వాడ్రేవు వీరలక్ష్మీదేవి

వాడ్రేవు వీరలక్ష్మీదేవి ప్రముఖ తెలుగు కవయిత్రి, రచయిత్రి, కాలమిస్టు[1][2][3]. ఆమె అనేక పత్రికలలో కథలు వ్రాస్తూంటారు.[4]

వాడ్రేవు వీరలక్ష్మీదేవి
వాడ్రేవు వీరలక్ష్మీదేవి
జననంవాడ్రేవు వీరలక్ష్మీదేవి
1954
కృష్ణదేవిపేట
ప్రసిద్ధిరచయిత్రి, కాలమిస్టు
తండ్రివాడ్రేవు విశ్వేశ్వర వెంకట చలపతి
తల్లిసత్యవతీదేవి

జీవిత విశేషాలు మార్చు

వాడ్రేవు వీరలక్ష్మిదేవి విశాఖపట్టణం జిల్లా కొయూరు మండలంలో ఉన్న కృష్ణదేవిపేట అనే చిన్న గిరిజన గ్రామంలో 1954న జన్మించింది. ఆమె పోస్టు గ్రాడ్యుయేట్ చదివారు. ఆ ప్రాంతంలో మొదటి తెలుగు లెక్చరర్, మొదటి మహిళా రచయిత. రోడ్డూ, కరెంటూ, హైస్కూలూ, కాలేజీ, రేడియో, వార్తాపత్రికా లేని ప్రాంతంనుంచి ఆమె విద్యావంతురాలిగా, భావుకురాలిగా, జీవితదార్శనికురాలిగా మారడానికి ఎంతో కృషిచేసారు. ఆడపిల్లని చదివించడం ఆ రోజుల్లో కష్టం మాత్రమే కాదు, అసాధ్యం కూడా. కాని వారి నాన్నగారు ఆమెని చదివించినందుకు ఆమె మా నాన్నగారినీ, మా కుటుంబాన్నీ కష్టసమయంలో రెండు చేతులా ఆదుకుంది. ముగ్గురు తమ్ముళ్ళనీ, నలుగురు చెళ్ళెళ్ళనీ చదివించి వాళ్ళకొక జీవితాన్ని సమకూర్చింది. ఆమె సాహిత్యజీవితం అంతా ఒక ఎత్తూ, ఈ కృషి ఒక్కటీ ఒక ఎత్తు. ఆమె గొప్ప ఉపాధ్యాయురాలు. ఆమె తరగతిగదిలోనూ, బయటకూడా కనీసం రెండుతరాల్ని ప్రభావితం చేసింది. మల్లంపల్లి శరభయ్యగారూ, భమిడిపాటి జగన్నాథరావుగారూ వంటి మహనీయులు ముందు ఆమెకు గురువులు.

ఆమె గొప్ప కథకురాలు. ఆమె "ఉత్సవసౌరభం" "కొండఫలం" కథాసంపుటాలు వ్రాసారు. స్త్రీ సమస్యలకి పరిష్కారం ఆర్థికస్వాతంత్ర్యంతో ఆగదనీ, అక్కణ్ణుంచి మళ్ళా మరొక కొత్త ప్రయాణం, పోరాటం మొదలవుతాయనీ ఆమె గత ముఫ్ఫై యేళ్ళుగా తన కథలలో తెలియజేసారు.[5]

రచనలు మార్చు

  • 24 కారెట్ కథ (1983)
  • ఆకులో ఆకునై [6]
  • సత్యాన్వేషి చలం[7]
  • కొండఫలం మరికొన్ని కథలు[8]
  • మా ఊళ్ళో కురిసిన వాన
  • వెల్లువ

పురస్కారాలు మార్చు

  • సుశీలానారాయణరెడ్డి సాహితీ అవార్డు (2016 జనవరి 20 న ప్రదానం)

మూలాలు మార్చు

  1. Focus on women writers at literary fete, December 4, 2006
  2. KRIYA Team
  3. ‘Vasu Charitra, a treasure trove’ KAKINADA, April 29, 2014
  4. "మిసిమి మాసపత్రికలో "స్కై బాబా కథలు"". Archived from the original on 2015-03-26. Retrieved 2016-01-18.
  5. వాడ్రేవు వీరలక్ష్మిదేవి - వ్యాసకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు
  6. Akulo Akunai... (Telugu) Paperback – 2012
  7. Most Popular Telugu Books › Satyaanveshi Chalam[permanent dead link]
  8. "Dr. Vadrevu Veera Lakshmi Devi". Archived from the original on 2016-04-02. Retrieved 2016-01-18.

ఇతర లింకులు మార్చు