వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/నిర్వహణ సూత్రాలు

అభివృద్ధికి ఆహ్వానం మార్చు

వికీప్రాజెక్టులు నిర్వహణలో అనుభవమున్నవారు, పాల్లొన్నవారు తమ అనుభవాలతో ఈ వ్యాసాన్ని వృద్ధిచేయండి. అర్జున (చర్చ) 07:21, 11 జనవరి 2022 (UTC)Reply

వ్యాసాల నాణ్యత గురించి మార్చు

'రోజుకో వ్యాసం రాయడం లాంటి కేవలం గణాంక లక్ష్యంతో వ్యాసాలు రాయడం, వాటిని ప్రోత్సహించడం వలన వికీపీడియా నాణ్యత మెరుగవదంటూ' వికీ వ్యాసాల నాణ్యత గురించి మాట్లాడిన అర్జునగారు, 2010 ఆగస్టు 29న కేవలం 2,680 బైట్లతో మూలాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం వ్యాసం రాసింది మర్చిపోయినట్టున్నారు. ఆ వ్యాస నాణ్యతను గాలికొదిలేసిన అర్జునగారు 2019, సెప్టెంబరు 19న నేను మూలాలు చేర్చేంతవరకు కూడా ఆ వ్యాసానికి మూలాలు చేర్చలేదు. కానీ, ఇక్కడ కనీస 5వేల బైట్లు, రెండు కంటే ఎక్కువ మూలాలు, ఒక ఫోటో, తగిన వర్గాలతో రోజుకో వ్యాసం (రోజుకు 5 వ్యాసాలు కూడా) రాస్తూ వాటిని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తున్న విషయం గమనించాలని @వాడుకరి:Arjunaraoc గారికి సూచిస్తున్నాను. అంతేకాకుండా 'నలుగురు కలిసి కృషి చేస్తేనే మెరుగవుతుందని' కూడా అన్నారు, అది వికీ సూత్రం కూడా. కాబట్టి, మేం రాస్తున్న వ్యాసాలలో మార్పులు చేయడానికి అర్జున గారిని ఆహ్వానిస్తున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 09:35, 11 జనవరి 2022 (UTC)Reply

