వికీపీడియా:మొబైల్లో దిద్దుబాటు చెయ్యడం లోని మంచిచెడుల గురించి చర్చ

వికీపీడియా:మొబైల్లో దిద్దుబాటు చెయ్యడం లోని మంచిచెడుల గురించి చర్చ మొబైలు పరికరాలపై దిద్దుబాటు చెయ్యడం లోని సౌలభ్యాలు ఇబ్బందుల గురించి మనకు ఎక్కడా సహాయ్ం పేజీ గానీ, వికీపీడియా పేజీ గానీ లేదు. ఇటీవలి కాలంలో మొబైలుపై వికీ వాడుక బాగా పెరిగిపోయింది. మొత్తం వికీ పాఠకుల్లో 90% మంది మొబైలు పైననే వికీని చూస్తున్నారు. కొత్తగా చేరే వాడుకరులు మొబైలుపైననే దిదుబాటు చేసేందుకు సుముఖంగా ఉంటారని ఈ గణాంకాల బట్టి చెప్పవచ్చు. అంచేత మొబైలుపై దిద్దుబాటు చెయ్యడం ఎలా అనే విషయమై కొత్తవారి సహాయార్థం మనం పేజీలు తయారుచేసి పెట్టాల్సి ఉంది. అందుకోసం తగు సమాచారాన్ని సేకరించడమే ఈ పేజీ ఉద్దేశం. పాత వాడుకరుల్లో ఎక్కువ మంది డెస్క్‌టాప్ సైటు వాడేవారే అయి ఉంటారని, మొబైలు సైటుపై దిద్దుబాటు చెయ్యడం లోని పద్ధతులు, కిటుకులు, లోటుపాట్లు వగైరాలన్నీ ఏ ఒక్కరికీ తెలిసి ఉండకపోవచ్చుననీ, అందరూ కలిసి తమతమ అనుభవాలను కలబోసుకుంటే అందులోని మంచిచెడూ అవగతమౌతాయనీ ఆభిప్రాయపడుతూ తయారు చేసిన పేజీ ఇది. మొబైలుపై దిద్దుబాట్లు చేస్తున్న అనుభవం ఉన్నవారు ఈ విషయాల గురించి ఇక్కడి చర్చలో పాల్గొని తెలియజేస్తే వాటిని బట్టి వికీపీడియా:మొబైల్ పరికరాలపై దిద్దుబాటు చెయ్యడం అనే పేజీలో సమాచారాన్ని చేర్చవచ్చు. ఒకవేళ వారు నేరుగా ఆ పేజీలోనే రాయదలిస్తే మరీ మంచిది, సంతోషంగా రాయవచ్చు. ఇతరులు కూడా ఆ పేజీని రూపొందించడంలో సాయపడగలరు.

వాడుకరులందరూ ఈ చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేయవలసినది. మరీ ముఖ్యంగా ఈసరికే మొబైలుపై ఎక్కువగా దిద్దుబాట్లు చేస్తున్న వాడుకరులు పాల్గొనవలసినది.

చదువరి అనుభవాలు మార్చు

సాంకేతిక అంశాలు
ఏ మొబైలు

(యాండ్రాయిడ్ / యాపిల్)

ఏ సైటులో

(డెస్క్‌టాప్ సైటు / మొబైల్ సైటు / యాప్)

యాండ్రాయిడ్ 9 డెస్క్‌టాప్ సైటు

నేను మొబైల్లో పెద్దగా దిద్దుబాట్లు చెయ్యలేదు. యాండ్రాయిడ్ స్మార్ట్‌ఫోనులో, డెస్క్‌టాప్ సైట్లో చేసిన అతి కొద్ది ప్రయత్నాల్లో నా దృష్టికి వచ్చినవివి:

