వర్డిల్ (Wordle), జోష్ వార్డిల్ (Josh Wardle) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీరు సృష్టించి, అభివృద్ధి చేసిన పదాల ఆట. ఇది బ్రౌజరులో ఆడే వెబ్ ఆధారిత ఆట. ఈ ఆటను 2022 నుండి ది న్యూయార్క్ టైమ్స్ కంపెనీ ప్రచురిస్తోంది. ఆరు ప్రయత్నాల్లో ఐదు అక్షరాల పదాన్ని ఊహించడమే ఈ ఆట. ప్రతీ ప్రయత్నం లోనూ ఊహించిన అక్షరాలు ఆ పదంలో ఉన్నాయా లేదా, ఉంటే సరైన స్థానంలో ఉన్నాయా లేదా అనేది రంగుల ద్వారా సూచిస్తుంది. ఈ ఆట పద్ధతి 1955 నాటి కాగితం మీద ఆడే ఆట జోట్టో, టెలివిజన్ గేమ్ షో ఫ్రాంచైజ్ లింగో ల మాదిరిగానే ఉంటుంది. వర్డిల్ రోజుకు ఒక్క ఆటే ఉంటుంది. ఆటగాళ్లందరూ ఒకే పదాన్ని ఊహించడానికి ప్రయత్నిస్తారు.

వర్డిల్
A four-row grid of white letters in colored square tiles, with 5 letters in each row, reading ARISE, ROUTE, RULES, REBUS. The A, I, O, T, and L are in gray squares; the R, S, and E of ARISE, U and E of ROUTE, and U and E of RULES are in yellow squares, and the R of ROUTE, R and S of RULES, and all letters of REBUS are in green squares.
Game #196 complete in 4 guesses
Developer(s)జోష్ వార్డిల్
Publisher(s)జోష్ వార్డిల్ (2021–22)
ది న్యూయార్క్ టైమ్‌స్ కంపెనీ (2022 ఫిబ్రవరి నుండి)
Platform(s)బ్రౌజరు ఆట
Release2021 అక్టోబరు
Genre(s)పదాలాట
ఈమాట వెబ్ పత్రిక ప్రచురిస్తున్న తెలుగు వర్డిల్. నాలుగు అంచెల్లో సమాధానాన్ని చేరుకున్నారు.

జోష్ వార్డిల్ మొదట్లో తన కోసం, అతని భాగస్వామి ఆడుకునేందుకు ఈ ఆటను సృష్టించాడు. చివరికి 2021 అక్టోబరులో దాన్ని బహిరంగంగా అందరూ ఆడుకునేలా మార్చాడు. ఆటగాళ్ళు తమ రోజువారీ ఫలితాలను ఎమోజి స్క్వేర్‌ల లాగా కాపీ చేసే ట్విట్టర్‌లో పంచుకునే సామర్థ్యాన్ని 2021 డిసెంబరులో జోడించాడు. దాంతో ఈ ఆటకు పెద్దయెత్తున ప్రజాదరణ వచ్చింది. ఈ ఆటకు అనేక క్లోన్‌లు, వైవిధ్యాలు కూడా వచ్చాయి., ఇంగ్లీషుతో మొదలైన ఈ ఆటను ఇతర భాషలలో కూడా తయారు చేసారు. తెలుగుతో పాటు కొన్ని ఇతర భారతీయ భాషల్లో కూడా ఉంది. ఈ ఆటను న్యూయార్క్ టైమ్స్ కంపెనీ 2022 జనవరిలో కొనుగోలు చేసింది. వెల ఎంతో తెలియనప్పటికీ ఏడు అంకెల డాలర్లలో ఉంటుందని అంచనా వేసారు. దీన్ని ఉచితంగా ఉంచే ఆలోచన ఉంది. 2022 ఫిబ్రవరిలో న్యూయార్క్ టైమ్స్, ఈ ఆటను తమ వెబ్‌సైట్‌కి తరలించింది.

