వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఎన్నికలు/ఎన్నికల సంబంధిత వ్యాసాల సృష్టింపు-2024

తాజా వ్యాఖ్య: OSM పటములు టాపిక్‌లో 2 రోజుల క్రితం. రాసినది: యర్రా రామారావు

ప్రాజెక్టుకు సంబంధించిన మూసలు, వర్గాలు మార్చు

యర్రా రామారావు గారూ, ప్రాజెక్టుకు సంబంధించి, ప్రారంభ ముగింపు తేదీలు, మూసలు, వర్గాలు, వంటి కొన్ని అంశాలను చేర్చాల్సి ఉంది కదా! బహుశా మీరు ఈ పనిలో ఉండే ఉంటారు. అయినా ఒకసారి ప్రస్తావిద్దామనుకున్నాను.__ చదువరి (చర్చరచనలు) 16:52, 8 ఫిబ్రవరి 2024 (UTC)Reply

@చదువరి గారూ నా బాధ్యతను గుర్తుచేసినందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 07:56, 9 ఫిబ్రవరి 2024 (UTC)Reply

చర్చ పేజీలో మూస చేర్చే సంగతి మార్చు

ఒక గమనిక: ఈ ప్రాజెక్టులో భాగంగా మనం సృష్టించే పేజీల చర్చ పేజీల్లో {{వికీప్రాజెక్టు ఎన్నికలు 2024 లో భాగం}} అనే మూసను చేర్చాలి. తద్వారా మన కృషి, ప్రాజెక్టు కృషిలో భాగమౌతుంది. __ చదువరి (చర్చరచనలు) 14:23, 12 ఫిబ్రవరి 2024 (UTC)Reply

ప్రాజెక్టులో చురుకుగా పాలుపంచుకుంటున్న వారందరికీ ధన్యవాదాలు మార్చు

ఈ ప్రాజెక్టులో చురుకుగా పాలుపంచుకుంటున్న @ప్రణయ్‌రాజ్ వంగరి గార్కి, చదువరి గార్కి, బత్తిని వినయ్ కుమార్ గౌడ్ గార్కి, Rajasekhar1961 గార్కి, ఉదయ్ కిరణ్ గార్కి అందరికీ ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 08:42, 13 ఫిబ్రవరి 2024 (UTC)Reply

ధన్యవాదాలు @యర్రా రామారావు గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:44, 16 ఫిబ్రవరి 2024 (UTC)Reply

ఫిబ్రవరి నెల టార్గెట్ 50% దాటేశాం మార్చు

ఈ ప్రాజెక్టు మొదలుపెట్టి ఈ రోజు అనగా 2024 16 నాటికి 12 రోజులు అయింది.ఈ రోజు ఉదయం నాటికి (గ0.08.10ని.లకు) ఫిబ్రవరి టార్గెట్ 200 వ్యాసాలకుగాను 101 వ్యాసాలు సృష్టించి 50% దాటేశాం.ఈ లెక్కన రోజుకు దాదాపుగా 9 -10 వ్యాసాల సృష్టింపు జరుగుతుంది.ఇంకా ఈ నెలలో 13 రోజులు ఉన్నవి.ఆ లెక్కన ఇంకా దాదాపుగా 130 వ్యాసాలకు పైగా సృష్టించటానికి అవకాశం ఉంది.ఇంకా చురుకుగా సాగితే 150 వ్యాసాలు సృష్టించవచ్చు.ఇదే స్పూర్తి కొనసాగించవలసిందిగా ఈ ప్రాజెక్టులో చురుకుగా పాలుపంచుకుంటున్న @ప్రణయ్‌రాజ్ వంగరి గారిని, చదువరి గారిని, బత్తిని వినయ్ కుమార్ గౌడ్ గారిని, Rajasekhar1961 గారిని, ఉదయ్ కిరణ్ గారిని కోరుచున్నాను. అందరికీ ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 02:54, 16 ఫిబ్రవరి 2024 (UTC)Reply

