వాడుకరి:Purushotham9966/సాధు సుబ్రహ్మణ్యశర్మ నవల బంకోలా

తెలుగులో చాలా చారిత్రక నవలలు వచ్చాయిగాని సాధు సుబ్రహ్మణ్యశర్మ నవల బంకోలా వంటి మంచి చారిత్రిక నవలలు కొన్ని మాత్రమే.   
నవలారచయిత శ్రీ సాధు సుబ్రహ్మణ్యశర్మ కాకినాడ వాసి. కాకినాడ సమీపంలో సాగరతీరంలో కోరంగి అనే విస్మృత ఓడరేవు ఉంది. బందరు రేవునుంచి ఈస్టిండియా కంపెనీ, కోరంగి ప్రాంతంనుంచి డచ్ ఈస్టిండియా కంపెనీ వ్యాపారం నిర్వహించాయి. స్థానిక మత్స్యకారులు కోరంగి నుంచి సముద్రం మీదకు చేపలవేటకు వెళ్ళేవారు. క్రమంగా వారినౌకలు శక్తి వంతమైనవి అయినవి. నౌకలు కట్టడం, బాగుచెయ్యడంలో స్థానికులు గొప్ప నైపుణ్యం సంపాదించారు. 

డచ్ వారు కోరంగిని చిన్న టౌనుగా అభివృద్ధి చేశారు. కోరంగిలో ఒక వారకాంత-సుందరస్త్రీని, ఒక మత్స్యకార యువకుడిని ముఖ్యపాత్రలుగా 1750-1850వరకు ఆరేవు చుట్టూ కథ అల్లబడింది. ఆనాటి తెలుగువారి జీవితం, సమాజం, డచ్ ఇంగ్లీషు వాణిజ్య కంపెనీలు, వాటిమధ్యపోటీ, సంబంధాలు కల్పన, చరిత్ర కలిపి వాస్తవికంగా చిత్రించారు రచయిత. మధ్యలో విముక్తి పోరాట ప్రయత్నాలు వగైరా కథను కూడా చెప్తారు. ఆంధ్రదేశ చరిత్రలో ఏభైఏళ్ళను ఈ గ్రంథపుటల్లో నిక్షిప్తం చేశారు సాధు సుబ్రహ్మణ్యశర్మ. ఆధునికదృష్టి, చారిత్రక నవలా రచనాశిల్పం రచనకు వన్నెతెచ్చాయి. బంకోలా అంటే సాగరతీరంలో దీపస్థంభం.(లైట్ హౌస్) ఇప్పటికీ కోరంగి వద్ద శిథిలమైన ఆనాటి దీపస్థంభం కానవస్తుంది. మూలాలు : సాధు సుబ్రహ్మణ్య శర్మ నవల బంకోలా(Light House) రెండవ ముద్రణ, పల్లవి ప్రచురణ సంస్థ, విజయవాడ, 2016.