వాడుకరి:Purushotham9966/అయిన్ రాండ్ నవల ఫౌంటెన్ హెడ్

ఈ నవలను అమెరికన్ నవలారచయిత్రి అయిన్ రాండ్ షుమారు75 సంవత్సరాల క్రితం రచించారు. మార్మికవాదం, మార్క్సిజం, కలెక్టివిజం వంటి భావనలను వ్యతిరేకిస్తూ ఆమె ఆబ్జెక్టివిజం తత్వాన్ని ఈ నవలలో ప్రతిపాదించారు. వ్యక్తి ప్రతిభను ఎవరూ అణచి పెట్టలేరని, రోర్కు వంటి ప్రతిభావంతుడైన భవన నిర్మాణశిల్పి అనేక అననుకూల పరిస్థితులను ఎదుర్కొని అంతిమంగా గొప్ప నిర్మాణ శిల్పిగా, ఇంజనీరుగా పేరుతెచ్చుకుంటాడు. అది అమెరికా మహానగరాలలో ఆకాశహర్మ్యాలు నిటారుగా ఆకాశాన్ని చుంబిస్తూ తలయెత్తుకొంటున్న సందర్భం. అల్పప్రగ్ఞావంతులైన పీటర్ కీటింగ్ వంటి నకిలీ ఇంజనీర్లు మొదట పత్రికలు, భజనపరుల సహకారంతో పైకివచ్చినా చివరన వారి స్వస్వరూపం బయటపడి అపఖ్యాతి పాలవుతారు. టుహి వంటి అసూయాపరులైన జర్నలిస్టులు ఏమార్గంలోనైనా ప్రథానపాత్ర రోర్కు పైకిరాకుండా సర్వశక్తులు ఒడ్డుతారు. వైనాండ్ తన ధనబలం, పత్రికల బలంతో ఏమైనా సాధించగలనన్న పెట్టుబడిదారు. చివరకు మంచివైపు నిలబడినా ఆత్మబలంలేక అల్లరిమూకల దాడికి భయపడి తలవంచి, పేరును, భార్య డోమినిక్ ను పోగొట్టుకుంటాడు. నవలలో ప్రకృతి వర్ణపలు, పాత్రల వేషభాషలు తరచు ప్రతీకాత్మకంగా. ఈనాటి మన సమాజానికి ఈ నవలకు ఎన్నో పోలికలు, పత్రికాధిపతులు సమాజంలో అవిద్యావంతులైన ప్రజలకు నీచాభిరుచులను, నేరాలు ఘోరాలు పతాకశీర్షికలలో వండి వడ్డిస్తున్నారు, ప్రజల అభిరుచులను ఇచ్చవచ్చినట్లు మరల్చి ఆడుకోగలుగుతున్నారు. ఈ 850 పుటల పుస్తకం ముఖపత్రం మీద మనిషి అజేయుడని చెప్పడానికి ఉదయించే సూర్యుడి చిత్రాన్ని ప్రతీకగా వేశారు. మానవ సృజనాత్మక శక్తిమీద గొప్ప నమ్మకం కలిగించే నవల. డాక్టర్ రెంటాల వెకటేశ్వరరావు అనువాదం సరళంగా ఉంది.