వహీద్ యార్ ఖాన్

తెలంగాణకు చెందిన భారత మాజీ క్రికెటర్.

వహీద్ యార్ ఖాన్ (జననం 9 నవంబరు 1942) తెలంగాణకు చెందిన భారత మాజీ క్రికెటర్. 1960 నుండి 1968 వరకు భారతదేశం తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. 1969 నుండి 1975 వరకు పాకిస్తాన్ తరపున ఆడాడు.

వహీద్ యార్ ఖాన్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1942-11-09) 1942 నవంబరు 9 (వయసు 81)
హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
బ్యాటింగుకుడిచేతి బ్యాటింగ్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1960-61 to 1968-69హైదరాబాదు క్రికెట్ జట్టు
1965-66 to 1968-69స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టీం
1969-70కరాచీ వైట్స్
1969-70 to 1975-76పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్
మ్యాచ్‌లు 59
చేసిన పరుగులు 2453
బ్యాటింగు సగటు 38.93
100లు/50లు 4/18
అత్యుత్తమ స్కోరు 174 *
వేసిన బంతులు 94
వికెట్లు 4
బౌలింగు సగటు 12.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/3
క్యాచ్‌లు/స్టంపింగులు 41/–
మూలం: Cricinfo, 2015 మార్చి 26

జననం మార్చు

ఇతడు 1942, నవంబరు 9న తెలంగాణలోని హైదరాబాదులో జన్మించాడు.

భారతదేశం తరపున మార్చు

1957-58 నుండి 1959-60 వరకు కూచ్ బెహర్ ట్రోఫీలో సౌత్ జోన్ పాఠశాలకు వహీద్ యార్ ఖాన్ ప్రాతినిధ్యం వహించాడు. 1959-60లో జట్టు విజయంలో కీలకపాత్ర వహించాడు. 1960-61 నుండి 1964-65 వరకు రోహింటన్ బారియా ట్రోఫీలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించాడు.[1]

1960-61లో రంజీ ట్రోఫీలో హైదరాబాదు క్రికెట్ జట్టు తరఫున ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. 1964-65లో హైదరాబాదు ఫైనల్స్‌కు చేరుకున్నప్పుడు, క్వార్టర్ ఫైనల్‌లో 67 పరుగులు, సెమీ-ఫైనల్‌లో 109 (మొదటి సెంచరీ), బొంబాయి చేతిలో ఓడిపోయినప్పుడు 78, 23 పరుగులతో హైదరాబాదు ఫైనల్‌లో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.[2] 1966-67లో చార్లీ గ్రిఫిత్ నేతృత్వంలోని వెస్ట్ ఇండియన్ మ్యాచ్ లో 62 పరుగుల తేడాతో సౌత్ జోన్ తరఫున ఒక మ్యాచ్ ఆడాడు. 1968-69 లో ఆంధ్రా క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాదు క్రికెట్ జట్టు తరపున కెనియా జయాన్షియల్ తో కలిసి నాలుగో వికెట్ కు 258 పరుగులు జతచేసి 174 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.[3]

పాకిస్తాన్‌ తరపున మార్చు

1969లో తన తల్లిదండ్రులతో కలిసి పాకిస్తాన్ వెళ్ళాడు. అక్కడ కరాచీ వైట్స్, పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ తరపున ఆడటానికి ఎంపికయ్యాడు. 1970-71లో ఐదు మ్యాచ్‌లలో 68.40 సగటుతో 342 పరుగులు చేశాడు. ఇందులో నేషనల్ బ్యాంక్‌తో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ బి తరపున ఆడిన మ్యాచ్ లో 116 పరుగులతో నాటౌట్‌ గా నిలిచాడు.[4] 1972-73లో లాహోర్ బి క్రికెట్ జట్టుతో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ తరపున ఆడి 119 పరుగులు (తన చివరి సెంచరీ) చేశాడు.[5]

మూలాలు మార్చు

  1. "Miscellaneous matches played by Waheed Yar Khan". CricketArchive. Retrieved 2021-07-23.
  2. "Ranji Trophy 1964-65". CricketArchive. Retrieved 2021-07-23.
  3. "Andhra v Hyderabad 1968-69". CricketArchive. Retrieved 2021-07-23.
  4. "National Bank v PIA B 1970-71". CricketArchive. Retrieved 2021-07-23.
  5. "Lahore B v PIA 1972-73". CricketArchive. Retrieved 2021-07-23.

బయటి లింకులు మార్చు