వీరకంకణం దండి వేంకట సుబ్బాశాస్త్రి రచించిన చారిత్రాత్మక నవల.

వీరకంకణము
కృతికర్త: విద్వాన్ దండిపల్లి వేంకట సుబ్బాశాస్త్రి
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): నవల
ప్రచురణ: బాలసరస్వతీ బుక్ డిపో, కర్నూలు.
విడుదల: 1949
పేజీలు: 4+116

రచన నేపథ్యం మార్చు

వీరకంకణం నవలని దండిపల్లి వేంకట సుబ్బాశాస్త్రి 1949లో రచించి ప్రచురించారు. వీరకంకణం నవల ఇతివృత్తం సంస్కృత సాహిత్యంలో గొప్ప ఆలంకారికునిగా ప్రఖ్యాతి గాంచిన జగన్నాథ పండితరాయలు జీవితం చుట్టూ అల్లబడింది. ఇది నవల అయినప్పటికీ ఇందులో చాలావరకు చారిత్రకమైన విషయాలున్నాయి. కథ నేపథ్యం శ్రీకృష్ణదేవరాయల పరిపాలన, ఢిల్లీ సుల్తానుల పాలన వంటి వాటి నేపథ్యంలో తయారైంది.

ఇతివృత్తం మార్చు

జగన్నాథుని తాతయైన కేశవభట్టు తన విద్వత్తుతో శ్రీకృష్ణదేవరాయలను మెప్పించి ముంగండ అగ్రహారం బహుమానంగా పొందడం నుంచి కథ ప్రారంభం అవుతుంది. తరువాత ఆయన కొడుకు పేరుభట్టు కాశీకి వెళ్ళి వివిధ శాస్త్రాలు అభ్యసించి వస్తాడు. పేరుభట్టు కొడుకు జగన్నాథుడు. తండ్రి దగ్గరే సకల శాస్త్రాలు అభ్యసిస్తాడు. జగన్నాథ పండితరాయలు 17వ శతాబ్దానికి చెందిన గొప్ప కవి, విమర్శకుడు. తర్కాలంకార శాస్త్రాల్లో పేరెన్నిక గన్నవాడు. ఆంధ్రదేశానికి చెందిన ముంగొండ అగ్రహారానికి (ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది) చెందినవాడైనా ఉత్తర భారతదేశంలో మొగలు రాజుల సంస్థానంలో గొప్ప విద్వాంసునిగా పేరు తెచ్చుకున్నాడు. జగన్నాథుని తాతయైన కేశవభట్టు తన నాట్య ప్రతిభతో విజయనగర ప్రభువైన శ్రీకృష్ణదేవరాయలను మెప్పించి ముంగండ అగ్రహారాన్ని బహుమానంగా పొందాడు. ఈయన తండ్రి పేరు పేరుభట్టు. ఆయన కాశీలో పలు శాస్త్రాలను అభ్యసించి వచ్చాడు. జగన్నాథుడు తన తండ్రి దగ్గరే చాలా శాస్త్రాలు అభ్యసించాడు. రసగంగాధరం, భామినీ విలాసము, గంగాలహరి మొదలైనవి ఆయన సుప్రసిద్ధ రచనలు.

మూలాలు మార్చు