శర్మణ్య సామ్రాజ్యం

శర్మణ్య సామ్రాజ్యం లేదా జెర్మను సామ్రాజ్యం (శర్మణ్య: Deutches Kaiserreich), సామ్రాజ్య జర్మనీ, రెండవ రైఖ్ (Zweites Reich) అనేది, లేకపోతే కేవలం జర్మనీ (శర్మణ్యదేశం), 1871లో జరిగిన శర్మణ్యదేశ ఏకీకరణ నుండి 1918లో శర్మణ్య రైఖ్ ప్రభుత్వ రూపాన్ని రాజతంత్రం బదులు గణతంత్రంగా మార్చిన నవంబర్ విప్లవం వరకు శర్మణ్య రైఖ్లో ఒక కాలం.[1][2]

సామ్రాజ్యం స్థాపన 1871, జనవరి 18న, ఆస్ట్రియా, లీచ్టెనస్టెయిను తప్ప దక్షిణ శర్మణ్య రాజ్యాలు ఉత్తర శర్మణ్య కూటమిలో చేరాక జరిగింది, మరి కొత్త రాజ్యాంగం ఏప్రిల్ 6న అమల్లోకు వచ్చి సమాఖ్య రాజ్యం పేర్ను శర్మణ్య సామ్రాజ్యం అని మార్చి శర్మణ్య చక్రవర్తి అనే బిరుదు హొహెంజొల్లెర్ను వంశానికి చెందిన ప్రష్యా రాజు విల్హెల్మ్ I కోసం పరిచయం చేసింది.[3] ఒటో వాన్ బిస్మార్క్, ప్రష్యా మంత్రి-రాష్ట్రపతి ప్రభుత్వ ముఖ్యాధికారి, చాన్సెలరు అయ్యాడు. బెర్లిను రాజధాని గా మిగిలింది, అదే సమయంలో ప్రష్యా నడపిచ్చిన ఉత్తర శర్మణ్య కూటమినూ దాని దక్షిణ శర్మణ్య మిత్రులూ, అంటే బాడెను, బవేరియా, వుర్టెంబర్గు, హెస లాంటివి, పరాసు-ప్రష్యా యుద్ధంలో ఇంకా పాల్గోంటున్నారు. శర్మణ్య సామ్రాజ్యానికి 25 రాష్ట్రాలు (ప్రతిదానికి స్వంత ప్రభువులున్నవి) నాలుగు భాగమైన రాజ్యాలు, ఆరు గ్రాండు డచీలు, అయిదు డచీలు (1876 వరకు ఆరు), ఏడు ప్రిన్సిపాలిటీలు, మూడు స్వతంత్ర హాన్సియాటిక నగరాలు, ఒక సామ్రాజ్య భూభాగం ఉండేవి. ప్రష్యా ఏమో దశంలో నాలుగు రాజ్యాల్లో ఒకటి, కానీ సామ్రాజ్యంలో మూడులో రెండు వంతలు భూమి, జనాభా, అందులో ఉండేవి, అలాగే ప్రష్యా మహత్వానికి రాజ్యాంగంలో స్థాపనుండేది, ఎందుకంటే ప్రష్యా రాజే శర్మణ్య చక్రవర్తి (Deutscher Kaiser).

1850 తర్వాత, శర్మణ్యదేశ రాజ్యాల్లో పరిశ్రామికీకరణ వేగంగా జరిగింది, ప్రత్యేకంగా బొగ్గులో, ఇనుములో (తర్వాత ఉక్కులో), రసయాయనల్లో, రైలు మార్గాల్లో శక్తులు. 1871 లో శర్మణ్యదేశానికి 4.1 కోట్ల మనుషుల జనసంఖ్య ఉంది, 1913కి ఇది 68 కోట్లకు పెరిగింది. 1815లో ఎక్కువ గ్రామీణ రాజ్యాల ప్రాంతమైన శర్మణ్యదేశం, సంయుక్తం అయ్యేటప్పటికి ప్రధానంగా పట్టణగా అయింది.[4] శర్మణ్య పరిశ్రామికీకరణ విజయం 20వ శతాబ్దం మొదట్లో రెండు విధాలుగా ఏర్పడింది, శర్మణ్య కర్మాగారాలు సామాన్య పరాసువాటిల్ల (ఫ్రెంచి) కంటే, బ్రిటీషువాటిల్ల కంటే పెద్దగానూ ఆధునికంగా ఉండడం.[5] సహజ శాస్త్రాల్లో శర్మణ్య సామ్రాజ్య ఆధిపత్యం, ముఖ్యంగా భౌతిక శాస్త్రంలోనూ, రసాయన శాస్త్రంలోనూ, ఎంత ఉండేదంటే, నోబెల్ బహుమతుల్లన్నిట్లో మూడులో ఒక వంత శర్మణ్య కల్పయితలకూ పరిశోధకులకూ వెళ్ళాయి. శర్మణ్య సామ్రాజ్యం, దాని 47 సంవత్సరాల ఉనికిలో ఐరోపాలo పరిశ్రమలో, విజ్ఞానంలో, సాంకేతికంలో అత్యున్నతమైన దేశం అయింది, అలాగే 1913కి శర్మణ్యదేశం ఐరోపాలో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగానూ ప్రపంచంలో మూడవ అతిపెద్దదానిగానూ అయింది.[6] ఐరోపాలో అతిపొడవైన రైలు మార్గ యంత్రాంగాన్నీ ప్రపంచంలో అతిబలవంతమైన సైన్యాన్నీ[7] వేగంగా పెరుగుతున్న పరిశ్రామిక స్థాపననూ కుదిర్చిన శర్మణ్యదేశం ఒక మహాశక్తి రాజ్యంగా కూడా అయింది.[8] 1871లో చాలా చిన్నగా మొదలయ్యాక, నౌకాదళం ఒక దశాబ్దంలో బ్రిటను రాజరిక నౌకాదళానికే చిన్నది అయింది.

  1. Toyka-Seid, Gerd Schneider, Christiane. "Reichsgründung/ Deutsches Reich | bpb". bpb.de (in జర్మన్). Archived from the original on 26 October 2020. Retrieved 2020-09-21.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)
  2. Sturm, Reinhard. "Vom Kaiserreich zur Republik 1918/19 – Weimarer Republik". bpb.de (in జర్మన్). Archived from the original on 17 September 2021. Retrieved 2020-09-21.
  3. Michael Kotulla: Deutsches Verfassungsrecht 1806–1918.
  4. J. H. Clapham, The Economic Development of France and Germany 1815–1914 (1936)
  5. "Germany article of Encyclopedia Britannia, Link". Archived from the original on 24 January 2022. Retrieved 12 January 2022.
  6. Azar Gat (2008). War in Human Civilization. Oxford University Press. p. 517. ISBN 978-0-19-923663-3.
  7. Alfred Vagts, "Land and Sea Power in the Second German Reich."
  8. Paul Kennedy, The Rise and Fall of the Great Powers: Economic Change and Military Conflict from 1500 to 2000 (1987)