లోకపల్లి సంస్థానం

నారాయణపేట జిల్లాలో వెలసిన ఏకైక సంస్థానం లోకాయపల్లి (లోకపల్లి) సంస్థానం. ఇది ప్రస్తుత నారాయణపేట నగరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలోని ప్రజలు ఇక్కడి చివరి పాలకురాలైన లక్షమ్మను దైవంగా పూజిస్తారు.[1]

లోకపల్లి సంస్థానం ప్రవేశద్వారం

లోకపల్లి లోని ఇతర దేవాలయాలు మార్చు

 
లోకపల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయం
 
లోకపల్లిలోని శ్రీకృష్ణ దేవాలయం

ఇక్కడి ప్రజలు లోకపల్లి సంస్థానం చివరి పాలకురాలైన లక్ష్మమ్మకు దేవాలయాన్ని నిర్మించి నిత్యం పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయ సమీపంలోనే శ్రీకృష్ణుడి, ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో ప్రసిద్ధి చెందిన పురాతన ఔదుంబరేశ్వర దేవాలయం ఈ ఆలయానికి సమీపంలోనే ఉంది.

చరిత్ర మార్చు

సా.శ. 1294లో మక్తల్ ను దేవగిరి యాదవరాజైన రామచంద్రుని ప్రతినిధిగా స్థాణుచమూపతి పాలించాడు. ఈ సంస్థాన పాలకులు మహారాష్ట్ర నుండి వచ్చిన బ్రాహ్మణులు. వేదశాస్త్ర పోషకులు. ఈ సంస్థాన పాలకుడైన మొదటి వెంకటనారాయణరావు సా.శ. 1611 లో ప్రస్తుత నారాయణపేటలోని పళ్ళ ప్రాంతానికి చెందిన త్ర్యంబకభట్టు , విర్ధలభట్టు అనే శ్రౌతతంత్రవేత్తలకు భూదానం చేశాడు. వీరు లోకాయపల్లి ప్రభువులకు యజ్ఞ యాగాదులు నిర్వహించేవారు. ఈ వంశంలో నారాయణరావు, లక్ష్మమ్మలు చాలామంది ఉన్నారు. మొదటి, ద్వితీయ, తృతీయ లక్ష్మమ్మలు ఆధ్యాత్మిక, ధార్మిక సంపన్నులు, అనేక ఆలయాలను కట్టించారు. ఈ సంస్థానానికి చివరి పాలకురాలు కూడా లక్ష్మమ్మ. ఈ సంస్థానంలో సాహిత్య వికాసం అంతగా కనిపించదు. ఒక్క భాస్కరరాయలు మాత్రం శాక్తవిద్యకు సంబంధించి అనేక రచనలు చేశాడు.[2]

భాస్కరరాయలు మార్చు

భాస్కరరాయలు లోకాయపల్లి సంస్థానకవి. గంభీరరాయలు , కోనమాంబల పుత్రుడు. శాక్తదర్శనాలలో చేయితిరిగినవాడు. 17 వ శతాబ్దంలోనివాడు. ఇతడు నారాయణపేటకు దగ్గరలో గల లోకాయపల్లిలో నృసింహయజ్వ దగ్గర విద్యనభ్యసించాడు. లోకాయపల్లి శాతంత్రవేత్తలకు కేంద్రం.

రచనలు మార్చు

సౌభాగ్య భాస్కరం , వరివష్యరహస్యం, నిత్యాషో శికార్డవ టీకయైన సేతువు, దుర్గా సప్తశతి వ్యాఖ్యయైన గుప్తవతి, కాల భావనా త్రిపురోపనిషత్తులపై టీక, వాద కుతూహలం అనే పూర్వమీమాంస శాస్త్రం వంటివి భాస్కరరాయలు రచనలు. లలితా సహస్ర నామావళి భాష్యమైన ' సౌభాగ్య భాస్కరం'లో తాంత్రిక , మాంత్రిక , వామాచార , దక్షిణాచార , కౌళాదిభిన్న సిద్ధాంత రహస్యాలు ఉన్నాయి. సేతుబంధం , చండాభాస్కరం , తృచ భాస్కరం ' మొదలైనవి కూడ ఇతడి రచనలే. ఇతడి రచనలు మొత్తం 43 ఉన్నట్లు తెలుస్తున్నది.

జగన్నాథుడు మార్చు

భాస్కర రాయల గురించి అతడి శిష్యుడు అయిన జగన్నాథుడు 'భాస్కర విలాస కావ్యం' అనే గ్రంథాన్ని రాశాడు. ఇతని తండ్రి కూడ ఒక కవి. అతను మహాభారతాన్ని పార్శీ భాషలోకి అనువదించాడు.[3]

ఆదిభట్ట నారాయణుడు మార్చు

నారాయణపేట ప్రాంతంలో భాస్కర రాయలకంటే ముందు ఆదిభట్ట నారాయణుడు అనే పండితుడు కూడా చరిత్రలో ఉన్నాడు. లలితా సహస్రనామాలకు ఇతడు రచించిన 'జయమంగలము' వ్యాఖ్య ఎంతో ప్రసిద్ధం. నారాయణుని వ్యాఖ్య మిగతావారికంటే చాలా సమంజసంగా ఉన్నదని పండితుల అభిప్రాయం.

మూలాలు మార్చు

  1. "నాటి నారాయణపురమే... నేటి నారాయణపేట". నవ తెలంగాణ.కం.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "నారాయణ పేట జిల్లా". Cckraipedia.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. మహబూబ్ నగర్ జిల్లా సాహిత్య చరిత్ర. తెలంగాణ సాహిత్య అకాడమీ.