోని మొఘలు రాజసభలో ఉండవలసిన అవసరం ఉంది. చక్రవర్తి అక్బరు ప్రధాన భార్య అయిన రుకైయా హరంలో అత్యంత గౌరవనీయ మహిళగా ఉండటం మొఘలు రాజసభలో మెహర్-అన్-నిసాకు అవసరమైన రక్షణ కల్పించే అత్యంత సామర్థ్యం ఆమెకు ఉంది.[26]

మెహర్-అన్-నిసా తన కుమార్తెతో రుకైయా సేవలోకి తీసుకురాబడింది. ఆమె తన తండ్రి మిర్జా గిహాస్ బేగ్ వంటి తన బంధువులు రాససభలో ఉన్నప్పటికీ ఆమె భర్తచేతలు ఆమెను అవమానకరమైన పరిస్థితిలో పడవేసాయి.[36]అందువలన ఆమె రుకైయాల సంరక్షణలో ఉంది. తరువాత మెహ్ర్-ఉన్-నిసాకు తన తల్లిదండ్రులతో సమయాన్ని గడపడానికి అవకాశం లభించింది. అలాగే చక్రవర్తి మహిళలు నివసించిన రాజసౌధాలలో ప్రవేశించడానికి ఆమెకు అవకాశం లభించింది.[26]

మెహర్-అన్-నిసా ఆమె కుమార్తె లడ్లి బేగం, నాలుగు సంవత్సరాలపాటు చక్రవర్తినికి సేవకురాలిగా సేవలు చేస్తూ చక్రవర్తి ఉంపుడుగత్తె అనుగ్రహం కొరకు ఉత్సాహంగా కృషి చేసింది.[35] రుకైయా, మెహర్-అన్-నిసా మధ్య అధికరించిన సంబంధం చాలా మృదువైనదిగా కనబడుతుంది. తరువాతి ఆమె రికైయా కుమార్తెగా భావించబడింది. డచ్ వ్యాపారి, యాత్రా రచయిత పీటర్ వాన్ డెన్ బ్రోకే, అతని హిందూస్థాన్ క్రానికలులో వారి సంబంధాన్ని వివరించాడు: "ఈ బేగం రుకైతా మెహర్-అన్-నిస్సా (నూర్జహాన్) పట్ల గొప్ప ప్రేమను కలిగి ఉంది; ఆమె ఇతరులందరి కంటే అధికంగా ఆమెను ప్రేమించి ఆమెను సదా తన సమీపంలో ఉంచుకుంది. ""[26]

మరణం మార్చు

 
Inside the Gardens of Babur, located in Kabul, Afghanistan

రుక్యయ్య 1626 లో ఆగ్రాలో ఎనభై నాలుగు సంవత్సరాల వయస్సులో మరణించింది. ఆమె తన భర్త మరణించిన తరువాత దాదాపు 20 సంవత్సరాల కంటే అధికంగా జీవించింది. ఆఫ్గనిస్తానులోని కాబూల్లోని బాబర్ గార్డెన్స్ (బాగ్-ఇ-బాబర్) లో ఆమె పదిహేనవ అంతస్థులో ఆమె శరీరం ఖననం చేయబడింది. బాబరు గార్డెన్సు ఆమె తాత చక్రవర్తి బాబరు ఆఖరి విశ్రాంతి స్థలం. అలాగే ఆమె తండ్రి హిందలు మీర్జా సమాధి అక్కడ ఉన్నాయి. ఐదవ మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఆజ్ఞలచే ఆమె సమాధి అక్కడ నిర్మించబడింది.[37]జహన్గీర్ తన జ్ఞాపకాలలో రుకైయా గురించి ప్రేమగా మాట్లాడతాడు. ఆమె మరణాన్ని నమోదు చేసుకుంటూ అక్బరు పట్టమహిషిగా ఆమె ఉన్నత స్థాయిని గమనించాడు.[38][3]