నా దృష్టిలో రోజుకో వ్యాసం రాయడం వికీపీడియా పట్ల ఒక వ్యక్తి నిబద్ధతను సూచిస్తుంది. ఎలాంటి ఆటంకాలు ఎదురైనా వికీలో ఈ రోజు కనీసం ఒక వ్యాసాన్నయినా చేర్చాలి అనే లక్ష్యంతో పనిచేసే వారి ఉత్సాహాన్ని నీరుగార్చడం మంచిది కాదు. వికీ పట్ల, విజ్ఞానం పట్ల, భాష పట్ల అభిమానం ఉన్న వారే కదా అలా చేస్తారు. ఒకవేళ గణాంకాల కోసం చేసినా వికీకి మేలే కదా జరుగుతుంది. వికీలో చిన్న వ్యాసాలు సృష్టించడం వల్ల సమస్య ఏమిటి? ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కటి విశేష వ్యాసం, మంచి వ్యాసం రాయలేదు కదా. అలాగే ప్రతి ఒక్కరికీ ఒకేలాంటి భాషా నైపుణ్యం, విషయ పరిజ్ఞానం ఉండవు కదా. కాబట్టి దాన్ని నేను పాటించలేకపోయినా నిస్సందేహంగా ప్రోత్సహిస్తాను. కానీ అదే సమయంలో నాకు వీలైనంతవరకు నాణ్యతా సమస్యలుంటే పరిష్కరిస్తాను. విస్తరిస్తాను.- రవిచంద్ర (చర్చ) 09:52, 11 జనవరి 2022 (UTC)Reply
@Pranayraj1985, రవిచంద్ర గార్లకు, మీ స్పందనలకు ధన్యవాదాలు. నేను ఈ చర్చను వ్యక్తిగతం చేయదలచలేదు. ఈ వ్యాఖ్య గత మూడు సంవత్సరాల నా నిర్వహణ కృషి ఆధారంగా చేసినది.
తెలుగు వికీపీడియా తొలినాళ్లలో రాసిపైనే ధ్యాస వుండేది. ఆ విధంగా ఎన్నో వేల గ్రామాల వ్యాస మొలకలు, ఇతర మొలకలు సృష్టించబడి, సంవత్సరాల తరబడి అలానేవుండి, గత ఐదు సంవత్సరాల కృషిలో భాగంగా మొలక స్థాయిని దాటటం చూశాం. గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు కూడా రాసిపైన ధ్యాసపెట్టటం, అది కూడా సరికాదని కొన్ని సంవత్సరాల తరువాత నాణ్యతలేదని చాలా తొలగించబడడం చూశాం. రెండేళ్ల క్రిందట ఐఐఐటి మరల యాంత్రిక అనువాదాల ద్వారా వ్యాసాల సంఖ్యను పెంచాలనే ప్రధాన లక్ష్యంతో ముందుకు వచ్చినపుడు కూడా తెవికీ సముదాయాన్ని మీలో ఒకరు(రవిచంద్ర) అప్రమత్తం చేయటం మీకు తెలిసినవే. 'రోజుకోవ్యాసం' కూడా ఇటువంటి తరహాకే చెందినదని నా అభిప్రాయం. బాట్ పనులు, ఇతర సంస్థల పనులు వికీపై కలిగించే ప్రతికూల ప్రభావానికి తక్కువకాలం పడితే, ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువకాలానికి అటువంటి ప్రతికూల ప్రభావమే కలుగచేస్తాయి.
వ్యాస నాణ్యతని నిర్ణయించడానికి వ్యాస పరిమాణం, మూలాల సంఖ్య, ఫొటో, వర్గాలలో చేర్చడంగా ప్రణయ గారు పేర్కొన్నారు. వికీలో మంచి వ్యాసాలు వ్రాసే అనుభవం లేనప్పుడు, అటువంటి వ్యాసాలపై ఇతర అనుభవమున్నవారి పర్యవేక్షణ లేనపుడు (సముదాయం, నిర్వహణ బలహీనంగా వున్నప్పుడు), ఇటువంటి లక్ష్యాలు రాసినిపెంచుతాయి కాని వికీనాణ్యతను దెబ్బతీస్తాయి.
దానికి ఉదాహరణగా రెండు అంశాలను పేర్కొంటాను.
బొమ్మ చేర్చాలన్న నియమం వుంది కాబట్టి, బొమ్మల నకలుహక్కుల గురించి అనుభవం లేనప్పుడు, గూగుల్ లో దొరికిన బొమ్మలు ప్రవేశపెట్టుతారు. వాటిని చేర్చటానికి సరియైన పద్ధతులు వాడకపోతే, బొమ్మల సమస్యలు పేరుకుపోతాయి. వాటిని సవరించడానికి ఎక్కువ కాలం పడితే అది పెద్ద సమస్యగా మారుతుంది. ఇటీవల మూడు నెలలుగా నేను బొమ్మల నిర్వహణలో చేస్తున్న పని అటువంటి సమస్యని పరిష్కరించటమే.
రెండవ ఉదాహరణ మూలం చేర్చాలన్న నియమం. నా అనుభవంలో వ్యాసంలో పేర్కొన్న అంశానికి, ఒకటి రెండు వాక్యాలున్న మూలాలను వాడడం చూశాను. అటువంటి మూలాలను రెండు మూడు చేర్చడం కూడా చూశాను. అటువంటి మూలాలవలన ఉపయోగం తక్కువకాగా, వికీనాణ్యతపై ప్రతికూల ప్రభావం కలుగుతుంది.
