వేటగాడు (1995 సినిమా)

వేటగాడు 1995 అక్టోబరు 21న విడుదలైన తెలుగు సినిమా. చరిత చిత్ర పతాకం కింద తమ్మారెడ్డి భరధ్వాజ తన స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. రాజశేఖర్, సౌందర్య, రంభ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీతాన్నందించాడు.[1] ఇది హిందీ హిట్ చిత్రం బాజీగర్ (1993)కి రీమేక్.[2] బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ అయిన ‘బాజీగర్‌’ చిత్రాన్ని రాజశేఖర్‌తో ‘వేటగాడు’గా రీమేక్‌ చేసిన తమ్మారెడ్డి ఆర్థికంగా భారీగా నష్టపోయి కెరీర్‌ను పాడుచేసుకున్నారు. ఆ ఒక్క సినిమా వల్ల చేసిన అప్పుల నుంచి బయటపడేందుకు దాదాపు 15 ఏళ్ల పాటు కష్టపడాల్సి వచ్చింది.[3]

వేటగాడు
(1995 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం టి.భరద్వాజ్
తారాగణం డా. రాజశేఖర్ ,
సౌందర్య ,
రంభ
సంగీతం విద్యాసాగర్
నిర్మాణ సంస్థ చరిత చిత్ర
భాష తెలుగు

తారాగణం మార్చు

  • రాజశేఖర్
  • రంభ

పాటలు[4] మార్చు

  1. అందాల తేనే కల్లు, సంగీతం: విద్యాసాగర్, సాహిత్యం: భువన చంద్ర, గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం
  2. ఎన్నెనో పాటలు, సంగీతం: విద్యాసాగర్, సాహిత్యం: భువన చంద్ర, గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం , కె.ఎస్ . చిత్ర
  3. అమ్మాయి కనపడగానే, సంగీతం: విద్యాసాగర్, సాహిత్యం: భువన చంద్ర, గానం: మనో , కె.ఎస్. చిత్ర
  4. నిలవడు ప్రాణం, సంగీతం: విద్యాసాగర్, సాహిత్యం: భువన చంద్ర, గానం: మనో , కె.ఎస్. చిత్ర
  5. ఓ జాబిలి, సంగీతం: విద్యాసాగర్, సాహిత్యం: భువన చంద్ర, గానం: మనో , కె.ఎస్. చిత్ర

మూలాలు మార్చు

  1. "Vetagadu (1995)". Indiancine.ma. Retrieved 2023-07-28.
  2. "Telugu Cinema Etc - Idlebrain.com". www.idlebrain.com. Retrieved 2023-07-28.
  3. "That one film with Rajasekhar killed my career!". mirchi9.com (in ఇంగ్లీష్). 2015-12-18. Retrieved 2023-07-28.
  4. "Vetagadu 1995 Telugu Movie Songs, Vetagadu Music Director Lyrics Videos Singers & Lyricists". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2023-07-28.

బాహ్య లంకెలు మార్చు