ప్రబల సంప్రదాయంలో మార్చు

  • హరిల్ద్ లాంబు చారిత్రక నవల నూర్ మహల్ (1935) లో రుకైయా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.[39]
  • ఇందూ సుందరేసన్ అవార్డు గెలుచుకున్న చారిత్రాత్మక నవల ది ట్వంటీత్ వైఫ్ (2002)[40] దాని సీక్వెల్ ది ఫీస్ట్ ఆఫ్ రోజెస్ (2003) లో రుకైయా ప్రధాన పాత్ర.[41]
  • తనుశ్రీ పోడరు చారిత్రక నవల నూర్ జహాన్ డాటర్ (2005) లో రుకైయా కీలక పాత్ర.[42]
  • జీవి TV లకినా టాండను చిత్రీకరణలో ప్రదర్శించబడిన కాల్పనిక నాటకం జోదా అక్బరులో ఒక రుకైయా పాత్ర వ్యూహాత్మకంగా చిత్రీకరించబడింది.[43]
  • దీనికా అమిన్ " ఎపిక్" ఛానల్ విమర్శాత్మకంగా ప్రశంసలు పొందిన చారిత్రక డ్రామా సియాసత్ (ది ట్వంటీత్ వైఫ్ ఆధారంగా) లో రుకైయా ప్రధాన పాత్రను పోషించింది.[44][45]
  • సోనీ టివి. చారిత్రాత్మక నాటకం భారత్ కా వీర్ పుత్రా - మహారాణా ప్రతాప్ నాటకంలో టీనేజరు రుకైయా పాత్ర పూరిటి అగర్వాల్ చేత చిత్రీకరించబడింది.[46] తరువాత యువతిగా ఫలాక్ నాజ్ చేత చిత్రీకరించబడింది.[47]
  • వైష్ణవ రావు రుగయా మేజికు చారిత్రక నాటకం అక్బరు - రాఖ్ సే తక్తు తక్ కాఫరులో చిత్రీకరించారు.
  • త్యాన్నేమ్ షేక్ వయాకామ్ 18'స్ కలర్స్ కల్పిత చారిత్రక నాటకం దస్తాన్-ఈ-మొహబ్బత్: సలీం అనార్కలిలో రుకైయా పాత్ర ఉంది.

