వాడుకరి:Purushotham9966/యూదుల చరిత్ర చరిత్రలో యూదులు

యూదుల చరిత్ర చరిత్రలో యూదులు రచయిత: డాక్టర్ ఆర్.శర్మ పాలస్తీనా, యూదులు చరిత్రను ఈ చిన్న పుస్తకంలో వివరించారు. క్రీస్తుకు పూర్వం 1100నాటికే యూదుల ప్రస్తావనలు గ్రంథస్తం అయి ఉన్నాయి. ఎప్పుడో రెండువేల సంవత్సరాల క్రితం చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదరై, బలమైన వాణిజ్య వర్గంగా అనేక దేశాల్లో స్థిరపడిన యూదులకొక మాత్రుదేశం కావాలనే ఆలోచన 19వశతాబ్దిలో పొటమరించింది. అనేక కారణాలు, అపోహలు, ప్రిజుడిస్ ల కారణంగా హిట్లర్, ఆయన పార్టీ జర్మన్ ల అన్ని కష్టాలకు యూదులే కారణమని జర్మనీలో యూదుల నిర్మూలనకు పూనుకున్నారు.

రెండో ప్రపంచ యుద్ధానంతరం ఎక్కడెక్కడి యూదులు పాలస్తీనాకు చేరి యూదులరాజ్యం ఇజ్రాయెల్ ను నెలకొల్పి చుట్టూ పక్కల పాలస్తీనా ప్రజల భూములను దురాక్రమించారు. ఈ దురాక్రమణ విధానం నిరంతర ఘర్షణకు, అశాంతికి, యుద్ధాలకు కారణమైంది. అగ్రరాజ్యాల వత్తాసుతో  ఇజ్రాయెల్ తన దురాక్రమణ విధానాన్ని నేటికీ కొనసాగిస్తూనే ఉంది. 

పాలస్తీనా ప్రజలు రకరకాల పేర్లతో అతివాద సంస్థలను నెలకొల్పి, ఇజ్రాయెల్ ను ఎదుర్కొని సాయుధ గెరిల్లా పోరాటాలు కొనసాగిస్తూనే ఉన్నారు. దీనిలో భాగంగానే హమాస్ ఈ అక్టోబరులో చేసిన రాకెట్ దాడి, అందుకు ప్రతిగా ఇజ్రాయెల్ పాలస్తీనా మీద వైమానిక దాడిలో వేలమంది మరణం. ఈ చారిత్రక నేపధ్యాన్ని ఈ పుస్తకంలో రచయిత వివరించారు, చరిత్ర అవగాహన ఉన్న చదువరులకు పుస్తకం సులభంగా బోధపడుతుంది, ఆ నేపధ్యం లేనివారు కొంత ప్రయత్నం చేసి అధ్యయనం చేయవలసి ఉంటుంది. పాలస్తీనా సమస్యను, యూదుల సమస్యలను తెలుగు పాఠకులకు పరిచయం చేసిన పుస్తకం ఇది.