విల్లా (పిజ్జా 2) 2013లో విడుదలైన తెలుగు సినిమా.[1] గుడ్‌ సినిమా గ్రూప్‌, స్టూడియో సౌత్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్ పై గుడ్‌ ఫ్రెండ్స్‌ నిర్మించిన ఈ సినిమాకు దీపన్‌ చక్రవర్తి దర్శకత్వం వహించాడు. అశోక్‌ సెల్వన్‌, సంచితా షెట్టి, నాజర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంలో 14న, తెలుగులో నవంబరు 16, 2013న విడుదలైంది.[2]

విల్లా (పిజ్జా 2)
దర్శకత్వందీపన్‌ చక్రవర్తి
రచనదీపన్‌ చక్రవర్తి
శశాంక్‌ వెన్నెలకంటి (మాటలు)
నిర్మాతసి.వీ. కుమార్
తారాగణం
ఛాయాగ్రహణందీపక్‌ కుమార్‌ పాధి
కూర్పులియో జాన్ పాల్
సంగీతంసంతోష్ నారాయణన్
నిర్మాణ
సంస్థలు
  • స్టూడియో సౌత్‌ ప్రొడక్షన్స్‌
  • గుడ్‌ సినిమా గ్రూప్‌
విడుదల తేదీs
2013 నవంబరు 14 (2013-11-14) (తమిళ్)
2013 నవంబరు 16 (2013-11-16) (తెలుగు)
సినిమా నిడివి
102 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

జబిన్‌ (అశోక్ సెల్వన్) ఓ నవలా రచయిత, వృత్తిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నసమయంలో అతని తండ్రి (నాజర్‌) చనిపోతాడు. తన తండ్రి చనిపోయిన తర్వాత తమకో పెద్ద విల్లా ఉందనే విషయం తెలుస్తుంది, దానిని అమ్మి జీవితంలో సెటిల్‌ అవుదామని అనుకుంటాడు. ఆ విల్లాకు వాళ్ళ ఎంతోమంది చనిపోయారని, తనకీ ప్రాణ హాని ఉందని తెలుసుకున్న జబిన్‌ దాని గురించి రీసెర్చ్‌ మొదలు పెడతాడు. ఆ విల్లా గురించి అతడి రీసెర్చ్‌లో ఏమి తెలుసుకుంటాడు ? తరువాత ఏమైంది అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్లు: గుడ్‌ సినిమా గ్రూప్‌, స్టూడియో సౌత్‌ ప్రొడక్షన్స్‌
  • నిర్మాత:ఎస్.కె.ఎన్, శ్రీనివాస్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దీపన్‌ చక్రవర్తి
  • సంగీతం: సంతోష్ నారాయణన్
  • సినిమాటోగ్రఫీ: దీపక్‌ కుమార్‌ పాధి
  • ఎడిటర్: లియో జాన్‌ పాల్‌

మూలాలు మార్చు

  1. Sakshi (20 November 2013). "ఐదు రోజుల్లో 3 కోట్లు వసూలుచేసిన 'విల్లా'". Archived from the original on 3 November 2021. Retrieved 3 November 2021.
  2. Sakshi (1 November 2013). "'విల్లా'లో ఏం జరిగింది?". Archived from the original on 3 November 2021. Retrieved 3 November 2021.
  3. The Times of India (2013). "The Villa - Pizza 2 Movie Review {3.0/5}: Critic Review of The Villa - Pizza 2 by Times of India". Archived from the original on 3 November 2021. Retrieved 3 November 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 6 మార్చి 2016 suggested (help)