References మార్చు

  1. 1.0 1.1 1.2 Gulbadan Begum, Annette Susannah Beveridge (1902). Humayun Nama. Sang-e-Meel Publications. p. 274.
  2. Burke, S. M. (1989). Akbar, the greatest Mogul. Munshiram Manoharlal Publishers. p. 142.
  3. 3.0 3.1 Jahangir, Emperor of Hindustan (1999). The Jahangirnama: Memoirs of Jahangir, Emperor of India. Translated by Thackston, Wheeler M. Oxford University Press. p. 437. ISBN 978-0-19-512718-8. Ruqayya-Sultan Begam, the daughter of Mirza Hindal and wife of His Majesty Arsh-Ashyani [Akbar], had passed away in Akbarabad. She was His Majesty's chief wife. Since she did not have children, when Shahjahan was born His Majesty Arsh-Ashyani entrusted that "unique pearl of the caliphate" to the begam's care, and she undertook to raise the prince. She departed this life at the age of eighty-four.
  4. 4.0 4.1 Jahangir (1968). Henry Beveridge (ed.). The Tūzuk-i-Jahāngīrī: or, Memoirs of Jāhāngīr, Volumes 1-2. Munshiram Manoharlal. p. 48. She was Akbar's first and principal wife, but bore him no children. She long survived him.
  5. Lal, Ruby (2005). Domesticity and power in the early Mughal world. Cambridge University Press. p. 205. ISBN 9780521850223.
  6. Her tenure, from సుమారు 1557 to 27 October 1605, was 48 years
  7. 7.0 7.1 Faruqui, Munis D. (2012). Princes of the Mughal Empire, 1504-1719. Cambridge University Press. p. 148. ISBN 9781107022171.
  8. Laura E. Parodi and Bruce Wannell (November 18, 2011). "The Earliest Datable Mughal Painting". Asianart.com. Retrieved 7 June 2013.
  9. Balabanlilar, Lisa. Imperial identity in the Mughal Empire : Memory and Dynastic politics in Early Modern South and Central Asia. London: I.B. Tauris. p. 112. ISBN 978-1-84885-726-1.
  10. Faruqui, Munis D. (2012). The Princes of the Mughal Empire, 1504-1719. Cambridge University Press. p. 251. ISBN 1107022177.
  11. Alam, Muzaffar (2004). The languages of political islam : India 1200 - 1800. London: Hurst. p. 126. ISBN 9781850657095.
  12. Findly, p. 11
  13. Berndl, Klaus (2005). National Geographic visual history of the world. University of Michigan. pp. 318–320. ISBN 978-0-521-52291-5.
  14. 14.0 14.1 Erskine, William (1854). A History of India Under the Two First Sovereigns of the House of Taimur, Báber and Humáyun, Volume 2. Longman, Brown, Green, and Longmans. p. 403, 404. ISBN 9781108046206.
  15. Mehta, Jaswant Lal (1986). Advanced Study in the History of Medieval India. Sterling Publishers Pvt. Ltd. p. 189. ISBN 8120710150.
  16. 16.0 16.1 Ferishta, Mahomed Kasim (2013). History of the Rise of the Mahomedan Power in India, Till the Year AD 1612. Cambridge University Press. p. 169. ISBN 9781108055550.
  17. Gulbadan, Begam (1902). Beveridge, Annette (ed.). The History of Humayun (Humayun-Nama) (in ఇంగ్లీష్). Billing and Sons Ltd., Guildford. p. 56-57.
  18. 18.0 18.1 Eraly, Abraham (2000). Emperors of the Peacock Throne : the saga of the great Mughals. Penguin books. pp. 123, 272. ISBN 9780141001432.
  19. Robinson, Annemarie Schimmel (2005). The Empire of the Great Mughals : history, art and culture (Revised ed.). Sang-E-Meel Pub. p. 149. ISBN 9781861891853.
  20. Findly, p. 97
  21. 21.0 21.1 Faruqui, Munis D. (2012). Princes of the Mughal Empire, 1504-1719. Cambridge University Press. p. 71. ISBN 9781107022171.
  22. Rahman, Tariq (2002). Language, ideology and power : language learning among the Muslims of Pakistan and North India. Oxford University Press. p. 483. ISBN 9780195796445.
  23. Findly, p. 50
  24. 24.0 24.1 Sarker, Kobita (2007). Shah Jahan and his paradise on earth : the story of Shah Jahan's creations in Agra and Shahjahanabad in the golden days of the Mughals (1. publ. ed.). Kolkata: K.P. Bagchi & Co. p. 10, 187. ISBN 9788170743002.
  25. Findly, p. 98
  26. 26.0 26.1 26.2 26.3 26.4 Findly, p. 32
  27. Nath, Renuka (1957). Notable Mughal and Hindu Women in the 16th and 17th Centuries A. D. Inter- India publications. p. 58.
  28. 28.0 28.1 Findly, p. 20
  29. Richards, J.F. (1995). Mughal empire (Transferred to digital print. ed.). Cambridge, Eng.: Cambridge University Press. p. 55. ISBN 9780521566032.
  30. Mukherjee, p.130
  31. Findly, p. 122
  32. Lal, K.S. (1988). The Mughal Harem. Aditya Prakashan. p. 45. ISBN 9788185179032.
  33. Misra, Rekha (1967). Women in Mughal India, 1526-1748 A.D. Munshiram Manoharlal. p. 76.
  34. Findly, p. 121
  35. 35.0 35.1 Mohammad Shujauddin, Razia Shujauddin (1967). The Life and Times of Noor Jahan. Caravan Book House. p. 25.
  36. Findly, p. 87
  37. Ruggles, Fairchild (2011). Islamic Gardens and Landscapes. University of Pennsylvania Press. p. 194. ISBN 9780812207286.
  38. Jahangir (1968). "Gift to Ruqayya Begam". In Henry Beveridge (ed.). The Tūzuk-i-Jahāngīrī: or, Memoirs of Jāhāngīr, Volumes 1-2. Munshiram Manoharlal. p. 48. A garden in Agra had been left by Shah Quli Khan Mahram, and as he had no heirs I handed it over to Ruqayya Sultan Begam, the daughter of Hindal Mirza, who had been the honoured wife of my father. My father had given my son Khurram into her charge, and she loved him a thousand times more than if he had been her own.
  39. Lamb, Harold (1935). Nur Mahal. Doubleday, Doran & Co. ISBN 978-1299983229.
  40. Sundaresan, Indu (2002). Twentieth wife : a novel (Paperback ed.). New York: Washington Square Press. p. 12. ISBN 9780743428187.
  41. Sundaresan, Indu (2003). The Feast of Roses: A Novel (in ఇంగ్లీష్). Simon and Schuster. ISBN 9780743481960.
  42. Podder, Tanushree (2005). Nur Jahan's daughter. New Delhi: Rupa & Co. ISBN 8129107228.
  43. Maheshwri, Neha (July 11, 2013). "Lavina Tandon replaces Smilie Suri in Jodha Akbar? - Times of India". The Times of India. Retrieved 14 March 2017.
  44. Agarwal, Stuti (July 4, 2013). "Malikaa's cast revealed". The Times of India. Retrieved 1 April 2017.
  45. "Characters". epicchannel.com. Archived from the original on 2018-02-11. Retrieved 2019-01-20.
  46. Maheshwri, Neha. "Lavina Tandon and Poorti Agarwal: Two Ruqaiyas on TV - Times of India". The Times of India. Retrieved 22 March 2017.
  47. Tiwari, Vijaya (14 October 2014). "Maharana Pratap: Krip Suri and Falak Naaz as grown-up Akbar-Rukaiya in the show". The Times of India. Retrieved 30 July 2016.

Bibliography మార్చు

  • Findly, Ellison Banks (1993). Nur Jahan: Empress of Mughal India. Oxford University Press. ISBN 9780195360608.