శతరూప ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సంవత్సరానికి ఒకసారి నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమం. తెలుగు భాషా సాంస్కృతిక వికాసానికి ఈ కార్యక్రమాలను రాష్ట్రప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇవి శతదినాలు అనగా వంద రోజులు జరిగే బృహత్కార్యం.[1] ప్రతిభావంతులైన కళాకారుల సృజన, ప్రదర్శనా పాటవాలకు ప్రోత్సాహక వేదికగా ఆ కార్యక్రమాన్ని రూపుదిద్దారు. వరుసగా వంద రోజులపాటు సకల కళారూపాలకు ఆహ్వానం పలుకుతూ మెరికల్లాంటి వారికి తొలి సోపానంగా ఈ కార్యక్రమం దోహదం చేస్తోంది. 2006లో మొదలైన మొదటి దశ శతరూపకు పర్యాటక శాఖ నిధులను సమకూర్చడంలోనూ, శిల్పారామం వంటి వేదికపై నిత్యం ప్రదర్శించే తీరును కొత్త దారిలోకి మళ్ళించడంలోనూ అప్పటి కార్యదర్శి అర్జా శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు. సాంస్కృతిక శాఖతోపాటు పర్యాటక రంగం, యువజన వ్యవహారాల శాఖల బాధ్యతల్ని జమిలిగా నిర్వహించడంలో ఆయన శతరూపకు తెరతీశారు. రాష్ట్రవ్యాప్తంగా గల కళారూపాల్ని గుర్తించి వాటికి సంబంధించిన వివరాలు, విశేషాల్ని ప్రచురించడంతోపాటు ఆయా కళారూపాల్లో నిష్ణాతులైన వారి జాబితాల్ని రూపొందించి గుర్తింపు కార్డులు జారీ చేయడంతో సాంస్కృతిక రంగం కొత్త ఒరవడిలోకొచ్చింది.[2]

శతరూప-2013 ప్రాంగణం

శతరూప-2013 మార్చు

  • అవధాన సప్తాహం.
  • శాస్త్రీయ, లలిత సంగీత సప్తాహం - 6 రోజులు.[3]
  • శాస్త్రీయ నృత్య సప్తాహం.

మూలాలు మార్చు

  1. "శతరూప ఉత్సవాలు నేటి నుంచి, ఆంధ్రజ్యోతి 2 ఆగష్టు 2013". Archived from the original on 2013-08-04. Retrieved 2013-09-05.
  2. gdurgaprasad (2013-10-29). "సమగ్ర కళా వేదికగా శతరూపం". సరసభారతి ఉయ్యూరు. Retrieved 2020-08-25.
  3. "'శతరూప'లో భాగంగా శాస్ర్తియ, లలిత సంగీత సప్తాహం, ఆంధ్రభూమి, 22 ఆగష్టు 2013". Archived from the original on 2013-12-03. Retrieved 2013-09-05.
"https://te.wikipedia.org/w/index.php?title=శతరూప&oldid=3264494" నుండి వెలికితీశారు