ఇంకా చిన్న వ్యాసాలలో పునురుక్తులు(విషయం మరల మరల రావటం), ప్రాముఖ్యతకు సంబంధించిన అంశాలు కాకపోవడం కూడా వున్నాయి. కావున మీరు ఇటువంటి వాటిని ప్రోత్సాహించాలనుకుంటే, తొలిగా అలా చేద్దామనుకున్న సభ్యులకు వ్యాస నాణ్యతపై శిక్షణ ఇవ్వాలి, ఆ తరువాత వారు రాసే 25 వ్యాసాలు కనీసం కొలబద్దపై "C" స్థాయి చేరేవరకు పర్యవేక్షించాలి. ఆ తరువాత కనీసం అటువంటి స్థాయిలో వ్రాసేవారిని వారు కేటాయించగల సమయాన్ని బట్టి ఒక గడువు ఏర్పరచుకొని (అది ఒకరోజు కానవసరంలేదు) ఆ గడువులో వ్యాసం చేసే పద్ధతిలో చేయమంటే బాగుంటుంది.
ఇటువంటి కార్యక్రమాలు ఆంగ్లవికీలాంటివాటిలో ఎందుకు జరగవో కూడా ఆలోచించండి. తెవికీలో సముదాయం బలహీనంగా వుండడం, నిర్వహణ బలహీనంగా వుండడంతో సమస్యలను తెచ్చిపెట్టి నాణ్యతను దెబ్బతీసే కార్యక్రమాలను ప్రోత్సహించేబదులు ఇటువంటి సమస్యలను తగ్గించుకుంటే మంచిది కదా. అంతేకాకుండా, ఒకరు ఎన్నో ఎళ్లుగా వికీలో పనిచేస్తుంటే వారు మరింత విలువైన కృషి చేయటానికి ప్రోత్సహించాలి. తొలినాళ్లలో లాగానే ఆరంభ(Start) స్థాయి వ్యాసాలకు పరిమితమయితే అది వికీకి ఏమంత ప్రయోజనం? అర్జున (చర్చ) 07:24, 13 జనవరి 2022 (UTC)Reply
అర్జున గారూ, ముందుగా మీకు ఒక విషయం చెప్పదలచాను. నేనుచేసిందే కృషి, ఇతరులు చేసింది కృషి కాదు అన్న ధోరణిని మీరు విడిచిపెడితే బాగుంటుందని నా అభిప్రాయం. మొలక వ్యాసాలు, గూగుల్ అనువాద వ్యాసాలు, ఐఐఐటి యాంత్రిక అనువాదాలు చేసిన వ్యాసాల మాదిరిగా... 'రోజుకోవ్యాసం కూడా ఇటువంటి తరహాకే చెందినదని నా అభిప్రాయం' అన్న మాటను మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఎందుకంటే రోజుకోవ్యాసం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రశంసలు పొందుతుందో నేను కొత్తగా చెప్పక్కర్లేదు. అంతేకాకుండా మీలా నేను చర్చల కోసం ఎక్కువ సమయం కేటాయించలేను. ఎందుకంటే నేను వికీలో, బయట చేయవలసిన పనులు చాలానే ఉన్నాయి. కాబట్టి, ఒకడ్రెండు విషయూలు చెప్పదలచాను. 'వికీలో మంచి వ్యాసాలు వ్రాసే అనుభవం లేనప్పుడు, అటువంటి వ్యాసాలపై ఇతర అనుభవమున్నవారి పర్యవేక్షణ లేనపుడు (సముదాయం, నిర్వహణ బలహీనంగా వున్నప్పుడు), ఇటువంటి లక్ష్యాలు రాసినిపెంచుతాయి కాని వికీనాణ్యతను దెబ్బతీస్తాయి' అని అన్నారు. మరి, మంచి వ్యాసాలు వ్రాసే అనుభవం అంటే ఏమిటి, అది ఎంతకాలానికి వస్తుంది, ఆ అనుభవాన్ని ఎలా సాధించాలి, దాన్ని ఎక్కడ నేర్చుకోవాలో చెప్పండి. వికీలో చెప్పడం కంటే చేయడమే ఉత్తమమని ఇది వరకే మీకు చెప్పాను. కనుక, పైన చెప్పినవి (నాణ్యత వ్యాసాల రచన, "C" స్థాయి చేరేవరకు పర్యవేక్షణ) మీరు చేసి చూపించి మాకు మార్గదర్శకులుగా నిలవండని కోరుతున్నాను. బొమ్మల నకలుహక్కుల గురించి అనుభవం లేదు కనుకనే బొమ్మల ఎక్కింపు గురించి ఒక శిక్షణా కార్యక్రమం ఏర్పాటుచేయండని మిమ్మల్ని కోరాం, కాని మీరు శిక్షణకు అంగీకరించలేదు. ఇప్పుడు కొత్తగా, మీరు ప్రస్తావిస్తున్న న్యాణత వ్యాసాలు రాయడమెలాగా అనే అంశంమీద కూడా ఒక శిక్షణా కార్యక్రమం కూడా పెట్టమని కోరుతున్నాను. 'ఒకరు ఎన్నో ఎళ్లుగా వికీలో పనిచేస్తుంటే వారు మరింత విలువైన కృషి చేయటానికి ప్రోత్సహించాలి' అన్నమాట మీకు వర్తించదు అర్జున గారు, ఎందుకంటే నేను వికీలోకి వచ్చన ఇన్ని ఏళ్ళలో ఏ ఒక్కరిని కూడా మీరు ప్రోత్సహించింది నేను చూడలేదు, పైగా చేస్తున్న కృషి ఆపేసేలా నిరుత్సాహపరుస్తారు. కాబట్టి, ప్రోత్సాహం అనేపదం మీరు వాడకుండా ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక చివరగా.... తొలినాళ్లలో లాగానే ఆరంభ(Start) స్థాయి వ్యాసాలకు పరిమితమయితే అది వికీకి ఏమంత ప్రయోజనం? అని మాట్లాడుతున్న మీరు, ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం వ్యాసం గురించి అడిగిన విషయానికి సమాధానం మాత్రం చెప్పడంలేదు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 17:42, 13 జనవరి 2022 (UTC)Reply

