విస్తరించిన రోహిణి ఉపగ్రహ శ్రేణి

 

విస్తరించిన రోహిణి ఉపగ్రహ శ్రేణి (SROSS), రోహిణి ఉపగ్రహాలకు పొడిగింతగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అభివృద్ధి చేసిన ఉపగ్రహాల శ్రేణి. [1] ఖగోళ భౌతిక శాస్త్రం, భూమి రిమోట్ సెన్సింగ్, ఎగువ వాతావరణ పర్యవేక్షణ ప్రయోగాల కోసం అలాగే కొత్త అప్లికేషన్-ఆధారిత మిషన్ల కోసం వీటిని అభివృద్ధి చేసారు. [2] ఈ ఉపగ్రహాలు ఆగ్మెంటెడ్ ఉపగ్రహ వాహక నౌకల్లో పేలోడ్‌గా పంపించారు. [1]

శ్రేణి లోని ఉపగ్రహాలు మార్చు

SROSS A, SROSS B మార్చు

ప్రయోగ వాహనం వైఫల్యం కారణంగా ఈ శ్రేణి లోని మొదటి రెండు ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశించలేదు. లేజర్ ట్రాకింగ్ కోసం SROSS-A రెండు రెట్రో-రిఫ్లెక్టర్‌లను తీసుకువెళ్లింది. [1] SROSS-B వెస్ట్ జర్మన్ మోనోక్యులర్ ఎలక్ట్రో ఆప్టికల్ స్టీరియో స్కానర్ (MEOSS), ISRO వారి 20-3000keV గామా-రే బర్స్ట్ ప్రయోగాలకు సంబంధించిన రెండు సాధనాలను తీసుకువెళ్లింది; . [1]

SROSS C మార్చు

మూడవది, SROSS 3 (SROSS C అని కూడా పిలుస్తారు), 1992 మే 20 న ఉద్దేశించిన కక్ష్య కంటే తక్కువ కక్ష్యలో ప్రతిక్షేపించారు. 20–3000 కెవి శక్తి పరిధిలో ఉండే ఖగోళ గామా కిరణాలను ఇది పర్యవేక్షిస్తుంది. SROSS C, C2 గామా-రే బర్స్ట్ (GRB) ప్రయోగం, రిటార్డెడ్ పొటెన్షియల్ ఎనలైజర్ (RPA) ప్రయోగాలను నిర్వహించాయి. GRB ప్రయోగం 1992 మే 25 నుండి 1992 జూలై 14 వరకు నిర్వహించింది.

SROSS C2 మార్చు

SROSS-C2 ను 1994 మే 4 న ప్రయోగించారు. SROSS-C2 బోర్డులో గామా రే బర్స్ట్ ప్రయోగాలు SROSS-C ఉపగ్రహంలో విజయవంతంగా ఎగురవేయబడిన GRB పేలోడ్‌కి మెరుగైన రూపం. ఇది మొత్తం 993 ట్రిగ్గర్‌లలో 1995 ఫిబ్రవరి 15 వరకు పన్నెండింటిని కనుక్కుంది. [3] SROSS-C2 అంతరిక్ష నౌక ఇంటర్‌ప్లానెటరీ నెట్‌వర్క్‌లో చేర్చబడిన ఉపగ్రహాలలో ఒకటి. [4] SROSS C2 ఉపగ్రహం GRB ప్రయోగం కోసం RCA CDP1802 మైక్రోప్రాసెసర్‌ను కూడా ఉపయోగించింది.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 "SROSS A, B, C, C2 Quicklook". Archived from the original on 2009-04-11. Retrieved 2009-07-19.
  2. "SROSS". Archived from the original on December 28, 2016.
  3. "Stretched Rohini Satellite Series 3 & C2".
  4. "IPN3 Home Page".[permanent dead link]