వాడుకరి:Purushotham9966/మార్టిన్ క్రూజ్ హవానా బే నవల

మార్టిన్ క్రూజ్ స్మిత్ నవాలకారులుగా ప్రసిద్ధులు. ఈనాటి క్యూబా రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో, ఒక రకంగా 1999 నాటి క్యూబా దేశపు పరిస్థితుల నేపధ్యంలో రాయబడిన నవల హవానా బే.

క్యూబాలో కమ్యూనిస్టు విప్లవం తర్వాత, రష్యాలో కమునిస్ట్ ప్రభుత్వం పోయిన తర్వాత ఆదేశం క్యూబాను గాలికి విడిచిపెట్టి అనాథను చేసింది. క్యూబాలో ఒక వెలుగు వెలిగిన రష్యా పాఠశాలలు, నృత్యశాలలు, సాంస్కృతిక సంస్థలు అన్నీ మూతపడతాయి. రష్యానుంచి ఎటువంటి సహాయం లేక, అమెరికా నిషేధాలవల్లా క్యూబా ఆర్థికంగా చితికి పోయింది. భోజనం కూడా జనానికి లభ్యం కానీ దారుణ పరిస్థితి, క్యూబాలో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న కొంపలు, 1950 నాటి అమెరికా కార్లు- ఇటువంటి విపరీతమైన కరువు పరిస్థితుల్లో ఆ దేశం కొనసాగడానికి ప్రభుత్వం అనేక విధినిషేధాలు అమలు చేసింది. ఏమయినా క్యూబా విద్య, వైద్య రంగాల్లో మాత్రం గొప్ప అభివృద్ధిని సాధించింది.

అమెరికా దేశపు రచయిత మార్టిన్ క్రూజ్ స్మిత్ ఈ పరిస్థితులను "గోర్కీ పార్క్, హవానా బే" అనే రెండు నవలల్లో చిత్రించారు.

450 పుటల నవల హవానా బే చాలా నెమ్మదిగా సాగుతుంది. క్యూబా చరిత్రతో అంతో ఇంతో పరిచయం ఉంటేనే తప్ప అనేక్ ఘటనల పూర్వాపర్వాలు బోధ పడవు.

రష్యాకు, క్యూబాకు ఎడముఖం, పెడముఖం అయిన తర్వాత 1999 ప్రాంతాలనాటి సంఘటనలు, చరిత్ర నేపధ్యం. ఫిడల్ కేస్ట్రో ఇంకా ఆ దేశాధ్యక్షులుగా ఉన్నారు. కథంతా క్యూబా ముఖ్యపట్టణం హవానా లోనే జరుగుతుంది. హవానాలో రష్యా గూఢచారి ప్రిబ్లుడా శవం హవానా బేలో తేలుతూ కనిపిస్తుంది. ఆ సంఘటనను విచారించడానికి రష్యానుంచి కల్నల్ ఆర్కడే అనే గూఢచారి హవానా వస్తాడు. క్యూబా పోలీసులు ఈ మరణాన్ని సాధారణ మరణంగా భావిస్తారుగానీ, ఆర్కడే మాత్రం సీరియస్ గా తీసుకొంటాడు. ఆర్కడే ఎంతో ప్రేమించే భార్య వైద్యుల నిర్లక్ష్యం వల్ల కొద్దికాలం క్రితం మరణించి ఉంటుంది. ఆ వియోగబాధలోనే అతను ఈ హత్యోదంతాన్ని పరిశోధించడానికి హవానాకు పంపబడతాడు. ఆతను హవానాలో వ్యక్తిగత విషాదాన్ని భరించలేక ఒక సారి ఆత్మహత్యకు కూడా ప్రయత్నం చేస్తాడు. క్యూబా ప్రభుత్వ డిటెక్టివ్, ఇద్దరు కుమార్తెల తల్లి ఓఫీలియా పినేరో అనే మహిళ ఈపరిశోధనక్రమంలో ఆర్కడేకు దగ్గరవుతుంది.

తనమీద హత్యా ప్రయత్నాలు జరిగినట్లు ఆర్కడేకి అనుమానం కలుగుతుంది. యదాలపంగా తన విచారణలో ప్రిబ్లుడా మరణానికీ, మిలియన్ల డాలర్ల చక్కెర ఎగుమతుల వ్యాపారానికి సంబంధించిన ఒప్పందానికీ మధ్య ఏదో సంబంధం ఉన్నట్లు ఆర్కడే గుర్తిస్తాడు. నవల ముగింపులో అతను చిక్కు ముడులన్నీ విప్పి అసలు నేరస్థులను గుర్తిస్తాడు.

Havana Bay By Martin Quiz Smith, 1999 publication.