ఈ ప్రాజక్టుపై యర్రా రామారావు అభిప్రాయాలు, సందేహాలు మార్చు

1.తెలుగు వికీ ప్రారంభం నుండి వికీప్రాజెక్టుల నిర్వహణ జరుగుతూనే వున్నాయి. అయితే చాలావరకు వీటిలో ఒక అంశం మీద ఎవరికి వారు కొన్ని వ్యాసాలు సృష్టించడం, కొన్ని బొమ్మలు చేర్చడం లాంటి పనులే గాని, ప్రాజెక్టు లక్ష్యాలలో నాణ్యతను నిర్దేశించడం, ప్రాజెక్టు తరువాత సమీక్షించడం, ఒక వ్యాసంలో జరిగిన కృషిని ఇతరులు పరిశీలించి మెరుగుపరచడం జరిగినవి చాలా తక్కువ.

ప్రాజెక్టుల ద్వారా వ్యాసాలు సృష్టించడం, కొన్ని బొమ్మలు చేర్చడం లాంటి పనులు ఉన్న తరువాతనే గదా నాణ్యతను గురించి అలోచించేది.అవి లేకపోతే ఇక నాణ్యత గురించి ఆలోచించాల్సిన సమస్య ఏముంది.

2.వికీపీడియా నాణ్యత మెరుగవ్వాలంటే పాటించాల్సిన సూత్రాలు అప్పుడప్పుడు కొందరు సభ్యులు సూచిస్తున్నా, వాటిని పాటించిన దాఖలాలు చాలా తక్కువ.

ఇది వాస్తవం.అంతేగాదు మనం అంటే సముదాయం రాసుకున్న మార్గదర్శకాలు, సూచనలు వగైరా వాటిని చురుకైనవాడుకరులు పాటించలేదనేది వాస్తవం.

3.అటువంటి సూచనలపై మరింత ధ్యాసను కల్గించడమే ఈ వ్యాసం ఉద్దేశం.

ఈ వ్యాసం ఏవిధంగా మరింత ధ్యాసను కల్గించిందో వివరించాలి.

4.ప్రాజెక్టు లక్ష్యంలో నాణ్యత నిర్వచించాలి. రోజుకో వ్యాసం రాయడం, వ్యాసం పరిమాణం, ఉండవలసిన లింకులు లాంటి కేవలం గణాంక లక్ష్యంతో వ్యాసాలు రాయడం, వాటిని ప్రోత్సహించడం వలన వికీపీడియా నాణ్యత మెరుగవదు. ఎందుకంటే వికీలో మంచి వ్యాసాలు వ్రాసిన అనుభవం లేనివారి ధ్యాస వ్యాసం రాశామనే కాని దాని నాణ్యత పై వుండదు. ఒక మంచి వ్యాసం రూపొందాలంటే కొంతకాలంపాటు చాలా పరిశోధన చేయవలసి వస్తుంది. నలుగురు కలిసి కృషి చేస్తేనే మెరుగవుతుంది.

ఇక్కడ రోజుకో వ్యాసం రాయడం అనే పదం ఉపయోగంచటం అలారాసేవారిని ఎత్తిచూపినట్లుగా భావించాల్సివస్తుంది. అసలు నాణ్యత అంటే ఏమిటో అది ఏవిధంగా ఉంటుందో, లేదా ఎలా ఉండాలో, ఈ ప్రాజెక్టులోనే అయిటంల వారిగా కొన్ని ఉదాహరణలతో వివరించితే బాగుంటుంది.

5.వనరులు విభాగంలో సాధారణ ప్రాజెక్టులకు పాల్గొనేవారికి కంప్యూటర్, ఇంటర్నెట్ సౌకర్యముంటే చాలు అని వివరించారు.

ఇది వనరులు కింద ఎలా వస్తుందో నాకర్థం అగుటలేదు.వనరులు అంటే అర్థం, ఎక్కడైనా వాటికి మనం అవకాశం కల్పిస్తే వాటిని వనరులు అంటాం. స్వంతంగా వారికి ఉండేవాటిని వనరులు అని ఎలా అనగలం.లేక సముదాయం అలాంటివి ఏమైనా ఇప్పించగలిగిందని అర్థం చేసుకోవాలా

6.కాబట్టి ప్రాజెక్టు విషయం ఎక్కువమందికి ఆసక్తి కలిగించేదిగా వుంటే మంచిది.

