వికీపీడియా:2016 హైదరాబాద్ పుస్తక ప్రదర్శన - తెవికీ స్టాల్

హైదరాబాద్ బుక్ ఫెయిర్ అసోసియేషన్ వారు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో డిసెంబరు 15 నుంచి జరిగే హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో తెలుగు వికీపీడియా స్టాల్ నిర్వహిస్తున్నాం. ఈ నేపథ్యంలో తెలుగు వికీపీడియా స్టాల్ కు సంబంధించిన పలు వివరాలను ఈ పేజీలో చూడవచ్చు.

నిర్వహణ మార్చు

డిసెంబరు 15 నుంచి ఈ స్టాల్ నిర్వహిస్తున్నాం. స్టాల్ లో రీసోర్సు పర్సన్ గా వ్యవహరించడానికి ఎవరికి ఏయే రోజుల్లో అవకాశం ఉంటుందో నమోదు చేయవచ్చు.

22వ తేది తప్ప మిగతా అన్ని రోజులు నేను అందుబాటులో ఉండగలను -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 19:40, 19 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
నిర్వహణ సహకారం
  • సీఐఎస్-ఎ2కె

కార్యకలాపాలు మార్చు

  • తెలుగు వికీపీడియా, వికీమీడియా ప్రాజెక్టుల పట్ల అవగాహన పెంపు
  • తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల గురించిన కరపత్రం పంపిణీ
  • ఆసక్తి కలవారు తెవికీలో ఖాతా తెరిచేందుకు సహాయం
    • పరిమిత సంఖ్య సర్వే
    • సర్వే ప్రధానంగా తెలుగు పాఠకులకు తెవికీ గురించి పరిచయం ఉందా, వారు కోరుకుంటున్న సమాచారం లేక వ్యాసాలు ఎలాంటివి వంటి అంశాలపై.
  • ఆసక్తి కనబరిచిన పాఠకులకు సర్వే నిర్వహించడం
  • వికీపీడియాలో సమాచారం వినియోగించుకోవడం గురించి, కొత్తగా సమాచారం చేర్చడం గురించి నేర్పడం
  • ఇంటర్నెట్ అందుబాటులో లేనప్పుడూ తెలుగు టైపింగ్ ఎలా చేయవచ్చన్న విషయాన్ని చూపడం
  • ...ఇతర అనుబంధ కార్యకలాపాలు

నివేదిక మార్చు

  • స్టాల్ నిర్వహణలో ప్రణయ్ రాజ్, కశ్యప్, స్వరలాసిక, బి.వి.ప్రసాద్ తదితరులు పాలుపంచుకున్నారు.
  • స్టాల్ నిర్వాహకులు మొదట్లో ఆసక్తి చూపిన పలువురు సందర్శకులతో అక్కడే వికీపీడియా ఖాతాలు తెరిపించి, వికీపీడియా గురించి వివరించారు.
  • ఐతే ఆ పద్ధతి కొంత సమయం ఎక్కువ తీసుకోవడం, ఈలోగా ఆసక్తితో వచ్చిన ఇతరులు వెనుతిరగాల్సి రావడం గమనించి ఈ పద్ధతిలో మార్పులు చేసుకుని వికీపీడియా గురించి వివరించడం, వికీపీడియాలో ఎందుకు రచనలు చేయాలో తెలియజేయడం సాగించారు.
  • అలానే ఆసక్తి కనబరిచి, వికీపీడియా గురించి మరింత నేర్చుకుంటాం అని ముందుకువచ్చిన వారి నుంచి వివరాలు సేకరించి, హైదరాబాద్ నెలవారీ సమావేశాల గురించి తెలియజేసి జనవరి నెలలో జరగనున్న సమావేశాల్లో పాల్గొనమని ప్రోత్సహించారు. వారికి అవసరమైతే భవిష్యత్తులో నిర్వహించే అకాడమీలు, కార్యశాలల వివరాలు తెలియజేసేందుకు గాను కాంటాక్ట్ సమాచారాన్ని ఇష్టపూర్వకంగా ఇస్తే స్వీకరించారు.
  • తెలుగు వికీపీడియా, వికీసోర్సు, విక్ష్నరీ, కామన్స్, వికీకోట్ వంటి ప్రాజెక్టులన్నీ కలిపి తెలుగులో విజ్ఞాన విప్లవానికి నాంది పలుకుతున్నాయని, చరిత్ర సృష్టించే ఈ ప్రయత్నంలో భాగం కమ్మని పిలుపునిచ్చే విజ్ఞాన విప్లవం ప్రచార సరిళిని ఉపయోగించారు. తెలుగు భాష పట్ల మక్కువ ఉన్నవారు తెలుగులో విజ్ఞానం విస్తరించేందుకు కృషిచేయడం అత్యవసరమనీ, అందుకు తెవికీ అత్యంత ప్రధానమైన మార్గమనీ వివరించారు.
  • పుస్తక ప్రియులు, కవులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, నాటక రచయితలు, సినీ దర్శకులు, విద్యార్థులు, కళాశాల ఉపాధ్యాయులు, రచయితలు తదితరులు వికీపీడియా గురించి ప్రణయ్ తదితరుల నుంచి తెలుసుకుని, ఆసక్తి చూపించినవారిలో ఉన్నారు.

వివరాలు మార్చు

ఖాతా తెరిచిన వారు

  1. బంక జయక్రిష్ణ
  2. బాలకృష్ణ
  3. రవీంద్రసూరి నామాల

చిత్రమాలిక మార్చు


 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

స్పందన మార్చు