వికీపీడియా:సమిష్టి వ్యాసం/2007 26వ వారం

లంకాధీశుడు, హిందూ రాక్షసుడు అయిన రావణుని ఒక చిత్రణ
లంకాధీశుడు, హిందూ రాక్షసుడు అయిన రావణుని ఒక చిత్రణ

హిందూ మతంలో, రావణుడు ప్రధాన హిందూ ఇతిహాసమైన రామాయణములో ప్రధాన ప్రతినాయకుడు. రామాయణం ప్రకారం రావణుడు అనేక వేల సంవత్సరాల క్రితం లంక కు అధిపతి (రాజు). దశదిక్కులకు వ్యాపించు జ్ఞానమున్నవాడని కళారూపాలలో రావణున్ని పదితలలతో చిత్రిస్తారు. పదితలలు ఉండటం చేత ఈయనకు దశముఖుడు (పది ముఖములు కలవాడు), దశగ్రీవుడు (పది శీర్షములు కలవాడు) మరియు దశకంఠుడు (పది మెడలు కలవాడు) అన్న పేర్లు వచ్చినవి. శ్రీలంకలో రావణున్ని భారతదేశం నుండి తమ స్వాతంత్ర్యానికి ప్రతీకగా ఇప్పటికీ గౌరవిస్తారు.

ఈ వ్యాసాన్ని మెరుగుపరుద్దాం రండి