రైటర్ 2022లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో 2012లో 'రైటర్' పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో అదే పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. నీలం ప్రొడక్షన్స్, గోల్డెన్ రేషియో ఫిలిమ్స్, లిటిల్ రెడ్ కార్ ఫిలిమ్స్, జెట్టి ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై పా రంజిత్, అభయానంద సింగ్, పియూష్ సింగ్, అదితి ఆనంద్ నిర్మించిన ఈ సినిమాకు ఫ్రాంక్లిన్ జాకబ్ దర్దకత్వం వహించగా సముద్రఖని, ఇనేయ, మహేశ్వరి, లిజ్జీ ఆంటోనీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను మే 27న ఆహా ఓటీటీలో విడుదల చేశారు.[1]

రైటర్
దర్శకత్వంఫ్రాంక్లిన్ జాకబ్
రచనఫ్రాంక్లిన్ జాకబ్
నిర్మాతపా. రంజిత్
అభయానంద్ సింగ్
పీయూష్ సింగ్
అదితి ఆనంద్
తారాగణంసముద్రఖని
ఇనేయ
మహేశ్వరి
లిజ్జీ ఆంటోనీ
ఛాయాగ్రహణంప్రతీప్ కాళీరాజా
కూర్పుమణిగందం శివకుమార్
సంగీతంగోవింద్ వసంత
నిర్మాణ
సంస్థలు
నీలం ప్రొడక్షన్స్
గోల్డెన్ రేషియో ఫిలిమ్స్
లిటిల్ రెడ్ కార్ ఫిలిమ్స్
జెట్టి ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2021 డిసెంబరు 24 (2021-12-24)
సినిమా నిడివి
147 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

రంగరాజు (సముద్రఖని) అనకాపల్లికి చెందిన పోలీస్ స్టేషన్‌లో రైట‌ర్‌గా పనిచేస్తూ ఉంటాడు. పోలీసు వ్యవస్థలో ఉన్న‌తాధికారుల ఆధిప‌త్య‌ధోర‌ణి, ఒత్తిడిల వ‌ల్ల కిందిస్థాయి పోలీస్ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని, వారంద‌రికోసం ఒక యూనియన్ ఏర్పాటు చేయాలనుకుంటాడు, కానీ యూనియ‌న్ ఏర్పాటును పై అధికారులు అత‌డిని ఇబ్బందుల‌కు గురి చేస్తూ విశాఖపట్నానికి బదిలీ చేస్తారు.

విశాఖపట్నంలో దేవ కుమార్ (హరీష్ కృష్ణన్) అనే పి.హెచ్.డి స్టూడెంట్‌ను పోలీసులు అరెస్ట్ చేసి అతడిపై నక్సలైట్ అనే ముద్ర వేసి జైలుకు పంపాలి అని పోలీసులు కుట్ర చేస్తురని రంగస్వామికి తెలుస్తుంది. దేవ‌కుమార్‌పై పోలీసులు అక్ర‌మంగా ఎందుకు కేసు పెట్టారు? అత‌డు చేసిన త‌ప్పేమిటి? దేవకుమార్‌ను విడిపించే ప్ర‌య‌త్నంలో రంగరాజుకు ఎదురైన పరిస్థితులు ఏంటి? చివరికి ఏమైంది అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు మార్చు

  • సముద్రఖని
  • ఇనేయ
  • మహేశ్వరి
  • లిజ్జీ ఆంటోనీ
  • సుబ్రమణ్యం శివ
  • హరికృష్ణన్ అన్బు దురై
  • దిలీపన్
  • జీఎం సుందర్
  • మెర్కు తొడార్చి మలై ఆంటోనీ

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: నీలం ప్రొడక్షన్స్
    గోల్డెన్ రేషియో ఫిలిమ్స్
    లిటిల్ రెడ్ కార్ ఫిలిమ్స్
    జెట్టి ప్రొడక్షన్స్
  • నిర్మాత: పా. రంజిత్
    అభయానంద్ సింగ్
    పీయూష్ సింగ్
    అదితి ఆనంద్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఫ్రాంక్లిన్ జాకబ్
  • సినిమాటోగ్రఫీ: ప్రతీప్ కాళీరాజా
  • సంగీతం: గోవింద్ వసంత
  • మాటలు : వేణుబాబు చుండి
  • పాటలు : గోసాల రాంబాబు[3]

మూలాలు మార్చు

  1. Eenadu (30 May 2022). "రివ్యూ: రైటర్‌". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
  2. NTV (28 May 2022). "రైటర్". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
  3. A. B. P. Desam (27 May 2022). "'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉంది". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=రైటర్&oldid=3614529" నుండి వెలికితీశారు