లక్ష్మీ చంద్ జైన్

భారత స్వాతంత్ర్య ఉద్యమకారుడు మరియు వ్యాపారవేత్త

లక్ష్మీ చంద్ జైన్ (1925 - 2010) ఈయన గాంధేయవాది, రచయిత. ఈయన భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు.[1]

లక్ష్మీ చంద్ జైన్
జననం(1925-12-13)1925 డిసెంబరు 13
బహదూర్పూర్, రాజస్థాన్, భారతదేశం
మరణం2010 నవంబరు 14(2010-11-14) (వయసు 84)
న్యూ ఢిల్లీ
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుఎల్. సి. జైన్
వృత్తిగాంధేయవాది, రచయిత
సుపరిచితుడు/
సుపరిచితురాలు
గాంధేయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, రామోన్ మాగ్సేసే పురస్కారం విజేత
సంతకం

తొలినాళ్ళ జీవితం మార్చు

ఈయన 1925 లో జన్మించాడు. ఈయన 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. ఈయన 1947లో భారతదేశం యొక్క విభజన సమయంలో ఉత్తర ఢిల్లీలో కింగ్స్‌వే క్యాంప్‌లోని శరణార శిబిరానికి నియమించారు. ఈ శిబిరంలో వ్యవసాయం, కుటీర పరిశ్రమల కోసం సహకార సంఘాలను పునరావాస శిబిరాల్లోకి ప్రవేశపెట్టడానికి ఈయన సహకరించాడు. ఈయన ఇండియన్ కోఆపరేటివ్ యూనియన్ (ఐసియు) తో వాలంటీర్ ఆర్గనైజర్‌ గా, పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్ధుల పునరావాస ప్రాజెక్టులో చేరాడు. ఈయన అఖిల భారత హస్తకళల బోర్డు కార్యదర్శిగా ఉన్న సమయంలో భారతదేశం యొక్క కష్టపడుతున్న స్వయం ఉపాధి స్పిన్నర్లు, నేత కార్మికులు, వడ్రంగి, లోహ కార్మికులకు రుణాలు అందించాడు. ఈయన విదేశాలలో హస్తకళల అమ్మకాలను ప్రోత్సహించడానికి ఆధునిక మార్కెటింగ్ పద్ధతులను ప్రయోగించాడు, స్వదేశంలో మార్కెట్‌ను విస్తరించడానికి సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఎంపోరియాన్ని నిర్వహించాడు. ఈయన యాంత్రీకరణ, సామూహిక ఉత్పత్తికి వ్యతిరేకంగా చేతివృత్తులకు లోన్ లను ఇచ్చాడు. ఈయన 1966లో నగరాల్లో నివసించేవారు ఆహారం, దుస్తులు, సాధనాలను సరసమైన ధరకు కొనుగోలు చేయగల వినియోగదారుల సహకార దుకాణాల గొలుసును స్థాపించాడు. ఈయన ఐక్యరాజ్యసమితి యొక్క ప్రపంచ ఆనకట్ట కమిషన్ వంటి అనేక అభివృద్ధి సంస్థలతో పాటు ప్రభుత్వ కమిటీలు, బోర్డులతో పనిచేశాడు. ఈయన సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఎంపోరియం, సూపర్ బజార్ సహకార దుకాణాలను ఏర్పాటు చేయడంలో సహాయం చేశాడు.[2]

వ్యక్తిగత జీవితం మార్చు

ఈయన భార్య ఆర్థికవేత్త దేవకి జైన్ ను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు, బెంగళూరులో స్థిరపడ్డారు.

పురస్కారాలు మార్చు

1989లో ఈయన చేసిన ప్రజా సేవకు గాను రామోన్ మాగ్సేసే పురస్కారం లభించింది. 2011 లో భారత ప్రభుత్వం రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ను తన మరణానంతరం ప్రకటించింది.[3]

పదవులు మార్చు

ఈయన ప్రణాళికా సంఘం సభ్యుడిగా, దక్షిణాఫ్రికాకు భారత హై కమిషనర్‌గా, వరల్డ్ కమిషన్ ఆన్ డ్యామ్స్ (డబ్ల్యుసిడి) సభ్యుడిగా, భారత సహకార యూనియన్, అఖిల భారత హస్తకళల బోర్డు కార్యదర్శిగా పనిచేశాడు.

మూలాలు మార్చు

  1. World Dam Commission mandate Archived 13 నవంబరు 2007 at the Wayback Machine, retrieved 8 December 2019
  2. Crossette, Barbara (19 May 1991). "INDIA'S DESCENT". New York Times. Retrieved 8 December 2019.
  3. "Gandhian's family declines Padma Vibhushan". The Times of India. 25 March 2011.