ఆడే విధానం మార్చు

ప్రతి రోజు, వర్డిల్ ఒక ఐదక్షరాల పదాన్ని ఎంచుకుంటుంది. ఆటగాళ్ళు ఆరు ప్రయత్నాలలో ఈ పదాన్ని కనుక్కోవాలి.[1] ప్రతి ప్రయత్నంలో ఆటగాడు ఒక ఐదక్షరాల అర్థవంతమైన పదాన్ని ఊహించి రాస్తాడు. వర్డిల్ ఆ పదంలోని అక్షరాల గడులను ఆకుపచ్చ, పసుపు, బూడిద రంగుల్లో ఏదో ఒకదానిలో చూపుతుంది: ఆకుపచ్చ రంగు ఆ అక్షరం పదంలో ఉందనీ, పదంలో సరైన స్థానం లోనే ఉందనీ సూచిస్తుంది. పసుపు రంగు అంటే ఆ అక్షరం సమాధానంలో ఉంది గానీ సరైన స్థానంలో లేదని, బూడిద రంగులో (గ్రే) ఉంటే ఆ అక్షరం అసలు సమాధానంలో లేనే లేదనీ అర్థం.[2] ఆటలో "హార్డ్ మోడ్" అనే ఎంపిక ఉంది. ఈ పద్ధతిలో ఆటగాళ్లు ఆకుపచ్చ, పసుపు రంగులలో ఉన్న అక్షరాలను తదుపరి ప్రయత్నాల్లో పెట్టే పదాల్లో చేర్చి తీరాల్సి ఉంటుంది.[3] వర్డిల్ రోజుకొక పదం ఇస్తుంది. ఆటగాళ్ళందరికీ ఒకే పదం ఇస్తుంది.[4] ఆటలో ఒక చీకటి థీము కూడా ఉంది. అలాగే వర్ణాంధుల కోసం హై కాంట్రాస్టు థీము కూడా ఉంది. ఈ థీములో ఆకుపచ్చ, పసుపు రంగుల స్థానంలో ఆరెంజి, నీలం రంగులుంటాయి.[3][5]

ఈ ఆటకు, 1955 నాటి కాగితం కలంతో ఆడే జోట్టో తోటి, గేమ్ షో లింగో తోటీ పోలికలున్నాయి.[6][7][8][9]

చరిత్ర మార్చు

 
తెలుగు వర్డిల్‌ పరిష్కారాన్ని ట్విట్టరులో పంచుకున్న విధానం. ఆట పూర్తవగానే పై గడులను చూపిస్తుంది. దాన్ని కాపీ చేసుకుని ఎక్కడైనా అతికించి ప్రచురించవచ్చు.

వార్డిల్ మొదట్లో తన కోసం, అతని భాగస్వామి పాలక్ షా కోసం ఈ ఆటను సృష్టించాడు. 2021 అక్టోబరు మధ్యలో ఈ ఆట తమ బంధువులలో వేగంగా వ్యాపించాక, అతను దానిని బహిరంగపరిచాడు. తన పేరు లోని ఇంటిపేరును శ్లేషిస్తూ, ఇంగ్లీషు వర్డ్‌ను సూచించేలా దానికి వర్డిల్ అని అని పేరు పెట్టాడు. [10] 2013లో అతను ఇదే విధమైన నమూనాను సృష్టించాడు; [11] ఆ ప్రోటోటైపులో వర్సబెట్టి ఎన్నైనా ఆటలు ఆడే వీలుండేది. దాని పదాల జాబితా కూడా వడపోయనిది. [12] వార్డిల్ గతంలో రెడ్డిట్ లో పనిచేస్తున్నప్పుడు బటన్, ప్లేస్ అనే రెండు ఆన్‌లైన్ సామాజిక ప్రయోగాలను రూపొందించాడు. [13] ఈ ఆటతో డబ్బు ఆర్జించే ఉద్దేశ్యం తనకు లేదనీ, "ఇది మీ డేటాను గానీ, మీ ఏకాగ్రతను గానీ అనుచితంగా వాడుకునే ఉద్దేశం లేదు.. ఇదొక సరదా ఆట మాత్రమే." [14] [11] BBC రేడియో 4 టుడేలో ఇంటర్వ్యూలో వార్డిల్, ఏ రోజు ఏ పదం వస్తుందో తనకూ తెలియదని, అందువల్ల తానూ ఈ ఆటను ఆస్వాదిస్తాననీ పేర్కొన్నాడు.

ఆటలో తమ ఫలితాన్ని ఇతరులతో పంచుకునే అంశాన్ని జోడించిన తర్వాత, ఆటకు ఆదరణ పెరిగింది. ఆటగాళ్ళు తమ ఫలితాలను రంగుల చతురస్రాకార ఎమోజి గ్రిడ్ రూపంలో కాపీ చేసుకుని దాన్ని ట్విట్టర్లో ప్రచురించే వీలు కలిగాక, 2021 డిసెంబరు చివరలో ట్విట్టరులో ఈ ఆట వైరల్‌గా మారింది. [15] [16] [17] 2022 జనవరి 2 న 3,00,000 మంది ఆట ఆడారు, 2021 నవంబరు 1 నాడు ఆడినది 90 మంది మాత్రమే. [18] వారం తర్వాత ఈ సంఖ్య 20 లక్షలకు పెరిగింది. [19] జనవరి 1 - 13 మధ్య, ట్విట్టర్లో 12 లక్షల వర్డిల్ ఫలితాలను పంచుకున్నారు. [20] CNET, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ వంటి అనేక మీడియా సంస్థలు, ఈ ఆట లోని రోజువారీ తనమే దీని ప్రజాదరణకు కారణమని పేర్కొన్నాయి. [21] [16] రోజుకు ఒక్క ఆటే ఉండటం వలన ఇంకా కావాలనే భావం ఏర్పడుతుందని వార్డిల్ సూచించాడు; ప్రతి రోజు ఆటలో కేవలం మూడు నిమిషాలు మాత్రమే వెచ్చించేలా ఇది ఆటగాళ్లను ప్రోత్సహిస్తుందని కూడా అతను పేర్కొన్నాడు. [10] ఆటలో స్థితిని సూచిస్తూ కీబోర్డు రంగులు మారడం వంటివి కూడా ఆటగాళ్ల ఆనందానికి కారణాలని అతడు అన్నాడు. [12]