వివిధ రాష్ట్రాల్లో జరిగిన భారత సాధారణ ఎన్నికల పేజీలకు పేర్లు మార్చు

వివిధ రాష్ట్రాల్లో జరిగిన భారత సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పేజీలు సృష్టిస్తున్నాం. వీటికి నేను గతంలో సృష్టించిన పేజీలకు పేర్లు 2019 భారత సార్వత్రిక ఎన్నికలు - కేరళ, 2019 భారత సార్వత్రిక ఎన్నికలు - ఆంధ్రప్రదేశ్ - ఇలా పెట్టాను. నిన్న సృష్టించిన కొన్ని పేజీలకు పేర్లు 1984 జమ్మూ కాశ్మీర్‌లో భారత సాధారణ ఎన్నికలు, 1980 జమ్మూ కాశ్మీర్‌లో భారత సాధారణ ఎన్నికలు అని పెట్టారు. వికీలో ఇలాంటి పేజీలన్నిటికీ ఒకే ఆకృతిలో పేర్లు ఉంటే బాగుంటుంది. పై రెండు పద్ధతుల్లో కాకుండా మూడో పద్ధతి కూడా పరిశీలించవచ్చు - "తెలంగాణలో 2019 భారత సార్వత్రిక ఎన్నికలు" వీటిలో ఏదో ఒక పద్ధతిలోనే పేరు పెడదాం. రకరకాలుగా ఉంటే ఒక ప్రామాణికత ఉండదు. పరిశిలించండి.

జనరల్ ఎలెక్షన్స్ అనే మాటకు తెలుగులో సార్వత్రిక ఎన్నికలు అని వాడడం అనూచానంగా వస్తోంది. దాన్నే వాడదామని నా ప్రతిపాదన. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 05:23, 21 ఫిబ్రవరి 2024 (UTC)Reply

@చదువరి గారూ మీ సూచన సరైందని నేనూ భావిస్తున్నాను.మీరు సూచించిన రెండు పద్ధతులలో ఏదైనా పర్వాలేదు.మీరే ఫైనలుగా నిర్ణయం చేయగలరు.దానికి అనుగుణంగా తరలించవచ్చు.వర్గంలో చూసినప్పుడు శీర్షికలు అన్ని ఒకే పద్ధతిలో ఉంటేనే బావుంటుంది. మీరు గమనించి చర్చ పెట్టినందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 06:16, 21 ఫిబ్రవరి 2024 (UTC)Reply
పేజీల పేర్లకు సంబంధించి మా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు @Chaduvari గారు. మీరు పైన సూచించిన విధంగా అన్ని పేజీలకు ఓకే విధానాన్ని (ఉదా: '2019 భారత సార్వత్రిక ఎన్నికలు - కేరళ') వాడుదాం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:30, 21 ఫిబ్రవరి 2024 (UTC)Reply
"2019 భారత సార్వత్రిక ఎన్నికలు - తెలంగాణ" అనే ఆకృతిలో పేరు నేను వాడాను. కానీ, ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే, దాని కంటే "తెలంగాణలో 2019 భారత సార్వత్రిక ఎన్నికలు" అనే ఆకృతి మెరుగ్గా ఉందేమో నని నాకు అనిపిస్తోంది. ఒకసారి పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 13:56, 21 ఫిబ్రవరి 2024 (UTC)Reply
బాగుంది.నాకు సమ్మతమే.అలా మార్చటానికి నా వైపునుంచి ఏమి అభ్యంతరం లేదు. యర్రా రామారావు (చర్చ) 14:00, 21 ఫిబ్రవరి 2024 (UTC)Reply
@Chaduvari గారూ, "తెలంగాణలో 2019 భారత సార్వత్రిక ఎన్నికలు" అనే ఆకృతిలో పేజీ పేరు మార్చటానికి నాకు అంగీకారమే.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:44, 22 ఫిబ్రవరి 2024 (UTC)Reply

ఈ ప్రాజెక్టులో ఎక్కువుగా ఎర్రలింకులు వస్తున్నట్లు ఉంది మార్చు

ఈ ప్రాజెక్టులో ఎక్కువుగా ఎర్రలింకులు వస్తున్నట్లు ఉంది.దానికి కారణం ఎక్కువుగా పట్టీలలో వివిధ రాష్ట్రాల శాసనసభ్యులుగా ఉన్నవారి శీర్షికలుకు తెలుగులో వ్యాసాలు చాలా తక్కువైనందున అనువాదంలో వాటికి ఎర్రలింకులు ఏర్పడుతున్నవి.కావున వాటిని ఇప్పుడే ఎర్రలింకుల నుండి తొలగిస్తేనే మంచిదనుకుంటాను.వ్యాసం సృష్టించినప్పుడు లింకు కలపవచ్చని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 06:21, 21 ఫిబ్రవరి 2024 (UTC)Reply

అలాగేనండి @యర్రా రామారావు గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:06, 28 ఫిబ్రవరి 2024 (UTC)Reply

వివిధ రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల పేజీలకు పేర్లు మార్చు