  1. వికీపీడియాలో ఉన్న లిప్యంతరీకరణ సౌలభ్యం ద్వారా తెలుగులో రాసే వీలు లేదు. నా స్మార్ట్‌ఫోనులో ఉన్న తెలుగు కీబోర్డు ద్వారా నేరుగా తెలుగులో టైపు చెయ్యగలిగాను తప్ప, ఇంగ్లీషులో టైపు చేస్తూ ఉంటే తెలుగు లోకి మారడం జరగలేదు (వికీపీడియాలో ఉన్న లిప్యంతరీకరణ సౌలభ్యం పని చెయ్యలేదు). నాకు ఆశ్చర్యం కలిగించింది. నేను ఏదైనా తప్పు చేస్తున్నానేమో నని అనుకున్నాను కూడా. నేను వాడిన కీబోర్డు Gboard.
  2. పై విధంగా లిప్యంతరీకరణ జరక్కపోగా, ఈసరికే ఉన్న పాఠ్యంలో సవరణలు చెయ్యబోతే, ఏదో చెత్త అక్షరాలు చేరిపోయి, ఉన్న పాఠ్యం చెడిపోయేది.
  3. వెతుకుపెట్టెలో కంప్యూటరు నుండి టైపు చేస్తే వెతుకు పదాల సూచనలు వస్తాయి కదా.., మొబైలు ద్వారా పై పద్ధతిలో టైపు చేస్తోంటే అవి రావడం లేదు. అంతేకాదు, ఇసరికే ఉన్న ఒక పేజీ పేరును పూర్తిగా టైపు చేసాక కూడా ఆ పేజీ సూచన రాలేదు.

__చదువరి (చర్చరచనలు) 05:41, 22 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రణయ్‌రాజ్ వంగరి అనుభవాలు మార్చు

కంప్యూటర్ గానీ, లాప్టాప్ గానీ అందుబాటులో లేని సందర్భాలలో నేను మొబైల్ ద్వారా వికీ రచనలు చేస్తుంటాను. వికీ రచనలో అనుభవం ఉన్నవారికి మొబైల్ లో రాయడం కొంత సులభంగా ఉన్నా, కొత్తవారికి కష్టంగా ఉంటోంది. మొబైల్ లోని బ్రౌజర్ లో వికీవ్యాసం ఓపెన్ చేసినప్పుడు, మొబైల్ వ్యూలో వ్యాసం వస్తుంది. అలా ఓపెన్ చేసినవారు (అజ్ఞాత వాడుకరులు) చిన్నచిన్న మార్పులు (సమాచారం చేర్చడం లేదా తొలగించడం) చేస్తున్నారు. అయితే ఇందులో విజువల్ ఎడిటరును ఎంచుకుంటేనే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, సోర్స్ ఎడిటర్ లో అవి కనిపించడం లేదు. తద్వారా వికీలింకులు, మూలాలు చేర్చడం సాధ్యమవడం లేదు. ఇక బ్రౌజర్ ను డెస్క్‌టాప్ వ్యూ లోకి మార్చుకుంటే అన్ని ఆప్షన్స్ ఉంటాయి. కానీ అందులో ఎడిట్ చేయాలంటే కాస్త అనుభవం ఉండాలి. డెస్క్‌టాప్ వ్యూలో వికీ రచన చేస్తున్నప్పుడు, పైన చదువరి గారు చెప్పిన సాంకేతిక సమస్యలే నాకు కూడా ఎదురయ్యాయి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 14:49, 22 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మహేశ్వరరాజు అనుభవాలు మార్చు

నేను వికీపీడియా లో చేరిన నుండి మొబైల్ నుండే సవరణలు చేస్తున్నా నాకున్న సమస్యలు ప్రధానంగా రెండు అవి
  • వ్యాసం అంతా పూర్తి అయిన తర్వాత పబ్లిష్ చేస్తే ఎర్రర్ వస్తుంది. మళ్లీ ప్రయత్నించగా మనం రాసిన డేటా అంత డిలీట్ అయిపోతుంది.
  • అనువాదాలు చేయడంలో నాకు సమస్య ఉంది .అనువాదం చేసిన తర్వాత ఎడిటింగ్ అవ్వడం లేదు. మూలాలు తెచ్చుకోవడంలో కూడా పెద్ద తలనొప్పిగా ఉంది.Ch Maheswara Raju (చర్చ) 05:24, 23 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర అనుభవాలు మార్చు

నేను నిన్ననే ఐప్యాడ్ ద్వారా కొన్ని దిద్దుబాట్లు చేశాను. నా అనుభవం చాలావరకు ఆశాజనకంగానే ఉంది. ముఖ్యంగా సోర్సు ఎడిటరు కన్నా విజువల్ ఎడిటరులో దిద్దుబాట్లు చేయడం బాగనిపించింది. కొన్ని అక్షర దోష సవరణలు చేసే టప్పుడు మాత్రం కర్సరు పదాల మధ్యలో దూరకుండా ఇబ్బంది పెట్టింది. పదమంతా తొలగించి మళ్ళీ టైపు చేయవలసి వచ్చింది. ఇంకొన్ని సవరణలు చేసిన తర్వాత మరిన్ని అనుభవాలు రాస్తాను. - రవిచంద్ర (చర్చ) 05:33, 3 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]