ఇంకొంత యాదృచ్చిక సమాచారాన్ని చూపించు


యాదృచ్ఛిక ఈ వారం వ్యాసం మార్చు

సంవత్సరం: 2007    వారం: 33

 
భారత జాతీయపతాకం

భారత జాతీయపతాకం ప్రస్తుతమున్న రూపంలో 1947 జూలై 27వ తేదీన జరిగిన రాజ్యాంగసభ ప్రత్యేక సమావేశంలో ఆమోదించబడింది. మన దేశంలో త్రివర్ణపతాకమంటే జాతీయపతాకమే. దీంట్లో పైనుంచి కిందకు అడ్డపట్టీలవలె వరుసగా కాషాయం, తెలుపు మరియు ఆకుపచ్చ రంగులు సమ నిష్పత్తిలో ఉంటాయి. మధ్యభాగంలో 24 ఆకులతో ఆకాశనీలం రంగులో అశోకచక్రం ఉంటుంది. ఈ చక్రం నమూనాను సారనాథ్‌లోని అశోకస్థంభం నుంచి తీసుకున్నారు. దీని వ్యాసం తెలుపు రంగు పట్టీ యొక్క ఎత్తులో నాలుగింట మూడొంతులు. జెండా ఎత్తు, వెడల్పుల నిష్పత్తి 2:3. ఇది భారత సైన్యం యొక్క యుద్ధపతాకం కూడా.

భారత జాతీయ పతాకాన్ని రూపొందించింది ఆంధ్రుడైన పింగళి వెంకయ్య. జాతీయపతాకాన్ని ఖాదీ బట్టతో మాత్రమే చేయాలని జాతీయపతాక నిబంధనలు తెలియజేస్తున్నాయి. పతాకావిష్కరణ, వాడకాల గురించి ఖచ్చితమైన నియమావళి అమల్లో ఉంది. పూర్తివ్యాసం : పాతవి

యాదృచ్ఛిక ఈ వారం బొమ్మ మార్చు

సంవత్సరం: 2007    వారం: 41


 

శిల్పకళలో జగత్ప్రసిద్ధిగాంచిన బేలూరు చెన్నకేశ్వరాలయం కర్ణాటక రాష్ట్రానికి చెందిన హసన్ జిల్లాలోని బేలూరులో ఉన్నది. హొయసలుల శిల్పశైలికి అద్భుత తార్కాణమైన ఈ ఆలయాన్ని విష్ణువర్ధనుడు 1117లో తలకాడు వద్ద చోళులతో యుద్ధములో సాధించిన విజయానికి స్మారకముగా నిర్మింపజేశాడు. ఈ ఆలయ నిర్మాణము పూర్తికావటానికి 103 సంవత్సరాలు పట్టిందని, విష్ణువర్ధనుని మనుమడు రెండవ వీరబల్లాలుడు దీనిని పూర్తిచేశాడని ప్రతీతి.

ఫోటో సౌజన్యం: దినేష్ కన్నంబాడి

యాదృచ్ఛిక చిట్కా మార్చు

తేదీ: సెప్టెంబరు 29

వికీపీడియా: విమర్శలు - జవాబులు - 1

అభ్యంతరం

నేను ఇంత కష్టపడి వ్రాసిన దాన్ని ఎవరో అనామకులు, అదీ ఆ విషయం గురించి ఏమీ తెలియనివారు, ఎడా పెడా దిద్దుబాట్లు చేసేస్తారా? అందులో వట్టి చెత్తను జతపరిచే అవకాశం ఉంది కదా? ఎందుకు ఒప్పుకోవాలి?

జవాబు

వికీపీడియాలో కృషి చేసేవారు స్వంత ఆస్థిని పేర్చుకోవాలని అనుకోవడం లేదు. అందరికీ ఉమ్మడి సంపదగా స్వేచ్చా విజ్ఞానాన్ని కూడబెట్టాలని కలిసి యత్నిస్తున్నారు. ఎంతవారైనా గాని ఒక్కరే గొప్ప వ్యాసాలు వ్రాయగలరని మేము భావించడంలేదు. కాని కలిసి కృషి చేస్తే బృహత్కార్యాన్ని సులువుగా సాధించవచ్చును. ఈ పనిలో కొందరు అజ్ఞానం వలన కాని, లేదా ఉద్దేశ్యపూర్వకంగా గాని మంచి భాగాలను చెడగొట్టవచ్చును. అయితే పాత కూర్పులు "వ్యాసం చరిత్ర"లో భద్రంగా ఉంటాయి గనుక వాటిని పునరుద్ధరించవచ్చును. మన అనుభవం ప్రకారం సదుద్దేశంతో వికీలో పనిచేసేవారు చాలా ఎక్కువమంది. కనుక వ్యాసాలు చెడిపోయేందుకంటే మెరుగుపడేందుకే పుష్కలంగా అవకాశాలున్నాయి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

యాదృచ్ఛిక చరిత్ర మార్చు

తేదీ: జనవరి 1