@Chaduvari గారూ @Pranayraj1985 గారూ @Batthini Vinay Kumar Goud గారూ

ఈ పేజిలోని 5వ చర్చలో భారత సార్వత్రిక ఎన్నికలు వ్యాసాలను ఉదా: "తెలంగాణలో 2019 భారత సార్వత్రిక ఎన్నికలు" అనే మాదిరిగా అకృతిని మార్చితే మెరుగ్గా ఉంటుందని, అన్నీ అలానే మార్చటం లేదా సృష్టించటం చేయాలనే అభిప్రాయం వెళ్ళబుచ్చటం జరిగింది.శాసనసభల ఎన్నికలు పేజీలు ఉదా: "2023 త్రిపుర శాసనసభ ఎన్నికలు" అని సృష్టిస్తున్నాం. దానిలో శాసనసభ ఎన్నికలు విషయం ప్రస్తావనకు రాలేదు.వీటిని కూడా అలానే మార్చటం లేదా సృష్టిస్తే మెరుగ్గా ఉంటుందా అనే దానిపై అభిప్రాయాలు తెలపగలందులకు కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 11:10, 24 ఫిబ్రవరి 2024 (UTC)Reply

ధన్యవాదాలు @యర్రా రామారావు గారు. వ్యాస పేరుబరిలో ఎన్నికల సంవత్సరంతో కాకుండా రాష్ట్రం పేరుతో ప్రారంభమయితే బాగుంటుందని నా అభిప్రాయం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:04, 28 ఫిబ్రవరి 2024 (UTC)Reply

ఫిబ్రవరి నెల టార్గెట్ 100% కు చేరుకున్నాం మార్చు

ఫిబ్రవరి నెల టార్గెట్ 200 వ్యాసాలు.ప్రస్తుత రాజ్యసభ సభ్యుల జాబితా వ్యాసంతో 100% కు చేరుకున్నాం.ఇంకా ఈ నెలలో 5 రోజులు ఉన్నవి.ఇంకా ఈ నెలలో 30 నుండి 40 వ్యాసాలలోపు సృష్టించగలమని భావిస్తున్నాను.ప్రాజెక్టులో పాల్గొంటున్నవారందరికీ ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 16:19, 24 ఫిబ్రవరి 2024 (UTC)Reply

ధన్యవాదాలు @యర్రా రామారావు గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:05, 28 ఫిబ్రవరి 2024 (UTC)Reply

వర్గాల సృష్టింపుకు ఏకరూపత మార్చు

ఈ ప్రాజెక్టులో చురుకుగా పనిచేసే @ప్రణయ్‌రాజ్ వంగరి @చదువరి @బత్తిని వినయ్ కుమార్ గౌడ్ @రాజశేఖర్ @మమత @ఉదయ్ కిరణ్ @భవ్య @దివ్య @ప్రవల్లిక @వెంకటరమణ గార్లకు ఈ ప్రాజెక్టులో సృష్టించే వ్యాసాలకు వర్గాలు చేర్చేటప్పుడు ముందుగా అంతకు ముందు, ఆ వర్గం ఏమైనా అప్పటికే ఉన్నదేమో ఒకసారి పరిశీలించగలరు. ఎందుకంటే ఒక్కోసారి కొన్ని వర్గాలు కొద్దిపాటి అక్షర భేధాలతో ఉండవచ్చు. ఒకే విషయానికి చెందిన వర్గాలు వివిధ రకాలుగా ఉండకుండా, ఏకరూపత లక్షణం ఉంటే వికీ నాణ్యత మెరుగ్గా ఉంటుంది. ఒకవేళ మీరు చేర్చిన వర్గం సరియైన వర్గంగా లేదని భావిస్తే దానిని సృష్టించకుండా ఎర్రలింకుతో వదిలేయండి. దానిపై పరిజ్ఞానం ఉన్న ఇతర వాడుకరులు పరిశీలించి సృష్టించగలరు. ఇదే పద్దతి వ్యాసాల సృష్టింపులో కూడా పాటించగలరు. ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 07:52, 28 ఫిబ్రవరి 2024 (UTC)Reply

అలాగేనండీ @యర్రా రామారావు గారు. ఎవరైన కొత్త వర్గం సృష్టించినట్లయితే, ఆ వర్గానికి ఆంగ్ల వికీలోని వర్గానికి లింకు ఇవ్వాలి. దాంతో ఆంగ్ల వ్యాసం అనువాదం చేసినపుడు, ఆటోమేటిక్ గా తెలుగు వికీ వ్యాసానికి కూడా ఆ వర్గం చేర్చబడుతుంది. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:08, 28 ఫిబ్రవరి 2024 (UTC)Reply
@ప్రణయ్ రాజ్ గారూ మీ సూచనలకు ధన్యవాదాలు. నేను అవి పరిశీలించి వికీ డేటా లింకులు కలుపుతున్నాను. ఇవే కాదు అంతకముందు ఈ వ్యాసాలకు సంబంధించిన వర్గాలు వికీడేటాకు కలపకపోతే వాటిపై శ్రధ్దపెట్టి పరిశీలిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 11:21, 28 ఫిబ్రవరి 2024 (UTC)Reply
@యర్రా రామారావు గారు, @యర్రా రామారావు గారు, అలాగేనండి, __ చదువరి (చర్చరచనలు) 11:51, 28 ఫిబ్రవరి 2024 (UTC)Reply

