వజహతుల్లా వస్తీ

పాకిస్తానీ మాజీ క్రికెట్ ఆటగాడు

వజహతుల్లా వస్తీ (జననం 1974, నవంబరు 11) పాకిస్తానీ మాజీ క్రికెట్ ఆటగాడు.[1] పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నేషనల్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశాడు.[2] కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, కుడిచేతి ఆఫ్‌బ్రేక్ బౌలర్ గా రాణించాడు.

వజహతుల్లా వస్తీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సయ్యద్ వజహతుల్లా వస్తీ
పుట్టిన తేదీ11 November 1974 (1974-11-11) (age 49)
పెషావర్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడి-చేతి ఆఫ్‌బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 156)1999 ఫిబ్రవరి 16 - ఇండియా తో
చివరి టెస్టు2000 మే 5 - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 125)1999 మార్చి 16 - బంగ్లాదేశ్ తో
చివరి వన్‌డే2000 ఏప్రిల్ 16 - వెస్టిండీస్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 6 15
చేసిన పరుగులు 329 349
బ్యాటింగు సగటు 36.55 23.26
100లు/50లు 2/0 0/1
అత్యధిక స్కోరు 133 84
వేసిన బంతులు 18 55
వికెట్లు 0 3
బౌలింగు సగటు 23.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 3/36
క్యాచ్‌లు/స్టంపింగులు 7/– 5/–
మూలం: ESPNcricinfo, 2006 ఫిబ్రవరి 4

జననం మార్చు

వజహతుల్లా వస్తీ 1974, నవంబరు 11న పాకిస్తాన లోని పెషావర్ లో జన్మించాడు.[3]

క్రికెట్ రంగం మార్చు

1999 ఫిబ్రవరి నుండి 2000 మే మధ్యకాలంలో ఆరు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అయితే అతని ఆటతీరుపై చాలా విమర్శలు రావడంతో జట్టుకు దూరమయ్యాడు. లాహోర్‌లో శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో 133, 121 నాటౌట్‌ను గా నిలిచాడు.[4]

1999 క్రికెట్ ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై అత్యుత్తమ వన్డే ఆటతీరు కనబరచాడు. 123 బంతులలో 10 ఫోర్లు, 1 సిక్స్ తో 84 పరుగులు చేశాడు.[5] ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది.[6] 2000 మే నుండి అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు.

మూలాలు మార్చు

  1. "Wajahatullah Wasti Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-12.
  2. "Corporate Structure - Pakistan Cricket Board (PCB) Official Website". www.pcb.com.pk.
  3. "Wajahatullah Wasti Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-12.
  4. "PAK vs SL, Asian Test Championship 1998/99, 3rd Match at Lahore, March 04 - 08, 1999 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-12.
  5. "NZ vs PAK, ICC World Cup 1999, 1st SF at Manchester, June 16, 1999 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-12.
  6. "1st SF: New Zealand v Pakistan at Manchester, Jun 16, 1999 - Cricket Scorecard - ESPN Cricinfo".

బాహ్య లింకులు మార్చు