వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 36వ వారం

యానాం, పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతములోని ఒక జిల్లా మరియు ఆ జిల్లా యొక్క ముఖ్య పట్టణము. ఈ జిల్లా ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో 30 చ.కి.మీల విస్తీర్ణములో ఉంటుంది. ఇక్కడ నివసించే 32,000 జనాభాలో, చాలామంది తెలుగు మాట్లాడతారు. 1954 లో ఫ్రాంసు నుండి భారతదేశానికి ఇవ్వబడినా ఫ్రెంచి యానామ్ గా గుర్తింపు వుంది. దీనికి 300 సంవత్సరాల చరిత్ర వుంది. ఫ్రెంచి మరియు తెలుగు సంస్కృతుల మేళవింపు యానామ్ లో కనిపిస్తుంది. ఫ్రెంచి పరిపాలనలో జనవరిలో యానాం ప్రజల పండగ రోజులలో మంగళవారం సంత లో విదేశి మరియుదొంగతనంగా దిగుమతిఅయిన సరకు కొనటానికి తెలుగు వారు యానాం వెళ్లేవారు. ఇంతకు ముందు కళ్యాణపురం అనేవారు ఎందుకంటే బ్రిటీషు వారు 1929 లో శారదా చట్టం ద్వారా బాల్యవివాహాలు నిషేధించినతర్వాత, ఇక్కడకు పెళ్లిల్లు జరిగేవి. 1936 లో యానాం జనాభా 5220. 1995-2005 అభివృద్ధి నివేదికలప్రకారం, పాండీచేరీలో ఉత్తమ నియోజకవర్గంగా గుర్తించబడింది. కొత్త పథకాలకు ప్రయోగాత్మక కేంద్రంగా వుండేది. (ఇంకా…)