విజయవాడ పుస్తక మహోత్సవం

విజయవాడ పుస్తక మహోత్సవం గత 30 ఏళ్లుగా విజయవాడ నగరంలో నిర్వహిస్తున్నారు. ఈ పుస్తకమహోత్సవాన్ని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జనవరి 1 నుండి 11 వరకు నిర్వహిస్తారు. ఈ పుస్తక ప్రదర్శనలో భాగంగా సాహిత్య చర్చలు, పుస్తకావిష్కరణలు, రచయితలకు-కవులకు సన్మానాలు చేస్తారు. పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి వేదికకు తెలుగు ప్రముఖుల పేర్లు పెట్టటం ఆనవాయితీ.

విజయవాడ పుస్తక మహోత్సవ సభ

చరిత్ర మార్చు

1980ల్లో రాజమండ్రిలో ఒక దశాబ్దంపాటు పుస్తకమహోత్సవాన్ని అక్కడి నిర్వాహకులు నిర్వహించారు. ఆ పుస్తక ప్రదర్శనలో భాగంగా విజయవాడలోని ప్రముఖ ప్రచురణకర్తలు పుస్తక దుకాణాల యజమానులు పాల్గొనేవారు. రాజమండ్రి పుస్తక ప్రదర్శన నిలిపివేయడంతో నేషనల్ బుక్ ట్రస్ట్ సహాయంతో 1989 అక్టోబరు 29 నుంచి నవంబరు 8 వరకు విజయవాడలో మొదటి పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఇది విజయవంతం అయింది. ఆ స్ఫూర్తితో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి ఆ సంస్థ ఆధ్వర్యంలో ప్రతిఏటా పుస్తక మహోత్సవాన్ని నిర్వహించడం మొదలుపెట్టారు. [1]


కార్యక్రమ సరళి మార్చు

 
పుస్తకప్రియుల పాదయాత్ర లో వికాస విద్యావనం విద్యార్థులు

దాదాపుగా అన్ని సంవత్సరాలు పుస్తక ప్రదర్శనను విజయవాడ నగరం మధ్యలో ఉన్న స్వరాజ్ మైదాన్ (పిడబ్ల్యుడి గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు నిర్వహిస్తారు. నాలుగవ రోజున పుస్తక ప్రియుల పాదయాత్ర (వాక్ ఫర్ బుక్స్) ను నిర్వహిస్తారు. ఈ వాక్ ఫర్ బుక్స్ కార్యక్రమానికి విజయవాడ లోని వివిధ పాఠశాలల విద్యార్థులు విచ్చేసి ప్రెస్ క్లబ్ నుండి పుస్తక మహోత్సవ ప్రాంగణం వరకూ ప్రజల్లో పుస్తక పఠన చైతన్యాన్ని పెంచే నినాదాలు చేస్తూ నడుస్తారు. వాక్ ఫర్ బుక్స్ కార్యక్రమానికి నగర ప్రముఖులు రాజకీయ ప్రముఖులు విచ్చేసి ప్రారంభిస్తారు. ప్రతిరోజు సాయంత్రం ఏదో ఒక తెలుగు సాహిత్య అంశాన్ని తీసుకొని ఆ అంశంపై ప్రముఖ రచయితలు మాట్లాడతారు. ఈ ఏడాది ఎవరైనా రచయితకు రచయిత్రికి ఏదైనా పురస్కారం మంది ఉంటే వారిని పుస్తక ప్రదర్శనలో వేదికపై సన్మానిస్తారు.

పాల్గొన్న ప్రముఖులు మార్చు

మొట్టమొదటి పుస్తక ప్రదర్శనను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రారంభించారు.

వివాదాలు మార్చు

ఇటీవల ఎన్టీఆర్ ట్రస్ట్ తో భాగస్వామ్యం కావడం వివాదాలకు దారితీసింది. హిమకర్ పబ్లికేషన్స్ కమలాకర్ ఈ పుస్తక ప్రదర్శనను అక్రమాలకు నెలవుగా చెప్పారు[ఆధారం చూపాలి].

మూలాలు మార్చు

  1. వెలగా వెంకటప్పయ్య (2012). తెలుగు ముద్రణ ప్రచురణ:వికాసం. p. 201.