వేదాంతం వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి "వేదాంతకవి"గా ప్రసిద్ధుడు. ఇతడు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి శిష్యుడు. ఇతని తండ్రి శంభుశాస్త్రి, అన్న లక్ష్మీకాంతం జాతీయోద్యమాలలో పాల్గొని ఉద్యమగీతాలను గొంతెత్తి పాడేవారు.[1] వారి ప్రభావంతో ఇతడు దేశసేవ, కవిత్వసేవ విడదీయలేని అనుబంధంగా ఏర్పరచుకుని కవితావేశానికి గురిఅయ్యాడు. ఇతడు 1928-1931ల మధ్య వివిధ జైళ్ళలో శిక్ష అనుభవించాడు. 1928లో జైలుకు వెళ్లినప్పుడు పుచ్చలపల్లి సుందరయ్యతో కలిసి ఒకే గదిలో ఉన్నాడు. ఆ శిక్షాకాలంలో పోలీసుల లాఠీదెబ్బలవల్ల కుడిచేతి ఉంగరం వేలు విరిగింది. తలకు బలమైన దెబ్బలు తగలడం వల్ల ఎడమకన్నుకు అంధత్వం ఏర్పడింది. ఇతని రచనలు శాంతి సంగ్రామం, స్వతంత్ర గర్జన, జమీన్ రైతు, రాజకోట ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వంచే నిషేధానికి గురి అయ్యాయి. రాజకోట నాటకాన్ని పేరుమార్చి కాంగ్రెస్ భారతం పేరుతో అచ్చువేశాడు. ఇతని భార్యపేరు పార్వతీదేవి.

రచనలు మార్చు

  1. ఆకలిమంట (నాటకం)
  2. తెనుఁగుతల్లి (నాటకం)
  3. ఛలో హైదరాబాద్ (నాటకం)
  4. విశ్వస్వరాజ్యం (నాటకం)
  5. జమీన్ రైతు (నాటకం)
  6. పంజాదెబ్బ
  7. కవితా సంస్థానము (విమర్శ)
  8. కష్టకాలం (నాటకం)
  9. గడుగ్గాయి
  10. కెరటాలు
  11. దండయాత్ర
  12. భగవన్మతభాష్యం
  13. వీర భారతము
  14. మహారథి కర్ణ (నాటకం)
  15. కల్పతరువు
  16. పట్టాభిషేకం
  17. బ్రిటీష్ గయోపాఖ్యానం (నాటకం)
  18. రాజకోట (నాటకం)
  19. శాంతి సంగ్రామము
  20. స్వతంత్ర గర్జన

బిరుదులు మార్చు

  • ఆంధ్ర బెర్నార్డ్‌షా

మూలాలు మార్చు

  1. జయధీర్ తిరుమలరావు (సంపాదకుడు) (1991). జమీన్ రైతు. తెలుగు విశ్వవిద్యాలయం. pp. v–ix. Retrieved 6 April 2016.