వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 52వ వారం

యేసు
యేసు (Jesus) (క్రీ.పూ 7–2 నుండి క్రీ.శ 26–36 వరకు) నజరేయుడైన యేసుగా కూడా పిలవబడే ఈయన పేరిట క్రైస్తవ మతము పౌలు గారిచే అంతియొకయలో ప్రారంబించబడింది.ఈయన యేసు క్రీస్తుగా కూడ వ్యవహరించబడతాడు. క్రీస్తు అన్న పదము గ్రీకు భాషలో క్రీస్తోస్ ("ఆభిషిక్తుడు")నుండి పుట్టింది.ఇది హీబ్రూలో "మెసయ్యా"కు సమానం.

కొత్త నిబంధన గ్రంథం లోని నాలుగు సువార్తలుమత్తయి, మార్కు, లూకా మరియు యోహాను సువార్తలలో యేసు జీవితము మరియు బోధనలకు సంబంధించిన సమాచారం ఉంది.చాలా మంది బైబిలు పరిశోధకులు మరియు చరిత్రకారులు యేసు, గలిలయకు చెందిన ఒక యూదు మత బోధకుడని,బాప్తిస్మమిచ్చు యోహానుచే బాప్తిస్మము పొందాడనీ, తనను తాను దేవుని ఎకైక అద్వితీయ కుమారుడని తద్వార దేవునికి సమానుడనే, రోమన్ సామ్రాజ్యాన్ని మాయచేస్తున్నాడనే ఆరోపణలతో రోమన్ అధికారి పొంతి పిలాతు ఆజ్ఞానుసారము శిలువ వేయబడ్డాడని అంగీకరిస్తారు.

యేసుక్రీస్తుపై విభిన్న క్రైస్తవ ధృక్కోణాలు పాతనిబంధన గ్రంథం లేదా యూదు తోరాహ్ లో వస్తాడని చెప్పిన మెసయ్య లేదా క్రీస్తు ఈయనే అని, ఈయన సిలువవేయబడిన తరువాత సమాధి నుండి లేచి వచ్చాడనే భావనల పై కేంద్రీకృతమై ఉన్నాయి. అధిక శాతం క్రైస్తవులు యేసుని, తమ పాప ప్రక్షాళన కొరకు మరియు దేవునితో సమాధానపరుచుటకు పంపబడిన దేవుని కుమారుడిగా భావిస్తారు. త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మే క్రైస్తవులు యేసుని దేవుని యొక్క అవతారంగా భావిస్తారు.యేసు దైవత్వము సంబంధంచిన గూఢార్థాల విద్యను క్రిస్టోలొజి అని పిలుస్తారు.కన్యకు పుట్టటం,పరలోక ప్రయాణం , రెండవ రాకడ.అద్భుతాలు. యేసు పాత నిబంధన గ్రంథం లోని ప్రవచనాలను నెరవేర్చారని నమ్ముతారు. (ఇంకా…)