వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్/2017 pages with more than 3 users with 3 or more edits

సమిష్టి కృషి పద్ధతులు పెరగాలంటే?

మార్చు

అర్జున గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఒక వికీపీడియా పేజీలో ఎక్కువమంది పనిచేసే కొద్దీ వ్యాసం నాణ్యత పెరుగుతూ వస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి, మన వికీపీడియా అనుభవమూ అదే చెప్తోంది. ఒక్కో వ్యాసంలో ఒకరిద్దరే కృషిచేయడం అన్నది సమస్యాత్మకం. వ్యక్తిగతంగా నేను ఇతరులు సృష్టించి, అభివృద్ధి చేస్తున్న వ్యాసాల్లో భారీ ఎత్తున సమాచారం చేర్పు, మూలాల చేర్పు, ఫోటోల చేర్పు వంటి పనులు ప్రారంభిస్తాను. సాముదాయికంగా దీన్ని చేపట్టడానికి ఏం చేయాలో ఒకసారి అందరం ఆలోచిస్తే బావుంటుంది. --పవన్ సంతోష్ (చర్చ) 09:34, 17 ఏప్రిల్ 2018 (UTC)Reply

మీరు (పవన్ సంతోష్ ), ఇతర క్రియాశీలక సభ్యులు 10 సంవత్సరాలు అటూఇటూగా తెవికీని గమనిస్తూనే వున్నారు కదా. మనం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడానికి, మనలో క్రియాశీలక వికీపిడియనుల స్థాయి(10..20 ప్రాంతాల్లో) పెరగకపోవడమే. వీరిలో కూడా తెలుగు వికీపై మంచి అవగాహన వున్నవారుకూడా తక్కువ. నేను 2017 వాడుకరుల, వీక్షణల గణాంకాలు వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్/2017_viewing_devices చేర్చాను. వాటినికూడా పరిశీలించి, మీరు చేపట్టిన సర్వేల విశ్లేషణలతో ప్రతిపాదనలేమైనా చేయండి.--అర్జున (చర్చ) 02:09, 18 ఏప్రిల్ 2018 (UTC)Reply
Return to the project page "వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్/2017 pages with more than 3 users with 3 or more edits".