వికీపీడియా:దశాబ్ది ఉత్సవాల వికీ పురస్కార ఎంపిక/నాలుగవ స్కైప్ సమావేశం నివేదిక

తేది, సమయం

డిసెంబర్ 9,2013, భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 నుండి 2 గంటలకు

పాల్గొన్న వారు

వైజాసత్య, అర్జున, సుజాత రాధాకృష్ణ(పాక్షికం), రాజశేఖర్

సమావేశ చర్చాంశాలు
  1. క్రితం సమావేశం నివేదిక ఖరారుచేయబడింది.
  2. పురస్కార ప్రక్రియపై సందేహాలకి స్పందన, సుదీర్ఘంగా చర్చించి ఖరారుచేయటమైనది. ప్రతిని పురస్కారం చర్చాపేజీలో వైజాసత్య గారు చేరుస్తారు.
  3. వికీపీడియా:దశాబ్ది ఉత్సవాల వికీ పురస్కార ఎంపిక/కొలబద్ద , సుదీర్ఘంగా చర్చించి ఖరారుచేయటమైనది. ప్రతిని పురస్కారం ఎంపికపేజీకి ఉపపేజీగా అర్జున చేరుస్తారు.
  4. ప్రస్తుత ప్రతిపాదనల సమీక్ష: ఇప్పటికే వచ్చిన ప్రతిపాదనలపై సంతోషంగా వున్నా, ప్రతిపాదనలోని విభాగాలు చాలావరకు పూరించబడలేదు. ఇంకా కొంతమంది ప్రతిపాదిత సభ్యుల అంగీకారం రాలేదు మరికొంతమంది సభ్యుల పై ప్రతిపాదినలుకూడారాలేదు. అందువలప్రతిపాదనల గడువు 16 డిసెంబరు గా పొడిగించడానికి మండలి ఆమోదించింది. దీని వలన ఫలిత ప్రకటన ఒక వారం ఆలస్యమవుతుంది. సముదాయం ప్రతిపాదనలను తగిన వివరణలతో పరిపుష్టం చేయవలసినదిగా మరియు ఇంకా అర్హులైన వారిని ప్రతిపాదించి, వారి అంగీకారం కొరకు ప్రయత్నించవలసిందిగా విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకొంది. ప్రతిపాదనలు మెరుగుచేయటానికి కొలబద్ద మొదటి ప్రతిని గమనించి తగిన ఆధారాలు, వివరాలు చేర్చవలసిందిగా సముదాయానికి తెలపాలని నిర్ణయం తీసుకోవడమైంది.
  5. ప్రక్రియకు సంబంధించిన పేజీలు, పనుల సమీక్ష, సవరణలు, ఖరారు.. సమయాభావం వలన చర్చించలేదు.
  6. తరువాతి సమావేశం తేది నిర్ణయం
  7. <పై వరుసలో చేర్చండి>
  8. తరువాతి సమావేశం తేది నిర్ణయం

13 డిసెంబర్ 2013(?), మధ్యాహ్నం 1 నుండి 2PM (భాప్రాకా)