వర్ధన్నపేట మండలం

తెలంగాణ, వరంగల్ జిల్లా లోని మండలం


వర్ధన్నపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా లోని మండలం.[1]  2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది అవిభక్త వరంగల్ జిల్లాలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో వరంగల్ గ్రామీణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు వరంగల్ జిల్లాలో భాగమైంది. [2] [3] ప్రస్తుతం ఈ మండలం వరంగల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.

వర్ధన్నపేట
—  మండలం  —
తెలంగాణ పటంలో వరంగల్ జిల్లా, వర్ధన్నపేట స్థానాలు
తెలంగాణ పటంలో వరంగల్ జిల్లా, వర్ధన్నపేట స్థానాలు
తెలంగాణ పటంలో వరంగల్ జిల్లా, వర్ధన్నపేట స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°46′29″N 79°34′21″E / 17.774843°N 79.572487°E / 17.774843; 79.572487
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్ జిల్లా
మండల కేంద్రం వర్ధన్నపేట
గ్రామాలు 12
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 76,873
 - పురుషులు 38,607
 - స్త్రీలు 38,266
అక్షరాస్యత (2011)
 - మొత్తం 52.02%
 - పురుషులు 64.04%
 - స్త్రీలు 39.88%
పిన్‌కోడ్ 506313

మండల జనాభా మార్చు

 
మండల పరిషత్‌ కార్యాలయం
 
తహసీల్దార్‌ కార్యాలయం వర్ధన్నపేట
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 76,873, పురుషులు 38,607, స్త్రీలు 38,266. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 159 చ.కి.మీ. కాగా, జనాభా 48,554. జనాభాలో పురుషులు 24,462 కాగా, స్త్రీల సంఖ్య 24,092. మండలంలో 12,115 గృహాలున్నాయి.[4]

మండలంలోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. వర్ధన్నపేట
  2. చెన్నారం
  3. ఉప్పరపల్లి
  4. నల్లబెల్లి
  5. కత్రియాల్
  6. ఇల్లంద
  7. బండ్ఔతాపూర్
  8. దమ్మన్నపేట్
  9. దివిటీపల్లి
  10. రామవరం
  11. కొత్తపల్లి
  12. లియబర్తి

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
  3. "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు మార్చు