శశిబిందువు క్రోష్టువంశజుఁడు అగు చిత్రరథుని పుత్రుఁడు. ఇతఁడు అనేక భార్యలును పుత్రులును కలవాఁడు. అందు ముఖ్యులు ఆఱ్గురు. పృథుశ్రవుఁడు, పృథుదాసుఁడు, పృథుకీర్తి, పృథుజయుఁడు, పృథుకర్ముఁడు, పృథుయశుఁడు. ఈశశిబిందువు చతుర్దశమహారత్నుఁడు అయిన చక్రవర్తి అని పేర్కొనఁబడియెను.

చతుర్దశమహారత్న వివరణము-

చక్రంరథోమణిః ఖడ్గంచర్మరత్నంచ పంచమం
కేతుర్నిధిశ్చ సప్తైవ ప్రాణహీనానిచక్షతే|
భార్యాపురోహితశ్చైవసే నానీరథకృచ్చయః|
పత్యశ్వకలభాశ్చేతిప్రాణిన స్సప్తకీర్తితాః

(ఇచట రత్నము అనఁగా జాతిశ్రేష్ఠసంజ్ఞ.)]