... అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు యూరీ గగారిన్ అనీ! ( యూరీ గగారిన్ వ్యాసం )
... డా. సి. నారాయణ రెడ్డి రచించిన విశ్వంభర అనే కావ్యానికి 1988లో భారతదేశంలో సాహిత్య అత్యున్నత పురస్కారం, జ్ఞానపీఠ్ అవార్డు బహుకరించబడినదనీ! ( విశ్వంభర వ్యాసం )
... రమణ మహర్షి తన మౌనం ద్వారా సందేశాన్ని పొందలేని వారికి మత్రమే బోధనల ద్వారా ఉపదేశించేవాడనీ! ( రమణ మహర్షి వ్యాసం )
... ఇటీవల పరమపదించిన హాస్యనటుడు నగేష్ ను దక్షిణాది చార్లీ చాప్లిన్ గా అభివర్ణిస్తారనీ! ( నగేష్ వ్యాసం )
... యూరప్ కు చెందిన ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో ఎత్తైన పర్వత శిఖరం మాంట్ బ్లాంక్ అనీ! (ఆల్ఫ్స్ పర్వతాలు వ్యాసం) (కుడివైపున బొమ్మ చూపబడినది)
... షాంఘై నగరం చైనాలో అతిపెద్ద నగరమనీ! ( షాంఘై వ్యాసం )
... సూయజ్ కాలువ యూరప్ మరియు ఆసియా ఖండాల మధ్య జల రవాణా కొరకు ఆఫ్రికా ఖండాన్ని మొత్తం చుట్టిరాకుండా దగ్గర మార్గంగా 1869 లో ఏర్పాటు చేయబడిందనీ! ( సూయజ్ కాలువ వ్యాసం )
... అత్యంత ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజు 2008 సంవత్సరానికి గాను భారతీయ రచయిత అరవింద్ అడిగ ఎన్నికయ్యాడనీ! ( బుకర్ బహుమతి వ్యాసం )
... మహాకావ్యం కిరాతార్జునీయం ను రచించినది భారవి అనీ! ( భారవి వ్యాసం )
... దాదాపు శరీరం మొత్తం సహకరించకపోయినా భౌతిక శాస్త్రంలో విశేష కృషి చేసిన ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అనీ! (కుడివైపున బొమ్మ చూపబడినది)
... సిమెంటు ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నదనీ! (సిమెంటు వ్యాసం)
... ప్రపంచంలో మొట్టమొదటి ఉపగ్రహం పేరు స్పుత్నిక్ అనీ! (స్పుత్నిక్ వ్యాసం )
... తెలుగు సాహితీ ప్రపంచంలో దిగంబర కవులు గా ప్రసిద్ధిగాంచిన ఆరుగురిలో వీరవెల్లి రాఘవాచార్య ఒకరనీ! ( జ్వాలాముఖి వ్యాసం)
... 2007 లో అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ షిండ్లర్స్ లిస్ట్ చిత్రాన్ని సినీ చరిత్రలో అత్యున్నత 100 చిత్రాలో ఎనిమిదవ చిత్రంగా ఎన్నుకున్నదనీ ( షిండ్లర్స్ లిస్ట్ వ్యాసం )