ఆసక్తి కలిగించేది అంటే ఇక్కడ దాని అర్థం ఏమిటో అర్థం అగుటలేదు.ప్రతి ప్రాజెక్టులో ప్రతి చురుకైన వాడుకరి పాల్గొనాలనే దృక్పదం వారికి లేకపోతే ఎన్ని ప్రాజెక్టులు పెట్టినా అవి అంతంత మాత్రమే విజయవంతమవుతాయి. దీనికి పరిష్కారం ఎవరి చేతులలో లేదు.

ఇవి నా అభిప్రాయాలు, సందేహాలు.--యర్రా రామారావు (చర్చ) 01:20, 24 జనవరి 2022 (UTC)Reply

@యర్రా రామారావుగారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ఒక్కొక్క అభిప్రాయాన్ని లేక సందేహాన్ని ప్రత్యేక విభాగంలో వ్రాసి సంతకం చేస్తే చర్చలు మరింత అర్ధవంతంగా చేయటానికి వీలవుతుంది. ఇకముందు అలా చేయమని కోరుతున్నాను. ప్రస్తుతానికి మీ వ్యాఖ్యలకు స్పందనలు వరుససంఖ్య ప్రకారం వ్రాస్తున్నాను.
1. నేను ఉదహరించిన కొంతవరకు మెరుగైన ప్రాజెక్టు చూసినట్లైతే, ప్రాజెక్టు ప్రారంభంలో నాణ్యత ప్రస్తావించకపోయినా, ప్రాజెక్టు ముగింపుకు ముందు నాణ్యత అంచనా వేయటం, సంబంధిత గణాంకాలు పొందుపరచడం మీరు గమనించవచ్చు. దానికంటే మెరుగైనది నా ఆలోచనలో నాణ్యత ప్రస్తావించడం ఆరంభ వ్యాసమా లేక బి తరగతి వ్యాసమా అని.
2. మీరు అంగీకరించినందులకు ధన్యవాదాలు.
3. నేను మంచి పద్ధతులు అనిపించినవి వ్రాశాను. మీరు, ఇతరులు స్పందించడం, వ్యాసాన్ని వృద్ధి చేయటం మరింత ధ్యాసను కల్గించటమే అని నా అభిప్రాయం.
4. నాణ్యతకొలబద్ద గురించిన లింకు, కొంతవరకు మెరుగుగా చేసిన ప్రాజెక్టులు ఉదాహరణలలో ఇచ్చాను. ఇకముందు ప్రాజెక్టులు నిర్వహించేవారు, పాల్గొనేవారు వాటిపై ధ్యాసపెడితే ప్రాజెక్టు నాణ్యత మెరుగవుతుంది.
5. పని జరగటానికి కావల్సినవన్నీ వనరులే.
6. ప్రతిప్రాజెక్టులో ప్రతి చురుకైన వాడుకరి పాల్గొనాలనుకోవటం నావరకు ఆచరణీయం కాదు ఎందుకంటే సామాన్యంగా ఒక్కరికి కొన్ని అంశాలపైనే ఆసక్తి వుంటుంది. ఆసక్తి వున్న అంశాలకు సంబంధించిన వ్యాసాలపై కృషి చేస్తేనే వాటిని నాణ్యంగా చేయగలుగుతారు. ఉదాహరణకు సాహిత్య అంశంపై నాకు సాధారణ ఆసక్తి మాత్రమే. విద్య, ఉపాధి అంశాలపై నాకు అసక్తి వున్నా అటువంటి ప్రాజెక్టులో ఇతరులు ఎక్కువగా పాల్గొనకపోవటంతో నేను అటువంటి ప్రాజెక్టులు నిర్వహించడం ఆపాను. వికీప్రాజెక్టు నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టులో వివిధ రకాలు వ్యాసాలు వుంటాయి. దానిలో ఎక్కువమంది పాల్గొనడానికి అవకాశం మెరుగు. అయితే సముదాయ బలహీనంగా వుండడం వలనో లేక, చాలామందికి కొత్త వ్యాసం సృష్టించడంపై ఎక్కువ ఆసక్తి వుండటం వలనో ఆ ప్రాజెక్టులోను ఎక్కువమంది పాల్గొనలేదు. అర్జున (చర్చ) 23:48, 25 జనవరి 2022 (UTC)Reply
Return to the project page "వికీప్రాజెక్టు/నిర్వహణ సూత్రాలు".