Google ఒక ప్రత్యేక Google Doodle ని సృష్టించింది. "Wordle" కోసం వెతికినప్పుడు చూపించే ఫలితాల్లో సైటు లోగో "Google" అనే పదాన్ని కనుగొనడానికి Wordle యొక్క యానిమేటెడ్ ఆటగా మారింది. [22] ట్విట్టర్లో తమ ఫలితాలను ప్రకటించగానే మరుసటి రోజు ఏ పదం వస్తుందో ఊహించే ఆటోమాటిక్ రోబాట్‌ను ట్విట్టరు నిషేధించింది. ఆటగాళ్ళు ఆటను ఆస్వాదించడంలో ఇది అడ్డుపడుతోందని ట్విట్టరు భావించింది. [23]

జనవరి 31, 2022న, ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక మాతృ సంస్థ అయిన ది న్యూయార్క్ టైమ్స్ కంపెనీ, వెల్లడించని ధరకి వార్డిల్ నుండి వర్డిల్‌ని కొనుగోలు చేసింది. టైమ్స్ తన క్రాస్‌వర్డ్ పజిల్‌లు, స్పెల్లింగ్ బీ వంటి ఆటలతో పాటు ఈ ఆటను కూడా తన మొబైల్ యాప్‌కి జోడించింది. 2025 నాటికి తన డిజిటల్ సబ్‌స్క్రైబర్‌లను కోటికి పెంచుకోవాలని తలపెట్టింది. టైమ్స్ గేమ్ ప్రారంభంలో కొత్త, పాత వినియోగదారులకు ఉచితంగా ఉంటుందనీ దాని గేమ్‌ప్లేలో ఎటువంటి మార్పులు చేయమనీ చెప్పింది. [24] [25] [26] ఈ కొనుగోలు వల్ల ఆట చివరికి కొనుక్కోవాల్సి వస్తుందేమోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. [27] గేమ్ పూర్తిగా బ్రౌజర్‌లో క్లయింట్-సైడ్ కోడ్‌ను ఉపయోగించి పనిచేస్తుంది కాబట్టి, న్యూయార్క్ టైమ్స్ కంపెనీ గేమ్‌ను అవాంఛనీయంగా మారుస్తుందనే భయంతో కొంతమంది ఆటగాళ్ళు ఆఫ్‌లైన్ ఉపయోగం కోసం వెబ్‌పేజీని డౌన్‌లోడ్ చేసుకున్నారు. [28] [29]

ఇతర భాషల్లో వర్డిల్ మార్చు

భారతీయ భాషల్లో వర్డిల్ మార్చు

ఈమాట వెబ్ పత్రిక నిర్వాహకుడైన సురేష్ కొలిచాల, వర్డిల్ తెలుగు రూపాన్ని సృష్టించాడు. 2022 ఫిబ్రవరి నుండి ఇది ఈమాట దీన్ని ప్రచురిస్తోంది. ఇది కూడా రోజుకు ఒక్కసారి ఆడే ఆటే. ఐదక్షరాల పదంతో పాటు, నాలుగు, మూడు అక్షరాల వర్డిల్‌లు కూడా ఉండడం ఈ ఆట ప్రత్యేకత.

కన్నడంలో కూడా ఈ ఆటను సృష్టించారు.

