వట్‌పల్లి మండలం

తెలంగాణ, సంగారెడ్డి జిల్లా లోని మండలం


వట్‌పల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా లోని మండలం.[1] మండల కేంద్రం, వట్‌పల్లి. ఇది ఆందోల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని కొత్తగా ఏర్పరచారు.[2] దానికి ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం కొత్తగా ఏర్పాటైన ఆందోల్ - జోగిపేట రెవెన్యూ డివిజనులో భాగం.[4] పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సంగారెడ్డి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 19  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.

వట్‌పల్లి మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, వట్‌పల్లి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, వట్‌పల్లి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, వట్‌పల్లి మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°54′25″N 77°52′36″E / 17.906856°N 77.876598°E / 17.906856; 77.876598
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం వట్‌పల్లి
గ్రామాలు 19
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 138 km² (53.3 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 30,523
 - పురుషులు 15,416
 - స్త్రీలు 15,107
పిన్‌కోడ్ 502269

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు మార్చు

లోగడ వట్‌పల్లి గ్రామం మెదక్ జిల్లా మెదక్ రెవెన్యూ డివిజను పరిధిలోని ఆళ్లదుర్గ్ మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా వట్‌పల్లి గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా సంగారెడ్డి జిల్లా,సంగారెడ్ది రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+18 (పందొమ్మది) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[5] 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 138 చ.కి.మీ. కాగా, జనాభా 30,523. జనాభాలో పురుషులు 15,416 కాగా, స్త్రీల సంఖ్య 15,107. మండలంలో 6,291 గృహాలున్నాయి.[6]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. పోతులబొగుడ
  2. గొర్రెకల్
  3. వట్‌పల్లి
  4. షాహెద్‌నగర్ @ ఘట్‌పల్లి
  5. గౌతాపూర్
  6. పల్వట్ల
  7. నాగులపల్లి
  8. బుడ్డాయిపల్లి
  9. బిజిలీపూర్
  10. మర్వెల్లి
  11. కేరూర్
  12. మేడికుండ
  13. పులడుగు
  14. దేవెనూర్
  15. భూత్కూర్
  16. ఉసిరికపల్లి
  17. నిర్జిపాల
  18. ఖాదరాబాద్
  19. దుదియాల్

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-28 suggested (help)
  3. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-28 suggested (help)
  4. Team, Web (2020-07-13). "తెలంగాణలో మరో కొత్త రెవెన్యూ డివిజన్". Dishadaily (దిశ): Latest Telugu News (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-01-04.
  5. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2020-01-18.
  6. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.