వికీపీడియా:వికీప్రాజెక్టు/ఫెమినిజం, ఫోక్‌లోర్ ఎడిటథాన్ 2023

ఫెమినిజం, ఫోక్‌లోర్ అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.

ప్రాజెక్టు వివరాలు మార్చు

  • ఉద్దేశ్యం: ప్రపంచ సాంస్కృతిక వారసత్వం, జానపద కథలలో మహిళల గురించి జీవిత చరిత్ర వ్యాసాలను రాయడం, మెరుగుపరచడం
  • ప్రధాన లక్ష్యం: వికీపీడియా, దాని సోదర ప్రాజెక్టులలో మానవ సాంస్కృతిక వైవిధ్యం గురించి కథనాలను సేకరించడం, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతులను మెరుగుపరచడం
  • గడువు: 2023 ఫిబ్రవరి 1 నుండి మార్చి 31 వరకు

నిబంధనలు మార్చు

  • విస్తరించిన లేదా కొత్తగా రాసిన వ్యాసం తప్పనిసరిగా కనీసం 3,000 బైట్లు, కనీసం 300 పదాలు ఉండాలి
  • వ్యాసం పేలవంగా అనువదించబడిన యాంత్రికానువాదం కాకుడదు, ఒకవేళ యాంత్రికంగా అనువదించినప్పటికీ, తగిన కాపీ-సవరణ అవసరం
  • వ్యాసాలు తప్పనిసరిగా 2023 ఫిబ్రవరి 1 నుండి మార్చి 31 మధ్య దిద్దుబాట్లు చేయబడాలి లేదా సృష్టించబడాలి
  • వ్యాసాలు స్త్రీవాదం, జానపద సాహిత్యంపై రాయాలి
  • కొత్త వ్యాసాలు లేదా అభివృద్ధి చేసిన వ్యాసాలు ఎటువంటి కాపీరైట్ ఉల్లంఘన లేదా నోటబిలిటీ సమస్యలను కలిగి ఉండకూడదు
  • వికీపీడియా విధానాలకు అనుగుణంగా ఖచ్చితమైన సూచనలతోనే వ్యాసాలను రూపొందించాలి
  • పోటీ ప్రయోజనం కోసం సృష్టించబడిన ఫౌంటెన్ సాధనానికి ప్రత్యేక లింక్‌కు కథనాలను సమర్పించాలి
  • ఫౌంటెన్ లింక్‌

పాల్గొనేవారు మార్చు

  1. Nagarani Bethi (చర్చ) 08:35, 12 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  2. ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:17, 13 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  3. చదువరి (చర్చరచనలు) 00:55, 15 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  4. Muralikrishna m

వ్యాసాల జాబితా మార్చు

ఫెమినిజం, ఫోక్‌లోర్ ఎడిటథాన్ లో భాగంగా కొన్ని వ్యాసాల జాబితా కోసం ఇక్కడ చూడిండి.

బహుమతులు మార్చు

గ్లోబల్‌గా టాప్ కంట్రిబ్యూటర్‌లకు అవార్డులు (అత్యధిక కథనాలు):

  • మొదటి బహుమతి: - 300 USD
  • రెండవ బహుమతి: - 200 USD
  • మూడవ బహుమతి: - 100 USD
  • టాప్ 15 విజేతలకు కన్సోలేషన్ బహుమతి: - ఒక్కొక్కరికి 10 USD

ఎడిటథాన్ కు సంబంధించిన ఏవైనా సందేహాల కోసం దయచేసి క్రింది నిర్వాహకులను సంప్రదించండి:-

*అంతర్జాతీయ ప్రాజెక్టు గురించి మరింత సమాచారం కోసం, ఫెమినిజం, ఫోక్‌లోర్ ఎడిటథాన్ 2023 చూడండి.

ఫలితాలు మార్చు

ఫెమినిజం, ఫోక్‌లోర్ ఎడిటథాన్ 2023 పోటీలో 77 కొత్త వ్యాసాలతో మురళీకృష్ణ గారు ప్రథమ స్థానంలోనూ, 12 కొత్త వ్యాసాలతో ప్రణయ్‌రాజ్ వంగరి గారు ద్వితీయ స్థానంలోనూ, 1 కొత్త వ్యాసంతో చదువరి గారు తృతీయ స్థానంలో నిలిచారు.

వ్యాసాల జాబితా మార్చు

ఫెమినిజం, ఫోక్‌లోర్ ఎడిటథాన్ 2023 పోటీలో సృష్టించబడిన వ్యాసాలకోసం ఫౌంటెన్ లింక్‌ పేజీని చూడగలరు.

మూలాలు మార్చు