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. Astle, David (December 31, 2021). "Tips from an expert: How to solve everyone's favourite game Wordle". Sydney Morning Herald. Archived from the original on December 30, 2021. Retrieved December 31, 2021.
  2. Tech Desk (December 21, 2021). "Wordle: All about the viral game Twitter is going bonkers over". The Indian Express. Archived from the original on January 1, 2022. Retrieved December 31, 2021.
  3. 3.0 3.1 Lyons, Kim (January 20, 2022). "How to play Wordle". The Verge. Archived from the original on January 25, 2022. Retrieved January 20, 2022.
  4. Carpenter, Nicole (December 29, 2021). "What is Wordle? A viral word game everyone's playing". Polygon. Archived from the original on December 30, 2021. Retrieved December 31, 2021.
  5. Pisani, Joseph (January 19, 2022). "What Is Wordle? How to Play the Viral Word Game and Tricks to Impress Your Friends". The Wall Street Journal. Archived from the original on January 25, 2022. Retrieved January 20, 2022.
  6. Brocklehurst, Harrison (January 4, 2022). "What the hell is Wordle, and why is Twitter full of people tweeting coloured squares?". The Tab. Archived from the original on January 4, 2022. Retrieved January 5, 2022.
  7. Jackson, Gita (January 5, 2022). "Why Is Everyone Tweeting Their 'Wordle' Scores?". Vice. Archived from the original on January 5, 2022. Retrieved January 5, 2022.
  8. Van Stam, Tom (January 5, 2022). "Woordspel Wordle is binnen een mum van tijd een van de populairste games ter wereld" [In no time, word game Wordle has become one of the most popular games in the world]. IGN Benelux (in డచ్). Archived from the original on January 6, 2022. Retrieved January 5, 2022.
  9. Orland, Kyle (January 12, 2022). "Wordle and IP law: What happens when a hot game gets cloned". Ars Technica. Archived from the original on January 12, 2022. Retrieved January 12, 2022.
  10. 10.0 10.1 Victor, Daniel (January 3, 2022). "Wordle Is a Love Story". The New York Times. Retrieved January 5, 2022.
  11. 11.0 11.1 Wakefield, Jane (January 5, 2022). "Wordle creator promises viral game will stay simple and ad-free". BBC News. Retrieved January 5, 2022.
  12. 12.0 12.1 Holliday, Nicole (January 19, 2022). "Wordle's Creator Thinks He Knows Why the Game Has Gone So Viral". Slate. Retrieved January 19, 2022.
  13. Victor, Daniel (January 3, 2022). "Wordle Is a Love Story". The New York Times. Archived from the original on January 5, 2022. Retrieved January 5, 2022.
  14. "Wordle: why the inventor of the fiendishly addictive online game doesn't want your money". The Guardian. January 4, 2022. Retrieved January 5, 2022.
  15. Lum, Patrick (December 23, 2021). "What is Wordle? The new viral word game delighting the internet". The Guardian. Retrieved January 1, 2022.
  16. 16.0 16.1 Tech Desk (December 21, 2021). "Wordle: All about the viral game Twitter is going bonkers over". The Indian Express. Retrieved December 31, 2021.
  17. Price, Renata (December 30, 2021). "Wordle Is That Square Grid Game You've Been Seeing All Over Social Media". Kotaku. Retrieved December 31, 2021.
  18. Victor, Daniel (January 3, 2022). "Wordle Is a Love Story". The New York Times. Archived from the original on January 5, 2022. Retrieved January 5, 2022.
  19. Hall, Rachel (January 11, 2022). "Wordle creator overwhelmed by global success of hit puzzle". The Guardian. Archived from the original on January 11, 2022. Retrieved January 11, 2022.
  20. Cao, Steffi (January 15, 2022). "How A Group Of Twitter Colleagues Blew Up Wordle". BuzzFeed News. Retrieved January 18, 2022.
  21. Serrels, Mark (December 21, 2021). "WTF is Wordle? Everything to know about the new word game craze". CNET. Retrieved December 31, 2021.
  22. Molina, Brett (January 21, 2022). "This is what happens when you Google 'Wordle'". USA Today. Archived from the original on January 22, 2022. Retrieved January 21, 2022.
  23. Clark, Mitchell (January 24, 2022). "Twitter suspends Wordle-ruining bot". The Verge. Archived from the original on January 24, 2022. Retrieved January 24, 2022.
  24. Benveniste, Alexis (2022-01-31). "The Sudden Rise of Wordle". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Retrieved 2022-02-02.
  25. Tracy, Marc (31 January 2022). "The New York Times Buys Wordle". The New York Times. Retrieved 31 January 2022.
  26. Korn, Jennifer (January 31, 2022). "The New York Times buys popular word game Wordle". CNN. Retrieved February 1, 2022.
  27. Mukherjee, Supantha (February 1, 2022). "Wordle buyout by New York Times draws backlash from fans". Reuters. Retrieved February 1, 2022.
  28. Hollister, Sean (February 1, 2022). "Wordle will be free forever because you can right-click to save the whole game". The Verge. Retrieved February 2, 2022.
  29. Stanton, Rich (February 2, 2022). "Folks are 'saving' six years of Wordle before the NYT messes with it". PC Gamer. Retrieved February 2, 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=వర్డిల్&oldid=3489592" నుండి వెలికితీశారు