ఫిబ్రవరి టార్గెట్ - వాడుకరి వారిగా గణాంకాలు మార్చు

ఫిబ్రవరి నెలకు టార్గెట్ 200 వ్యాసాలు. కానీ అనూహ్యంగా 150% తో 300 వ్యాసాలకు చేరుకున్నాం.అందరికి ఈ సందర్బంగా ధన్యవాదాలు.ఇకపోతే ఫిబ్రవరి నెలలో సృష్టించిన వ్యాసాలు వాడుకరి వారిగా చూస్తే క్వారీ ద్వారా సేకరించిన గణాంకాలు ఈ విధంగా ఉన్నవి.

వాడుకరి వారిగా గణాంకాలు
వాడుకరి పేరు వ్యాసాల సంఖ్య మొత్తం బైట్లు
బత్తిన వినయ్ కుమార్ గౌడ్ 132 40,78,642
ప్రణయ్ రాజ్ 70 7,51,684
చదువరి 59 16,42,635
యర్రా రామారావు 27 9,51,879
ఉదయ్ కిరణ్ 10 1,32,878
ప్రవల్లిక 2 8,217

ఇంకా అవసరమైన సూక్ష్మ గణాంకాలు చదువరి గారు సేకరించి నోటు చేయగలందులకు కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 03:45, 1 మార్చి 2024 (UTC)Reply

మార్చి నెల టార్గెట్ - వాడుకరి వారిగా గణాంకాలు మార్చు

మార్చి నెలకు సృష్టించవలసిన వ్యాసాల టార్గెట్ 500 దాటేశాం.ఈ సందర్బంగా ప్రాజెక్టులో పనిచేస్తున్న వారందరికీ ధన్యవాదాలు. అదే స్పూర్తితో ఏప్రిల్ నెల టార్గెట్ 600 వ్యాసాలు టార్గెట్ పూర్తి చేయగలరని ఆశిస్తున్నాను.ధన్యవాదాలు. వాడుకరిగా వారిగా ఈ రోజువరకు (2024 ఏప్రిల్ 5) గణాంకాలు

వాడుకరిపేరు పేజీల_సంఖ్య మొత్తం_బైట్లు
Batthini Vinay Kumar Goud 533 13648926.0
Pranayraj1985 175 2402998.0
Chaduvari 84 2945124.0
యర్రా రామారావు 57 2023820.0
ఉదయ్ కిరణ్ 21 280593.0
Muralikrishna m 4 52467.0
Pravallika16 4 47765.0
Divya4232 2 49826.0
అందరికి మరొకసారి ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 04:00, 5 ఏప్రిల్ 2024 (UTC)Reply

OSM పటములు మార్చు

మీ అందరి కృషిని అభినందిస్తున్నాను. ఉత్తరాంధ్ర లో కొన్ని నియోజకవర్గాల పేజీలలో OSM పటములను చేర్చాను. ఉదా: https://w.wiki/9sdM మీ అభిప్రాయం తెలుస్కోని మిగతా నియోజకవర్గాల పేజీలలో కూడా చేర్చుతాను. infobox:databox ను ఆధునీకరించాల్సి ఉంది. Saiphani02 (చర్చ) 12:44, 25 ఏప్రిల్ 2024 (UTC)Reply

@సాయిఫణి గారూ తెలుగు వికీపీడియాలో ప్రవేశించి, నియోజకవర్గాలలో OSM పటాలు చేర్చుచున్నందుకు ధన్యవాదాలు.మీకు అవకాశం ఉంటే OSM పటాలు ప్రకారం ఆ నియోజకవర్గంలోని మండలాలు సరిగా ఉన్నాయో, లేదో పరిశీలించి అవసరమైన సవరణలు చేపట్టగలరు. తెలుగు వికీపీడియాలో మీ సవరణలు ధైర్యంగా కొనసాగించగలరు.మీ సందేహాలు ఏమైనా ఉంటే నా చర్చాపేజీ ద్వారా సంప్రదించగలరు. యర్రా రామారావు (చర్చ) 13:54, 25 ఏప్రిల్ 2024 (UTC)Reply
Return to the project page "వికీప్రాజెక్టు/ఎన్నికలు/ఎన్నికల సంబంధిత వ్యాసాల సృష్టింపు-2024".